Thursday, December 8, 2011

కృష్ణపక్షం


మనసు కవి ఆత్రేయ చమత్కార భాషణం గురించి చాలా చెప్పుకోవచ్చు. భవిష్యద్దర్శనం చెయ్యగల మేధావి కూడా ఆయన. నిజాలను నిర్భయంగా చెప్పుకునే గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

ఒకసారి ఒక నిర్మాత ఆత్రేయ గారి రచన, దర్శకత్వంలో ' అన్నమాచార్య ' చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. దానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి.


ఆ సందర్భంలో జరిగిన ఓ ఇష్టాగోష్టిలో ఒక మిత్రుడు ఆయన్ని
" ఆత్రేయ గారూ ! కలం పేరుగా మీరు ఈ పేరే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది ? " అని అడిగారు.

దానికి ఆత్రేయ గారు నిట్టూరుస్తూ
" అప్పుడు ఆలోచించలేదు. ఆత్రేయ అంటే చంద్రుడు కదా ! చంద్రుడికి వృద్ధి, క్షీణతలు వుంటాయని గ్రహించి వుండవల్సింది. ప్రస్తుతం నా జీవితంలో ' కృష్ణపక్షం ' నడుస్తోంది " అన్నారు.

అలాగే ఆ ' అన్నమాచార్య ' చిత్ర నిర్మాణం ఆగిపోయింది.


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 084

3 comments:

ఆ.సౌమ్య said...

భలే!

Praveen Mandangi said...

ఆత్రేయ అంటే అత్రి మహర్షి పుత్రుడని విన్నాను.

SRRao said...

* ఆ. సౌమ్య గారూ !
ధన్యవాదాలు. బహుకాల దర్శనం. చాలా సంతోషం.

* ప్రవీణ్ శర్మ గారూ !

ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు ఆత్రేయ అంటే అత్రి మహర్షి పుత్రుడే ! అయితే ఆ పుత్రుడు బ్రహ్మ అంశతో అత్రి మహర్షి దంపతులకు జన్మించిన చంద్రుడే ! అందుకని చంద్రుడికి ఆత్రేయ అనే పేరు కూడా వుంది.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం