* మనలో
వుండే రజస్సు, సత్వము, తమస్సు అనే మూడు గుణములకు ప్రతీకలు
త్రిమూర్తులు.
ఈ
మూడు గుణములను కలిగివున్న వాడు అత్రి
మహర్షి.
అసూయ,
ఈర్ష్యలు లేకపోవడమే ఆయన భార్య పేరు అనసూయకు అర్థం.
త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడిని కన్న తల్లిదండ్రుల వెనుక విశేషమిది.
శ్రీదత్త జయంతి సందర్భంగా డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ ... 04 వ పేజీలో...* నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా ప్రత్యేక సంచిక లో ప్రవాసంలో ఉంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కృషి చేస్తున్న కొందరి ప్రవాసాంధ్రుల విశేషాలు ' ప్రవాసాంధ్ర తెలుగు ' .....
* మొత్తానికి
మరో సంవత్సరం అంతానికి వచ్చింది. ఎన్నో ఒత్తిళ్లతో, ఒడిదుడుకులతో 2012 వ సంవత్సరం పూర్తి
అవుతోంది. చివరిలో ప్రపంచాన్ని యుగాంతం టెన్షన్ పెట్టి అంతా వట్టిదే అని ఊపిరి
పీల్చుకునే లోపు భారత దేశాన్ని మరో వికృత చేష్ట కుదిపి వేసింది. ప్రజల సొమ్ము
దోచుకుంటున్న వారు దొరలుగా చలామణీ అయిపోతున్నారు. సృష్టికి మూలమైన అది పరాశక్తి గా
కొలిచే స్త్రీ ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. యుగాంతం ఇప్పుడు
కాకపోయినా ద్వాపర యుగంలో యాదవ కుల వినాశనానికి పుట్టిన ముసలం ఇప్పుడే పుట్టిందేమో
అన్న అనుమానం బలపడుతోంది.
అయినా
ఈ ముసలం ఎదురు తిరిగి దుర్మార్గులు, దోపిడీదారుల మీదకు తిరగకపోతుందా.... దుష్టత్వం అంతమవకపోతుందా అన్న ఆశతో
క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలకక తప్పదు.
అందుకే
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో .....
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 061
No comments:
Post a Comment