Saturday, October 6, 2012

' దసరా సరదాలు ' గురించి.....


 అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు 

.... నాలుగయిదు దశాబ్దాల క్రితం వరకూ తెలుగు నాట ప్రతీ పల్లెలో, పట్టణంలో పిల్లలందరూ దసరాల్లో సరదాగా పాడుకున్న పాట ఇది. ఇప్పుడు దాదాపుగా కనుమరుగయింది. కానీ అప్పటి తరానికి జ్ఞాపకాల్లో ఇంకా ఆ దసరా సరదాలు మిగిలే వుంటాయి. దసరా అంటే పూజలు మాత్రమే కాదు.... సెలవులు, ఉత్సవాలు, నాటకాలు, బంధువుల రాక…. ముఖ్యంగా అల్లుళ్ళ అలక, పిండివంటలు, కోలాటాలు, చెక్క భజనలు, సాము గరిడీలు, పోటాపోటీలు, ఊరేగింపులు.... అబ్బో .... కోలాహలమే కోలాహలం.   

జ్ఞాపకాల పొరల్లో మిగిలిపోయిన ఆ సరదాల్ని వెలికి తీసి ఇప్పటి తరానికి మన సాంప్రదాయాన్ని తెలియ చెప్పడానికే శిరాకదంబం దసరా సంచిక కోసం ప్రత్యేకంగా దసరా సరదాలు అనే ప్రత్యేక ఆడియో కార్యక్రమం రూపకల్పన చేయాలని సంకల్పం. 

 అప్పటి తరం తమ దసరా సరదా జ్ఞాపకాల్ని, ఇప్పటి తరం తమ పెద్దల ద్వారా విన్న సరదాలని తమ స్వరంలోనే  అందరికీ తమ జ్ఞాపకాలని వినిపించే అవకాశం. 



దసరా సరదాలు ఆడియో కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు తమ వివరాలతో వెంటనే ఈ క్రింది ఇ మెయిల్ చిరునామా లో సంప్రదించండి. 



**********************************************************************

 ఇక విభిన్నమైన అంశాలతో క్రొత్త రూపుతో మీ ముందుకు ఈ వారం శిరాకదంబం ఈ లింకులో ......... 

sirakadambam 02 _008  
 

 పత్రిక మీద, రచనల మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను అందించగలరని ఆశిస్తూ ......



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 023

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం