తెలుగు చిత్రసీమకు నాన్నగారైన చిత్తూరు వి. నాగయ్య గారు ' భక్త రామదాసు ' చిత్ర నిర్మాణం చేపట్టారు. అటువంటి కథల్ని నిజాయితీగా తెరకెక్కించడమన్నా, అటువంటి పాత్రల్లో పరకాయ ప్రవేశం చెయ్యడమన్నా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఆయన దురదృష్టం ఆ చిత్ర నిర్మాణం సజావుగా సాగలేదు. సుమారు ఏడు సంవత్సరాలు సాగిన ఆ చిత్ర నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని అడుగడుగునా చికాకు పెట్టాయి.
వీటికి తోడు కబీర్ పాత్రధారి, అప్పటి మేటి నటుడు గౌరీనాథ శాస్త్రి మరణం రూపంలో మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆయన పాత్ర షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో గుమ్మడి గారిని ఆ పాత్రకు తీసుకుని ఆ సన్నివేశాలు మళ్ళీ షూట్ చెయ్యవలసి వచ్చింది. దాంతో ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి.
గోరు చుట్టుపై రోకటి పోటులా కన్నాంబ కూడా మరణించారు. అయితే అదృష్టం కొద్దీ కొన్ని షాట్స్ మినహా మిగిలిన భాగమంతా పూర్తయింది. ఆ షాట్స్ వేరే వారితో తీసినా ఆ విషయం ప్రేక్షకులు గుర్తించలేనంత జాగ్రత్తగా పూర్తి చేసారు. ఇన్ని కష్ట నష్టాల కోర్చి విడుదలైన ' రామదాసు ' బాక్సాఫీసు దగ్గర అపజయం పాలై నాగయ్యగారిని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసాడు.

Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 113
2 comments:
భక్త రామదాసు సినిమా తియ్యడంలో వచ్చిన కష్టాలవల్లనో ఏమోగనీ ఈ సినిమ ఏ రకంగానూ రంజింపజేయలేకపోయింది. ఆ మధ్య టీవీలో వచ్చినప్పుడు చూసాను. నచ్చలేదు. ఏంటిసి నాగయ్యగారు ఇలాంటి సినిమా తీసారు అనిపించింది. అనవసరమైన అంశాలతో సాగదీత గా అనిపించి బోర్ కొట్టింది. రామ లక్ష్మణులుగా శివాజీ, మరొకరెవరో గురులేదు. వారిపై ఏ మాత్రమూ భక్తిభావలు కలగని విధంగా నటించారు. ఇంకా చెప్పాలంటే కమెడీ గా అనిపిచింది. నాగయ్య గారి నటనలో కూడా ఏదో కృత్రిమత్వం.
నాగయ్య గారి త్యాగయ్య, యోగి వేమన లాంటి సినిమాల పక్కన చేరవలసినది కాదు ఈ రామదాసు.
సౌమ్య గారూ !
కష్టాల సుడిగుండంలో పడి కొట్టుకున్న ఈ చిత్రం పరాజయం పాలవడానికి, నాగయ్య గారు ఇక్కట్ల పాలవడానికి కారణాలు అనేకం. ధన్యవాదాలు.
Post a Comment