Thursday, October 7, 2010

నెహ్రూజీ డూప్

కనుక్కోండి చూద్దాం - 28

 నెహ్రూజీ ప్రథానమంత్రిగా వున్నప్పుడు ఓసారి కలకత్తా నుండి బొంబాయి ( నేటి ముంబయి ) కి ప్రయాణం చేస్తున్నపుడు ఆయన వెంటవున్న విలేఖరులలో ఇండియన్ న్యూస్ సర్వీస్ కెమెరామన్ గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి కూడా వున్నాడు. ఆయన కూడా ఆరోజు నెహ్రూజీ వేసుకున్న జాకెట్ లాంటిదే తొడుక్కున్నాడు. ఆయనకు అప్పుడప్పుడు గాంధీ టోపీ పెట్టుకునే అలవాటు కూడా వుంది. ముంబయిలో విమానం ఆగగానే నెహ్రూజీ కంటే ముందుగా ఆయన విమానం దిగాడు. నెహ్రూగారికోసం అక్కడ వేచి వున్న వారు ఈయన వేషదారణ చూసి నెహ్రూగా పొరబడి పూలమాలలతో ముంచెత్తి స్వాగతం పలికారు. దాంతో తాను నెహ్రుని కానని చెప్పడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన అవస్థ చూసి నవ్వుకుంటూ వెనుకగా దిగిన నెహ్రూజీని చూసి నాలుక కరుచుకున్నారందరూ !

ఇంతకీ నెహ్రూజీగా భ్రమింపజేసిన ఆ వ్యక్తి తర్వాత కాలంలో తెలుగు చిత్రసీమలో  ప్రముఖుడిగా ఎదిగాడు.
ప్రక్క ఫోటోలో వున్న ఆయన ఎవరో గుర్తు పట్టగలరా ?






Vol. No. 02 Pub. No. 033

7 comments:

మాగంటి వంశీ మోహన్ said...

ఇలా కొచ్చెనేసేముందు, మీరు ఓటి నేర్సుకోవాల! సిత్రాలెక్కించ్చేప్పుడు, సిత్రానికి మళ్లీ నామకరణం సెయ్యాల....సపోసు ఇదే ఫుటో సూసామనుకోండే...దాన్ని నొక్కితే ఏంటనే పేకేటి డాట్ జె.పి.జి అని ఒత్తాది...అప్పుడు మీరు కొచ్చెనేసి ఏటి లాబం? కాబట్టండే!...మరి అదండే! :)

జేబి - JB said...

పేకేటిగారి గురించి నాకు కొంచెమే తెలుసండి. వారి గురించి మీకు తెలిసినది పంచుకోగలరు. కృతజ్ఞతలు.

@మాగంటి వంశీ మోహన్ : మీరు చెప్పిన విధానానికి భలే నవ్వొచ్చింది.

Anonymous said...

ఈ మాగంటి ఎవరో గానీ ఏ బ్లాగులో అయినా సరే తన పాండిత్యాన్నంతా ఒలకబోస్తూ, వ్యంగ్యంగా, ఎగతాళిగా ఎవరికీ అర్థం కాకుండా, వ్యాఖ్యలు రాస్తుంటాడు. పండితుడిననే ఈ పైత్యం ఎప్పుడు తగ్గుతుందో! ఈయన వ్యాఖ్యలు ఎవరికీ అర్థం కావు,(ఈ వ్యాఖ్య మినహాయింపు)

Anonymous said...

Let him, thats his style. Don't talk rubbish.

manavaani said...

@ first anonymous

ఎవరిని ఉద్దేశించారో వారికి అర్ధమైతే చాలు. పండితుల
ముందు - మనబోటి అర్ధం కాని వారు - మౌనాన్ని
అలంకారం
గా చేసుకుని ఉండాలని ఓ మంచిమాట ఉంది

ఆ వ్యాఖ్యతో నా పై మాట కూడా అర్ధమయి ఉండాలి

ధన్యవాదములు

Saahitya Abhimaani said...

Well said Manavani. Bravo!

Raavu gaaroo, the photo is that of Shri Peketi Sivaram. I could recognise him even before the clue given by Shri Maganti Vamsi.

But its better to rename the image file before uploading, to ensure suspense.

SRRao said...

* వంశీ గారూ !
మీ సూచనకు ధన్యవాదాలు. అయితే నిన్న బ్లాగర్ లో ఫోటోలు ఎంత ప్రయత్నించినా ఫోటో నెంబర్ వున్న ఫైల్ అప్లోడ్ కాలేదు. అందుకని పికాస నుంచి చేసాను. అక్కడనుంచి అసలు ఫైల్ ( ఫోల్డర్ మొత్తం ) అప్లోడ్ అయింది. అందువలన ఈ పొరబాటు వచ్చింది. ఏమైనా ఈ పొరబాటు నా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు.

* జే బీ గారూ !
తప్పకుండా పేకేటి గారి గురించి కొన్ని వివరాలు అందిస్తాను. ధన్యవాదాలు.

* అజ్ఞాత గార్లకు,
పాండిత్యం ఒకరి సొత్తు కాదు. ఎదుటివారి పాండిత్యాన్ని లెఖ్ఖ కట్టడం గానీ, విమర్శించడం గానీ సరైంది కాదేమోనని నా అభిప్రాయం. ఈ బ్లాగుల ద్వారా అందరం మనకు తెలిసిన విషయాలు పంచుకుందాం. అందులో దొర్లిన లోపాలను, పొరబాట్లను సరిచేసుకుందాం. మనమెవ్వరం సర్వజ్ఞులం కాము. అలా అనుకుంటే అది అహంకారం లేదా మూర్ఖత్వం అవుతుంది. అందుకని ఒకరినొకరు దూషించుకోవడం లాంటివి చేసుకోవడం బాగుండదేమో !

* మనవాణి గారూ !
* శివ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం