అది 1948 వ సంవత్సరం, జనవరి 30 వ తేది,శుక్రవారం. మహాత్మ యధావిధి గా
తెల్లవారుఝామున 3-30 గంటలకు నిద్రలేచారు. ప్రాతః:సమయ ప్రార్ధన
తర్వాత, కాంగ్రెస్ సంస్థాగత Constitution కి తుది మెరుగులు
దిద్దుతున్నారు. అటుపైన కొన్ని ఉత్తరాలకు సమాధానాలు వ్రాశారు. కొంతమంది
ఆత్మీయులు,వారి వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని ఈ విధంగా
అన్నారు " ఇప్పుడు ఆ పనులన్నీ చేయవలసిన అత్యవసరమేమున్నదని ?" అందుకు గాంధీ
గారు " రేపు అనేది వాస్తవం కాదు. రేపు నేను మీ మధ్య ఉండకపోవచ్చు కదా!" అని
బదులు చెప్పారు.ప్రార్ధనా మందిరానికి బయలుదేరుతుండగా యెవరో అన్నారట--ఈ రోజు
మీరు అంత ఉల్లాసంగా కనపడటంలేదు, కాబట్టి ఇవాళ ప్రార్ధనకు పోక పొతే ఏమి
పోయింది? అని. అందుకు మహాత్ముడు " ఒకవేళ నాకు మరణం సంభవిస్తే, అది ప్రార్ధన
సమయంలోజరగాలని నాకోరిక. నాకు జరగపోయే హాని/మృత్యవు నుంచి నన్ను ఒక్క
భగవంతుడు తప్ప మిగిలిన వారెవ్వరూ కాపాడలేరు" అన్నారు.. మహాత్ముడు ప్రార్ధనకు
వెళ్లి ప్రార్ధనకు ఉపక్రమించిన వెంటనే హిందూ మతోన్మాది అయిన గాడ్సే తుపాకి
గుండ్లకు
నేలకొరిగి "హే రాం!" అని మృత్యవు ఒడిలోకి జారిపోయారు. ఈ వార్త దావానలంలా దేశమంతా వ్యాపించి ప్రజలందరూ శోక తప్తులయ్యారు.
చితి మీద మహాత్ముని భౌతిక కాయాన్ని తల ఉత్తర దిశ వైపు ఉండేటట్లు
పడుకోబెట్టారు. బుద్ధుడు కూడా అదే విధంగా తల ఉత్తర దిశగా వున్నప్పుడే భౌతిక
యాత్ర ముగించాడు. అదే రోజు సాయంత్రం 4-45 గంటల సమయంలో గాంధీ గారి మూడవ
కుమారుడైన రామదాసు గారు చితికి నిప్పు అంటించారు. అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున
పైకి ఎగిసి పడ్డాయి. స్త్రీలు పురుషులు గుండెలు బాదుకుంటూ ఆ దృశ్యాన్ని
చూస్తూ భోరున విలపిస్తున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
గజగజలాడించిన 'సత్యాగ్రహి' దేహం బూడిదగా మారటానికి యెంతో సేపు పట్టలేదు.
ప్రజలు
యెంత రోదించినా, భారతమాత మాత్రం తనకు దాస్య విముక్తి కలిగించి,అలసిసొలసిన
తన ముద్దుబిడ్డను ప్రేమగా తన ఒడిలోకి తీసుకొని ఆనందించింది.
భారత జాతిపిత అలా తన దేహయాత్ర ముగించారు.
మహాత్మాగాంధీ దహన సంస్కారాల అరుదైన చిత్రాలు
చదవడం వలన ప్రయోజనం ఏమిటంటే నలు మూలల నుంచి వచ్చే విజ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి జీవిత పాఠాలను నేర్చుకోవడం.- గాంధీజీ
********
నియమబద్ధ జీవితానికి కోర్కెలను జయించడం మొదటి మెట్టు. - గాంధీజీ
నియమబద్ధ జీవితానికి కోర్కెలను
*********
మహాత్మాగాంధీకున్న మనోబలం ఈరో జు ఎందరికి ఉంది ? అప్పుడే కొన్నిదేశాలలో వాళ్ళు, " గాంధీనిజం గా ఒక మనిషేనా లేక కట్టుకథా ? అంతటి సంకల్ప బలం మానవమాత్రులకు ఉండడం సహజమా " అనుకుంటున్నారట.
*********
శ్రీ టీవీఎస్.శాస్త్రి గారు పంపిన ఇ మెయిల్ సందేశం
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 110
No comments:
Post a Comment