Saturday, December 3, 2011

రాజేంద్ర ' బాబు '

మన దేశానికి స్వాతంత్యం సముపార్జించడంలో అనేకమంది తమ చదువుల్ని, ఆస్తుల్నీ, చివరకి తమ జీవితాల్ని కూడా పణంగా పెట్టారు. ఆ త్యాగాల ఫలం మనమిప్పుడు అనుభవిస్తున్నాం.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత నవ భారతాన్ని తీర్చిదిద్దడంలో అనేకమంది మహనీయుల కృషి వుంది.  సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నాయి.  క్రమంగా అప్పటి త్యాగధనులను, పథ నిర్దేశకులను, ఈనాటి భారతావనికి రూపకల్పన చేసి, పునాదులు వేసిన ప్రముఖులను ఒక్కొక్కరినే మరచిపోతున్నాము. ఇప్పటి తరానికి అసలు కొందరి పేర్లు తెలియదంటే ఆశ్చర్యం లేదు. అయితే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య ఫలాలను అందించిన వారిని కనీసం జయంతుల, వర్థంతుల పేరుతోనైనా గుర్తు చేసుకోవడంతో బాటు, మన తర్వాత తరాలకు వారి గురించి ఎరుకపరచాల్సిన బాధ్యత వుంది. వారి త్యాగాలనుంచి, కార్యదక్షత నుంచి ఇప్పటి తరాలు నేర్చుకోవాల్సింది, స్పూర్తి పొందాల్సింది ఎంతైనా వుంది.   


అలాంటి మహనీయుల్లో  మన ప్రథమ రాజ్యాంగ పరిరక్షకుడు తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఈరోజు ఆయన జయంతి. ఆ సందర్భంగా ఆయన వివరాలు, విశేషాలతో కూడిన గతంలోని టపా ఈ లింక్ లో .......

 మన తొలి రాష్ట్రపతి

 భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్  జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ......

 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 082

3 comments:

తెలుగు పాటలు said...

యస్ ఆర్ రావు గారు మన దేశానికి స్వాతంత్యం సముపార్జించడంలో అనేకమంది తమ చదువుల్ని, ఆస్తుల్నీ, చివరకి తమ జీవితాల్ని కూడా పణంగా పెట్టారు వారి గురించి మరచి పోకుంట మీ ఆశయం నాకు బాగా నచ్చింది ధన్యవాదములు

Shobha Raju said...

Nice post Babai. మహామహుల్ని ఎవరు గుర్తుంచుకున్నా, గుర్తుంచుకోకపోయినా మీరు అందర్నీ గుర్తు పెట్టుకుని, ఇలా వారికి నివాళుల్ని అర్పించటం అభినందదాయకం. మీకు శతకోటి అభినందనలు

SRRao said...

'తెలుగు పాటలు' గారికి,
ధన్యవాదాలు.

శోభమ్మా !
ఇది మన బాధ్యతమ్మా ! ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం