వాగ్గేయకారుడు అనే మాటకు సజీవ ఉదాహరణ పి. బి. శ్రీనివాస్
కాకినాడలో పుట్టి కన్నడిగులను మెప్పించిన గాన గంధర్వుడు పి.బి.
విలక్షణమైన స్వరం, వినసొంపైన గానం ఆయన స్వంతం
అందుకే పరాయి భాషల్లో కూడా ఆయన నీరాజనాలందుకున్నారు
తెలుగు..తమిళ.. కన్నడ..మళయాళ.. హిందీ..ఉర్దూ.. భాషల్లో పండితుడు
ఆశువుగా పద్యాలు పాటలు రాస్తారు .... అలవోకగా గజల్స్ గీతాలు పాడతారు
1951 - 52 ప్రాంతాల్లో ' మిస్టర్ సంపత్ ' అనే హిందీ చిత్రంలో అప్పటికే ప్రముఖ గాయనీమణులైన గీతాదత్, షంషాద్ బేగం, జిక్కి లాంటి వారితో కలిసి పాడడంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. అదే సంవత్సరం ప్రముఖ కన్నడ దర్శక నిర్మాత ఆర్. నాగేంద్రరావు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించిన త్రిభాషా చిత్రం ' జాతకఫలం ' లో మూడు భాషలలోను పి. బి. శ్రీనివాస్ పాడారు. ఒకే సంవత్సరంలో నాలుగు భాషల్లో గాయకుడిగా పరిచయమైన ఘనత బహుశా ఆయన ఒక్కరిదేనేమో !
ఆయన గాయకుడే కాదు కవి, రచయిత కూడా ! ఎన్నో కవితలు, గజల్స్ వంటివి రాసారు. వాటిని స్వయంగా స్వరపరచి ఆలపించారు. సినిమాలకు పాటలు కూడా రాసారు. తెలుగులో ఎం.ఎస్. శ్రీరాం నిర్మించిన ' మంచిరోజు ' చిత్రంలో కొన్ని పాటలు రాసారు. ' భాగ్యజ్యోతి ' అనే కన్నడ చిత్రంలో సంస్కృత భాషలో ఒక పాట రాసారు. అలాగే మరో కన్నడ చిత్రం ' మక్కళ భాగ్య ' లో ఒక పాట అయిదు భాషల్లో వుంటుంది. అందులో కన్నడ చరణం తప్ప మిగిలిన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ భాషల చరణాలు పి. బి. శ్రీనివాస్ రాసి తానే స్వయంగా ఆ పాట పాడారు.
ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈనాటి వాగ్గేయకారుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆణిముత్యాల కదంబం..............
Vol. No. 02 Pub. No. 030
8 comments:
80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ మహా గాయకుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
మంచి పోస్ట్ .
పీ బీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
Hearty Greetings to PB Sreenivas garu.
పి.బి. శ్రీనివాస్ పాటలు నాకు చాలా ఇష్టం. మంచి పాటలు వినిపించారు. కాని పూర్తిగాలేవు. శ్రీనివాస్ గారికి నా శుభాకాంక్షలు కూడా.
మొన్నామధ్య ఎక్కడో టివి ప్రోగ్రాంలో చూసి వారి పాటలు విన్నాను. PB శ్రీనివాస్ గారిది ఒక విలక్షణమైన గాత్రం.
ఆ వాయిస్ తో ఎవర్నైనా mesmerize చేయగలరు.
మీ టపా వల్ల మళ్ళీ ఆయన పాటలు వింటున్నాను.
ధన్యవాదాలు!
PS: మీ బ్లాగులోకి రావటం ఇదే మొదటిసారి.
'శిరా కదంబం' పేరు నాకు భలే నచ్చేసింది.
అందరికీ ధన్యవాదాలు. శిరాకదంబానికి తొలిసారి విచ్చేసిన వారికి స్వాగతం.
* జయ గారూ !
జన్మదిన సందర్భంగా పి. బి. గారి ఆణిముత్యాల లాంటి ఆయన పాటల్ని కొన్నిటినైనా గుర్తు చేద్దామని అలా ఎడిట్ చేసాను. పూర్తిగా అన్నిటినీ వినిపించాలంటే ఓపెన్ అవకపోవడం లాంటి సమస్యలు వస్తాయేమో కదా !
aalasyammayinaa- sapta samudraalanu daataali kadaa-abhimana gaayakudu sri p b srinivas gaariki janmadina subhakankshalu-venkata subba rao voleti, vernon hills /USA
సుశీ గారూ !
ధన్యవాదాలు. నెట్ సమస్యవలన జరిగిన ఆలస్యానికి క్షమించండి.
Post a Comment