
కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె లూయలూపు.....
- ఆరుద్ర గారి జోస్యం ఎంత నిజమో !



అపురూప చిత్ర కళా తపస్వికి జన్మదిన శుభాకాంక్షలు
బాపు అందమైన మనుష్యులనే - ముఖ్యంగా స్త్రీలను - వేస్తాడేమో అనుకుని
కొన్నాళ్ళు నేను కూడా అపోహపడ్డాను. కానీ, బాపు సృష్టించే అందం
అతని బొమ్మల్లో వుంది - మనుష్యుల్లో కాదు
- కొడవటిగంటి కుటుంబరావు

బాపూ నీ బొమ్మలు-తల
లూపు గులాబి కొ్మ్మలు
బాపూ నీ రేఖలు - ముని
మాపు శకుంత ల లేఖలు

బాపూ నీ లేఖిని - దరి
దాపు సుధారస వాహిని
బాపూ నీ భావము - వగ
బాపు కళకు నవ జీవనము
- కరుణశ్రీ
చిత్రకళలో కుంచెతో విన్యాసాలు చేయించగల ప్రవీణుడు బాపు
చలన చిత్ర కళలో కెమెరాతో అంతే విన్యాసాలు చేయించారు .
కాన్వాస్ మీద ఆయన వేసిన బొమ్మ భాష కందని భావాన్ని పలికిస్తే
సెల్యులాయిడ్ మీద ఆయన తీసిన బొమ్మ భాష అవసరం లేని భావాన్ని పలికించింది.
' సాక్షి ' తో మొదలైన బాపు సినీ ప్రస్థానం ఇప్పటికి ' సుందరాకాండ ' వరకూ సాగింది.
ఆయన సినిమాలో కథ ఏమిటో ప్రేక్షకుడికి అక్కరలేదు.
ఆయన చిత్రీకరించే ఫ్రేములు చాలు. అవే ఎంతో సుందరంగా అలరిస్తాయి.
కేవలం ఆయన ఫ్రేముల కోసమే ఆయన తీసిన చిత్రాలను చూసే వారున్నారు.
ఎన్నో సినిమాలు ఆయనకు కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు...
ఊహూ ! తెలుగు జాతికే గౌరవం తెచ్చి పెట్టాయి.
తెలుగులో బాలల చిత్రాలకు ఇప్పటికీ కరువే ! ఎందుకంటే అవి వ్యాపార పరంగా పనికి రావని. కానీ ఆయన ఎప్పుడో
బాలల చిత్రం ' బాలరాజు కథ ' తీసి మనోరంజకంగా తీస్తే కమర్షియల్ గా విజయం సాధించవచ్చు అని నిరూపించాడు.
అంతే కాదు ఇప్పుడు మామూలు అయిపోయిన ఏనిమేషన్ ఆ చిత్ర టైటిల్స్ లో ఉపయోగించారు. అవి చూసి ఆనందించండి........
తెలుగు చలన చిత్ర పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం " సీతాకళ్యాణం ".
తెలుగు చలన చిత్ర పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం " సీతాకళ్యాణం ".
సెల్యులాయిడ్ మీద కవిత్వం రాయడం బహుశా ఇంకెవరికీ సాధ్యం కాదేమో !
ఆ చిత్రంలో ఒక్కోక్క ఫ్రేము ఒక్కొక్క కళా ఖండం
గంగావతరణ దృశ్యం విదేశీ సాంకేతిక నిపుణులను సైతం ఆశ్చర్య పరచింది. కొన్ని విదేశీ ఫిల్మ్
ఇన్ స్టిట్యూట్ లు ఆ దృశ్యాన్ని తమ స్టడీ మెటీరియల్ గా చేసుకున్నారంటేనే ఆ దృశ్య చిత్రీకరణలోని
గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాన్ని ఓ సారి తిలకించండి.
అపురూప చిత్ర కళా తపస్వికి జన్మదిన శుభాకాంక్షలు
Vol. No. 01 Pub. No. 139
7 comments:
అధ్బుతం అండి. బాపు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.. ఐతే పెళ్ళి పుస్తకంలో లా ఆక్ట్ కూడా చేసి చూపించు అంటారేమో కొంటె గా బాపు గారు ఇది వింటే. హృదయ పూర్వక జనమ దిన శుభా కాంక్షల బాపు గారు. రావు గారు మీకు కూడా ధన్య వాదాలు ఇలా ఇంకో సారి బాపు గారిని తలచుకుని ఏంచక్క గా ఆయనకు జనమ దిన శుభాకాంక్షలు కూడా చెప్పే అవకాశం ఇచ్చినందుకు.
బాపు ఒక చిన్న గీత గీస్తేనే చాలు బాపు బొమ్మైపోతుంది . ఆయనకు నాలాంటి వీరాభిమానులెందరో !
ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు చక్కని వేదికనేర్పరిచిన మీకు అభినందనలు .
బాపూ గారికి జన్మదిన శుభాకాంక్షలు .
yes, he's truly amazing!! And his totally disarming down-to-earth friendliness to total strangers is to be seen to be believed.
* భావన గారూ !
* మాలాకుమార్ గారూ !
* కొత్తపాళీ గారూ !
కృతజ్ఞతలు
బాపుగారి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి మిగిలే ఉంటాయి.అది ఒక తరగని పెన్నిధి. మీకు కృతజ్ఞతలు.
బాపు గారి బొమ్మలు, బాపు గారి మీద కవితలు, వీడియోలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదములండి
* జయ గారూ !
* రాజన్ గారూ !
కృతజ్ఞతలు
Post a Comment