Friday, December 30, 2011

' చిరంజీవి ' నాగయ్య

 1938 గృహలక్ష్మి తో తెలుగు చలనచిత్ర రంగ గృహప్రవేశం చేసిన అపర కళామూర్తి, అజరామర కీర్తి నాగయ్య. ఎంతకాలమైనా,  ఎన్ని ధోరణులు మారినా తెలుగు ప్రేక్షకుల్లో నాగయ్య గారి గురించిన ఏకాభిప్రాయం మారదేమో !
అందుకే ఆయన గురించిన విశేషాలు నిత్యనూతనం.
ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలే కాదు. కర్మ యోగి కూడా.
తెలుగు నేలపైన తన కళా ప్రతిభను పంచడానికే విచ్చేశారు.
తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సంపదనంతా పదిమందికీ పంచేశారు. 

 
ఎంత సంపాదించినా ఇతరులు మూటకట్టుకు పొయినదేమిటి ?
ఎంత పంచిబెట్టినా నాగయ్య నిలబెట్టుకున్న కీర్తి ప్రతిష్టలముందు ఆ సంపదలు ఏ పాటివి ?
మనం ఎంత డబ్బు కూడబెట్టమన్నది ముఖ్యం కాదు....
ఎంతకాలం అందరి హృదయాల్లో నిలిచి వున్నామన్నది ముఖ్యం.
ఆ విషయంలో నాగయ్య గారు తెలుగు వారి హృదయాల్లో చిరంజీవి..... ఎప్పటికీ !

 నాగయ్యగారి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ......


 నాగయ్యగారిపైన గతంలోని టపాలు..............

సంగీతమయం సమస్తం

న భూతో న భవిష్యతి ' నాగయ్య '

 నాన్నగారు 'నాగయ్య'


అపర త్యాగయ్య

నా ' త్యా ' గయ్య

నాన్నగారి జన్మదినం



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 096

2 comments:

Nrahamthulla said...

ఇదేనా ఇంతేనా
జీవితసారమింతేనా?
అంతులేని ఈ జీవనవైభవమంతయు
తుదకు నశించుటకేనా?

బోసినవ్వులను కువ్వలుపోసే
పసిపాపల బ్రతుకు ఇంతేనా
జీవితసారమిదేనా
ఆటపాటల నలరించుచు
సెలయేటివోలే వెలివారే బ్రతుకూ
ఇంతేనా
కిలకిలనవ్వుచు తొలకరివలపుల
పొలకవోయు
జవరాలి వయ్యారము ఇదేనా ఇంతేనా

దాచుకున్న వయసంతయు మగనికి
దోచి యిచ్చుఇల్లాలి గతి ఇదేనా
ఇంతేనా
పురిటిపాప చిరుపెదవులతావున
మురిసిపోవు బాలింతబ్రతుకు
ఇదేనా ఇంతేనా
తనబలగము ధనధాన్యములనుగని
తనిసే ముదుసలి పేరాశ ఫలము
ఇదేనా ఇంతేనా
సకల శాస్త్రములు పారసమిడినా
అఖిల దేశముల ఆక్రమించినా
కట్తకడకు ఈ కాయము విడిచీ
మట్టిగలిసి పోవలెనా?
మట్టిగలిసి పోవలెనా?

--యోగి వేమన.చిత్తూరు
వి.నాగయ్య,సముద్రాల
రాఘవాచార్యులు ౧౯౪౭

SRRao said...

రహమతుల్లా గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం