Sunday, December 6, 2009

మహానటీ ! నీవు లేక...!!


నీవు లేక వీణా పలుకలేనన్నది !
నీవు లేక వెండి తెర వెల వెల పోయినది !!

కనులు కనులతో కలబడితే
కనులే మనతో మాటలాడితే

జీవితంలోనటించడం చాలామందికి తెలుసు
నటనలో జీవించడం కొందరికే తెలుసు

వారిలో అగ్ర తాంబూలం మహానటి సావిత్రిదే !గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబర్ 6 వ తేదీన ఉదయించిన ఈ తార 13 ఏళ్ళ వయసులో 1949 లో ' అగ్ని పరీక్ష ' చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు చలన చిత్ర సీమలో తళుక్కున మెరిసింది.
1950 లో ' సంసారం ' చిత్రంలో రెండవ హీరోయిన్ కాబోయి మళ్ళీ చిన్న పాత్రతో సరిపెట్టుకుంది.
1951 లో ' పాతాళ భైరవి ' లో నృత్యం చేసింది.1952 లో ' పెళ్లి చేసి చూడు ' చిత్రంలో రెండవ హీరోయిన్ పాత్ర దక్కింది.
1953 లో ' దేవదాసు ' చిత్రంతో ఆమె నటజీవితం మలుపు తిరిగింది.1954 లో ' మనంబోల మాంగల్యం ' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో జెమిని గణేషన్ ను వివాహమాడారు.
1958 లో విజయ చాముండేశ్వరి, 1965 లో సతీష్ ఆమె సంతానంగా జన్మించారు.
1960 లో ' చివరకు మిగిలేది ' చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగులో చిన్నారి పాపలు, మాతృదేవత, వింత సంసారం మొదలైన చిత్రాలకు
తమిళంలో ఉళ్ళం, ప్రాప్తం చిత్రాలకు సావిత్రి దర్శకత్వం వహించారు.
నిర్మాతగా వ్యవహరించిన ' ప్రాప్తం ' చిత్ర సీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిన ఆ మహానటి పతనానికి పునాది వేసింది.మహానటి సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా సృత్యంజలి

Vol. No. 01 Pub. No. 127

7 comments:

జయ said...

ఆ మహానటి ని ఎవ్వరూ...ఎప్పటికీ మర్చిపోలేరు. చాలా మంచి ప్రయత్నం చేసారు. ఇన్ని వివరాలు తెలియచేసిన మీకు నా కృతజ్ఞతలు. ఆ మహా నటికి ఈ లోకంలో లేకపోయినప్పటికీ నా జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

SRRao said...

జయ గారూ !
మనకి ఎన్నో ఆణిముత్యాలున్నాయి. వారిని ఇలాంటి సందర్భాలలోనైనా ఒక్కసారి స్మరించుకుంటే వారిలోని మంచి లక్షణాలు కొన్నైనా మనకి స్పూర్తిని కలిగిస్తాయేమోనని ఒక చిన్న ఆశ. మీ స్పందనకు ధన్యవాదాలు.

mesnehitudu said...

hai friends
nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
ee link lo choosi me comments teliyajeyandi.

http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html

S said...

ఈ టపా లో ఏ వీడియో లంకె నొక్కినా, 'This is a private video..' అన్న మెసేజ్ వస్తోంది :(

SRRao said...

S గారూ !
ముందుగా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు. డా. చక్రవర్తిలోని పాట మాత్రం బాగానే ప్లే అవుతోంది. ఎందుకో అది తప్ప మిగిలిన పాటలు మాత్రం నా యు ట్యూబ్ చానెల్ లో ప్రైవేటు లోకి వెళ్ళాయి. ఏ సందర్భంలో అలా జరిగిందో గుర్తు రావడం లేదు. ఇప్పుడు సరి చేసాను.

sivasubrahmaniam said...

మహానటి అభినేత్రి సావిత్రి గారిగురించి ఎంత చెప్పుకున్నా తనివితీరదు. అల్లాంటి వ్యక్తులు బహు అరుదుగా వుంటారు. ఎన్నాళ్ళు జీవించావనికాదు ఎంత గొప్పగా జీవించేవు అన్న అర్ధానికి నిలివెత్తు ఉదాహరణ సావిత్రి గారు. ఆమెను 1964 ప్రాంతాన్న మా రాజమండ్రి కి అక్కినేని వారితో మూగమనసులు చిత్ర ప్రదర్శన సమయంలో వచ్చినప్పుడు ప్రత్యక్షం గా చూసే భాగ్యం కలిగింది. అటువంటి మహా మనీషి మన గడ్డ ఆడబడచుగా పొందడం అమె సమకాలికుడనవ్వడం నా అదృష్టం గా భావిస్తా.

SRRao said...

శివసుబ్రహ్మణ్యం గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం