Sunday, January 1, 2012

నూతనోత్సాహం

 నూతనోత్సాహం నింపుకున్న నూతన సంవత్సరం వచ్చేసింది
చెడు జ్ఞాపకాలను పారద్రోలుతూ మంచి అనుభూతుల్ని నింపుకోవాలని అందరి ఆకాంక్ష
నేను, నాది అనే స్వార్థం నుండి అందరూ బాగుండాలని జగమంతా కోరుకునే శుభాకాంక్ష

2011 ను విశ్లేషిస్తే తెలుగు వారికి మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందేమో !
రాజకీయనాయకులాడిన చదరంగంలో అనేకమంది జీవితాలతో బాటు  తెలుగు భాష, సంస్కృతి, పరువు బలయిపోయాయి.
ఎంతోమంది ప్రముఖుల్ని తీసుకుపోయింది.
దానికి వర్షాభావం వల్ల కరువు కూడా తోడయింది.
వెడుతూ వెడుతూ చివరలో తమిళ సోదరులను ' థానే ' తుఫాను కుదిపేసింది.

ఇప్పుడు అందరి ఆకాంక్ష.....
2012  లో నైనా తమవారికి, లోకానికి మంచి జరగాలనే శుభాకాంక్ష.

చివరగా ఒక మాట. 2009  లో బ్లాగు ద్వారా మొదలైన నా అంతర్జాల యాత్రలో ప్రపంచం నలుమూలల నుంచీ ఎంతోమంది మిత్రులు లభించారు. ప్రోత్సాహాన్ని అందించారు. 2011  లో వారిలో చాలామంది ఆప్తబంధువులై పోయారు. విడదీయలేని బంధం ఏర్పరుచుకున్నారు. ప్రోత్సహిస్తున్నారు. చేదోడు వాదోడుగా నిలబడుతున్నారు. ఆ రకంగా నాకు మాత్రం 2011 మంచే చేసిందని చెప్పుకోవచ్చు.

మన తెలుగు సరస్వతికి నా శక్తి మేరకు సేవ చెయ్యాలనే సంకల్పంతో 2011  ఆగష్టు లో ' శిరాకదంబం ' వెబ్ పత్రిక ప్రారంభించాను. నా ఆసక్తి, నా ' శక్తి ' మాత్రమే పెట్టుబడిగా ప్రారంభించిన ఆ పత్రికకు ఎంతోమంది మిత్రులు ఉత్సాహంగా తమ రచనలను, చిత్రాలను పంపుతూ ప్రోత్సహించారు.... ప్రోత్సహిస్తున్నారు. ఇంత స్పందనను నేను ఊహించలేదు. ఇంకా ఎంతోమంది మిత్రులు ఉత్సాహం చూపుతున్నారు.
ఇందులో ఆర్థిక ప్రసక్తి లేదు. జమా ఖర్చులు లేవు.
చేదోడు వాదోడుగా నిలబడి నడిపిస్తున్న మిత్రులందరి ప్రోత్సాహమే వారానికి రెండురోజులు పూర్తిగా నన్ను బయిట ప్రపంచం మర్చిపోయేలా చేసింది... చేస్తోంది. ఈ ప్రోత్సాహం లేకపోతే నేను కూడా నీరస పడేవాడినేమో !

ప్రతీ సంచికకూ చదువరులు, వీక్షకులు పెరుగుతున్నారు. అది కూడా నన్ను మరింత ఉత్సాహపరుస్తోంది. పెద్ద వార్తా పత్రికల సరసన చిన్న పత్రికలున్నట్లే ... ప్రస్తుతం ఈ పత్రిక.... వెబ్ పత్రికల్లో చిన్న పత్రిక.
2012  లో మీ అందరి ప్రోత్సాహం, సహకారంతో పెద్ద పత్రికగా రూపు దిద్దుకోవాలని కోరుకుంటూ............ Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No.098

20 comments:

జయ said...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Wish You A Happy New Year 2012

Padmarpita said...

మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Sai said...

మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Anuradha said...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Palla Kondala Rao said...

మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మాలా కుమార్ said...

happy new year

సుభ/subha said...

మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

phani said...

రావు గారూ శిరాకదంబం బావుంది. నేను ఇదే మొదటి సారి చూడడం. మరింత ఎదగాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

♛ ప్రిన్స్ ♛ said...
This comment has been removed by the author.
♛ ప్రిన్స్ ♛ said...

!! SRRao !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీలలిత said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం said...

SR Rao గారు,
నూతన సంవత్సర శుభాకాంక్షలు
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

SRRao said...

* జయ గారు
* రాజీ గారు
* పద్మార్పిత గారు
* సాయి గారు
* అనూరాధ గారు
* కొండలరావు గారు
* మాలాకుమార్ గారు
* సుభ గారు
* ఫణి గారు
* బులుసు సుబ్రహ్మణ్యం గారు
* ' తెలుగు పాటలు ' గారు
* శ్రీలలిత గారు
* మంత్రిప్రగడ వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు,

అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో..... ధన్యవాదాలు

Unknown said...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు

శోభ said...

మీకు మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు బాబాయ్‌గారూ....

SRRao said...

* SPLENDOR OF YOGA గారూ !
* శోభమ్మా !
ధన్యవాదాలు

పేరు... జగన్ said...

శిరా గారు... నూతన సంవత్సర శుభాకాంక్షలు...

SRRao said...

జగన్ గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం