Saturday, December 29, 2012

ప్రవాసాంధ్ర తెలుగు.... శ్రీ దత్త జయంతి ....

 
* మనలో వుండే రజస్సు, సత్వము, తమస్సు అనే మూడు గుణములకు ప్రతీకలు త్రిమూర్తులు.
ఈ మూడు గుణములను కలిగివున్న వాడు అత్రి మహర్షి.

అసూయ, ఈర్ష్యలు లేకపోవడమే ఆయన భార్య పేరు అనసూయకు అర్థం.
త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడిని కన్న తల్లిదండ్రుల వెనుక విశేషమిది. 
 శ్రీదత్త జయంతి సందర్భంగా డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ ... 04 వ పేజీలో...

* నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా ప్రత్యేక సంచిక లో  ప్రవాసంలో ఉంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కృషి చేస్తున్న కొందరి ప్రవాసాంధ్రుల విశేషాలు ' ప్రవాసాంధ్ర తెలుగు '  .....



* మొత్తానికి మరో సంవత్సరం అంతానికి వచ్చింది. ఎన్నో ఒత్తిళ్లతో, ఒడిదుడుకులతో 2012 వ సంవత్సరం పూర్తి అవుతోంది. చివరిలో ప్రపంచాన్ని యుగాంతం టెన్షన్ పెట్టి అంతా వట్టిదే అని ఊపిరి పీల్చుకునే లోపు భారత దేశాన్ని మరో వికృత చేష్ట కుదిపి వేసింది. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారు దొరలుగా చలామణీ అయిపోతున్నారు. సృష్టికి మూలమైన అది పరాశక్తి గా కొలిచే స్త్రీ ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. యుగాంతం ఇప్పుడు కాకపోయినా ద్వాపర యుగంలో యాదవ కుల వినాశనానికి పుట్టిన ముసలం ఇప్పుడే పుట్టిందేమో అన్న అనుమానం బలపడుతోంది.
అయినా ఈ ముసలం ఎదురు తిరిగి దుర్మార్గులు, దోపిడీదారుల మీదకు తిరగకపోతుందా.... దుష్టత్వం అంతమవకపోతుందా అన్న ఆశతో క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలకక తప్పదు.
అందుకే అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో .....   

ఈ వారం శిరాకదంబం 02_019 సంచికలో  ....




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 061

Sunday, December 23, 2012

వైకుంఠ ద్వార దర్శనం... ముత్యాల ముగ్గు.... ఇంకా

* వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం పుణ్యదాయకం అంటారు.

 * ముంబై దాడుల్లో తీవ్ర వాదుల నుంచి ప్రజలను రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేసిన సాహస వీరుడు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గురించి కథనం ' జైహింద్ ' లో

* సంక్రాంతి నెల ప్రత్యేకం ' ముత్యాల ముగ్గు '

ఇంకా ఎన్నో విశేషాంశాలు ఈ వారం శిరాకదంబం 02_018 సంచిక లో .....


  తెలుగు మహాసభల సందర్భంగా దేశ విదేశాల్లోని 
తెలుగు సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 060

Sunday, December 16, 2012

కాలమనే సర్పం ..... వీణకు పట్టాభిషేకం... ఇంకా


జీవితంలో నిచ్చెనలే కాదు...  కాలమనే సర్పం కూడా వుంటుంది.
అదే వైకుంఠపాళీ.
ప్రతీ పనిలోనూ, ప్రతి విషయంలోనూ అథ్యాత్మిక మేళవించిన సంస్కృతి మనది. అదే సనాతన ధర్మం.
ఇంట్లోకి పురుగూ, పుట్రా రాకుండా కాపాడడమే కాదు మనలోని జ్ఞానానికి సంకేతంగా కూడా నిలుస్తుంది కార్తీక దీపం.  
కార్తీక మాస వైశిష్ట్యం గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు చెప్పిన విశేషాలు మరికొన్ని.... 
ఇంకా ఎన్నో... ఎన్నెన్నో.... 
ఈ వారం శిరాకదంబం పత్రికలో ...


  Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 059

Friday, December 7, 2012

గ్లామర్... గ్లామర్... విద్యాసాగర్ తో .....

*  కార్తీక మాసం విశిష్టమైనది.
మనకి ఇంతమంది దేవుళ్ళ అవసరం ఏమిటి ?
...... డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి ' కార్తీక మాస ప్రాశస్త్యం ' లో
* మాధురీకృష్ణ అందించిన ప్రముఖ సంగీత దర్శకులు విద్యాసాగర్ తో ఫోన్ ఇన్ ......
* తటవర్తి జ్ఞానప్రసూన గారు అందించిన  గ్లామర్ గురించి రావూరి గారి ' పిల్లగాలులు - పిల్లనగ్రోవి '
 * లెఫ్టినెంట్ కల్నేల్ పునీత్ నాథ్ దత్ సాహసం జయ పీసపాటి గారి " జైహింద్ 10  "

ఇంకా ఈ సంచికలో .......




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 038

Saturday, November 24, 2012

కార్తీక పురాణము.... అంజలీదేవితో ఫోన్ లో ....



ఈ వారం శిరాకదంబం లో ........... 
డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి కార్తీక పురాణ విశేషాలు,
ఓలేటి వెంకట సుబ్బారావు గారి దాశరథీ శతకం.
దూరదర్శన్ విజయదుర్గ గారు నిర్వహించిన శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారి అంతరంగ కథనం రెండవ భాగం
తటవర్తి జ్ఞానప్రసూన గారు అందించిన వింత దొంగతనాలపై రావూరి వారి పిల్ల గాలులు – పిల్లనగ్రోవి,
లలితాస్రవంతి స్వరంలో డా. దవులూరి శ్రీకృష్ణమోహనరావు గారి చింతాలూ పతివ్రతే ! కథ గురించి,
శత్రువుల చేతిలో చిత్రహింసలకు గురై వీరమరణం పొందిన యువ జవానులకు మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏమిటి ? జయా పీసపాటి గారి జైహింద్ లో...    
ఇంకా మరెన్నో .... 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 037

Sunday, November 18, 2012

అంతరంగ కథనం... పిల్లగాలులు-పిల్లనగ్రోవి....

భక్త రామదాసు రచన ‘ దాశరథీ శతక ‘ పద్యాలు ఓలేటి వెంకట సుబ్బారావు గారి స్వరంలో....
తెలుగువారికి జాతీయ స్థాయిలో పురస్కారాలు రావడమే అరుదు. ఆ అరుదైన ఘనత సాధించి తెలుగు నాదాన్ని దేశ రాజధానిలో వినిపించిన శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారి ‘అంతరంగ కథనం ‘ లో మొదటి భాగం .....
గత తరం ప్రముఖ రచయిత రావూరి వెంకట సత్యనారాయణ గారి ఖజానా లోని ‘ పి‌ల్లగాలులు – పిల్లనగ్రోవి ‘ కబుర్లు ప్రారంభం....

**********************************************************************

బ్నిమ్ గారి ‘ భామ నామాలు ‘ కథ గురించి లలితాస్రవంతి స్వరంలో...   
ఇంకా మరెన్నో  విశేషాలతో .... ఈవారం శిరాకదంబం 02_014 సంచిక లో   






Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 036

Tuesday, November 13, 2012

చీకటి వెలుగుల రంగేళి...

 మనందరిలోనూ ఒక నరకాసురుడు వుంటాడు.
సమయం వచ్చినపుడు బయిటకు వస్తాడు.
చెయ్యల్సినదంతా చేసేసి పోతాడు. మనకేమీ తెలియదు.
మనకి తెలియక ముందే అంతా ముగిసిపోతుంది.
జరగాల్సిన నష్టం జరిగిపోతుంది..
అందుకే ముందు మనలోని నరకుడిని నరుకుదాం.
నరకుడే మన సమాజ ప్రగతి నిరోధకుడు... 
దానవత్వాన్ని వదిలిపెట్టి మానవత్వం వైపు పయనిద్దాం..
చీకటి తెర తొలగి వెలుగుల పువ్వులు విరజిమ్మిన వేళ
అదే వెలుగులోకి పయనం.. అదే నిజమైన దీపావళి 

  మిత్రులందరికీ  దీపావళి శుభాకాంక్షలతో...  





Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 04 Pub. No. 035

Monday, November 12, 2012

నరకాసుర వథ... సుందరం శివం...

 దీపావళి శుభాకాంక్షలతో....

రాక్షసులంటూ విడిగా వుండరు. 
ప్రతి మనిషిలోను రాక్షసుడు దాక్కుని వుంటాడు.
వాడిని బయిటకు లాగి అంతం చేయమనే దానికి సంకేతమే ఈ రాక్షస సంహారం.... తదనంతర సంబరం. 
నరకాసుర వధ వెనుక వున్న కథ....
మనలో వున్న నరకాసురులను వదిలించుకోవడం ఎలా ?
వివరణ ' నరకాసుర వధ ' .... 02 _013  సంచిక 04  అ పేజీలో ... 
ఇంకా ఈ దీపావళి సంచికలో............






Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 034

Saturday, November 3, 2012

దాశరథీ శతకం.... హాంగ్ కాంగ్ లో దసరా....ఇంకా.....

అట్లతదియ విశేషాలు....
దాశరధీ శతకం....
హాంగ్ కాంగ్ లో దసరా సంబరాలు ....
వీనుల విందు- బహు పసందు, కథాస్రవంతి, కవితలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో విశేషాలు..... 




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 033

Thursday, November 1, 2012

ఈ వారం శిరాకదంబం....

ఈ వారం శిరాకదంబం అంతర్జాల వారపత్రికలో  ....






Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 032

Saturday, October 27, 2012

నవ దుర్గలు.... తమిళ నాట తెలుగు వెలుగు.... పదకేళి

 దుర్గాదేవిని నవ దుర్గలుగా కొలుస్తారు.
అసలు ఈ నవదుర్గలు ఎవరు ?
వారి విశేషాలు ఏమిటి ?
..... వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు .... 04 వ పేజీలో...
ప్రవాస భారతీయులైన తెలుగు వారికి తెలుగు భాష మీద మక్కువ ఎక్కువైంది. అలాగే ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారిలో కూడా ఇటీవలి కాలంలో ఆసక్తి పెరిగింది. తమిళనాట తెలుగు పరిస్థితి ఏమిటో మాధురీకృష్ణ కథనం ...... 15 వ పేజీలో
మీ తెలుగు భాషా పరిజ్ఞానికి ఒక చిన్న పరీక్ష .... పదకేళి 01 .... 25  వ పేజీలో.....
ఇంకా అనేక విశేషాలతో ఈ వారం శిరాకదంబం ఈ క్రింది లింకులో....
 02_011

 మీ అమూల్యాభిప్రాయాలు కోరుకుంటూ.....


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 031

Wednesday, October 24, 2012

శక్తిస్వరూపిణి ' విజయ' దశమి

దుష్టత్వం, క్రూరత్వం, రాక్షసత్వం..... వీటన్నిటి మీదా విజయ దుందుభి మోగించిన రోజు...
 అమ్మ శక్తి విజృంభించి కాళికయై విరుచుకు పడి మహిషాసురుడి రూపంలో వున్న చెడుని చీల్చి చెండాడిన రోజు ...
మరి నేడు...
అలాంటి చెడులో భాగస్వాములు కాకుండా అవినీతి రక్కసిని, లింగ వివక్షా భూతాన్ని, దౌర్జన్యకర.. దుర్మార్గ శక్తుల్ని దునుమాడే దుర్గలుగా ప్రతీ స్త్రీ తయారు కావాలి.

ఈ విజయదశమి దానికి నాంది కావాలని కోరుకుంటూ....

 మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో............... 

శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు తమ గళంలో అందించిన శ్రీ దుర్గా స్త్రోత్ర మాలిక చివరి భాగం వినండి......




Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 030

Tuesday, October 23, 2012

అయిగిరి నందిని.....

 అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే !
గిరిధర వింధ్య శిరోదిని వాసిని విష్ణువిలాసిని జిష్ణుముఖే !
భగవతిహే శితికంఠకుటుంబిని  భూరి కుటుంబిని భూరికృతే !
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్య కపర్తిని శైల సుతే !

************************************************
 మిత్రులందరికీ మహర్నవమి శుభాకాంక్షలు 
************************************************

శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారి స్వరంనుంచి వెలువడిన దుర్గా స్త్రోత్ర మాలిక వినండి.......




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 029

Monday, October 22, 2012

దుర్గా స్త్రోత్రం....శాకుంతలం....ఎక్స్ కిరణాలు....



 కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలం కు ఎర్రమిల్లి శారద గారి పరిచయం.....14 వ పేజీలో....





ఋణపు కిరణాల్ - వెలియు తోడనే
శాస్త్ర రూపము - మారిపొయేను
నత్త నడకల - నడచు శాస్త్రము
వేగ వృద్ధి - పొందె నప్పుడు
....... ఎక్స్ కిరణాల గురించి తెలుగు పద్యాలలో చెబుతున్నారు పంతుల సీతాపతి రావు గారు.....15 వ పేజీలో.....


శిరాకదంబం 02 _010 వ సంచికలో ...... 


మిత్రులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలతో....
శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు గానం చేసిన దుర్గా స్త్రోత్రం.......




Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 028

Sunday, October 21, 2012

తోలుబొమ్మలాట... మేజర్ ఆచార్య...

 కనుమరుగై పోతున్న ప్రాచీన జానపద కళ ' తోలుబొమ్మలాట '. 
ఆ కళ ను సజీవం చేసేందుకు చేసిన ప్రయత్నం గురించి మాధురీకృష్ణ అందించిన కథనం...... 10 వ పేజీలో.....





మేజర్ ఆచార్య చివరి సారిగా 19 జూన్ 1999 తన తండ్రికి ఉత్తరం వ్రాస్తూ :-
" జీవనకాలంలో యుద్ధం ఒక గౌరవప్రదమైన అవకాశం. అంతకన్నా తక్కువగా నేను ఆలోచించలేను. ఇంతకన్నా మంచి దేశ సేవ ఉండదు "

........... జైహింద్ శీర్షికన జయ పీసపాటి గారు ఈ వారం అందించిన మేజర్ పద్మపాణి ఆచార్య గురించిన కథనం..... 27 వ పేజీలో...... 


ఈ వారం శిరాకదంబం 02_010  సంచికలో.... 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 027

Saturday, October 20, 2012

తెలుగు నాదం.... దుర్గా రూపాలు...

తెలుగు వెలుగులు ప్రసరించి, తెలుగు నాదాన్ని వినిపించి దేశ రాజధాని నుంచి రాష్ట్ర రాజధానికి విచ్చేసిన కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మహతి కళానిధి శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారికి స్వాగతం...... సుస్వాగతం..... 06 వ పేజీలో...... 



దుర్గాదేవి అవతారాలు, అలంకారాల గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ..... 04 వ పేజీలో....  

https://sites.google.com/site/siraakadambam/home/02010 
                                



Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 04 Pub. No. 026

దుర్గ రూపాలు... తోలుబొమ్మలాట...


 దసరా శుభాకాంక్షలతో....  
 దుర్గాదేవి అవతారాలు, అలంకారాల వివరణ....
తెలుగు నాదాన్ని దేశరాజధాని లో వినిపించిన శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారికి ' స్వరాభినందన '
మరుగున పడిపోతున్న ప్రాచీన జానపద కళ ' తోలుబొమ్మలాట ' ....
ఇంకా ఎన్నో..... ఎన్నెన్నో.... విశేషాలతో...
 ఈ వారం.... శిరాకదంబం.....

తాజా సంచిక కోసం 02 _010 పైన క్లిక్ చెయ్యండి.......


 మీ అమూల్యమైన అభిప్రాయాలూ కోరుకుంటూ.....


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 025

Saturday, October 13, 2012

మహాలయము..... పర్యావరణము.....

* బాద్రపద మాసంలో వచ్చే అతి ముఖ్యమైన విలక్షణమైన దినాలు ' మహాలయ పక్షం '
మరణించిన తమ పూర్వీకులను, పితరులను తలచుకోవడం అన్ని మతాలలో వున్న సంప్రదాయమే !
అసలు మహాలయం అంటే ఏమిటో, ఆ విశేషాలు ఏమిటో  మహా ' లయం ' లో .......

* పర్యావరణము గురించి తేట తెనుగు పద్యాలలో చెబితే.....

* రచయితగా, సామాజిక కార్యకర్తగా మారిన సైనికుడి గురించి ' జైహింద్ ' లో....

 * ' దసరా సంబరాలు ' ఆడియో కార్యక్రమంలో పాల్గొనండి. 
వివరాలకు editorsirakadambam@gmail.com లో సంప్రదించండి.
 

..... ఇలా ఎన్నో విభిన్న అంశాలతో.... ఈ వారం శిరాకదంబం ఈ క్రింది లింకులో.....

https://sites.google.com/site/siraakadambam/home/02009






Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 024

Saturday, October 6, 2012

' దసరా సరదాలు ' గురించి.....


 అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు 

.... నాలుగయిదు దశాబ్దాల క్రితం వరకూ తెలుగు నాట ప్రతీ పల్లెలో, పట్టణంలో పిల్లలందరూ దసరాల్లో సరదాగా పాడుకున్న పాట ఇది. ఇప్పుడు దాదాపుగా కనుమరుగయింది. కానీ అప్పటి తరానికి జ్ఞాపకాల్లో ఇంకా ఆ దసరా సరదాలు మిగిలే వుంటాయి. దసరా అంటే పూజలు మాత్రమే కాదు.... సెలవులు, ఉత్సవాలు, నాటకాలు, బంధువుల రాక…. ముఖ్యంగా అల్లుళ్ళ అలక, పిండివంటలు, కోలాటాలు, చెక్క భజనలు, సాము గరిడీలు, పోటాపోటీలు, ఊరేగింపులు.... అబ్బో .... కోలాహలమే కోలాహలం.   

జ్ఞాపకాల పొరల్లో మిగిలిపోయిన ఆ సరదాల్ని వెలికి తీసి ఇప్పటి తరానికి మన సాంప్రదాయాన్ని తెలియ చెప్పడానికే శిరాకదంబం దసరా సంచిక కోసం ప్రత్యేకంగా దసరా సరదాలు అనే ప్రత్యేక ఆడియో కార్యక్రమం రూపకల్పన చేయాలని సంకల్పం. 

 అప్పటి తరం తమ దసరా సరదా జ్ఞాపకాల్ని, ఇప్పటి తరం తమ పెద్దల ద్వారా విన్న సరదాలని తమ స్వరంలోనే  అందరికీ తమ జ్ఞాపకాలని వినిపించే అవకాశం. 



దసరా సరదాలు ఆడియో కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు తమ వివరాలతో వెంటనే ఈ క్రింది ఇ మెయిల్ చిరునామా లో సంప్రదించండి. 



**********************************************************************

 ఇక విభిన్నమైన అంశాలతో క్రొత్త రూపుతో మీ ముందుకు ఈ వారం శిరాకదంబం ఈ లింకులో ......... 

sirakadambam 02 _008  
 

 పత్రిక మీద, రచనల మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను అందించగలరని ఆశిస్తూ ......



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 023
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం