కనుక్కోండి చూద్దాం - 29
ఈ ఫోటోలో ఉన్నవారు తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారులు, గాయకులు. తెలుగు చలన చిత్రరంగం తొలినాళ్ళలో రెండు చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు.
* ఆయన పేరేమిటి ?
* ఆయన కళా దర్శకత్వం వహించిన చిత్రాల పేర్లు ఏమిటి ?
Vol. No. 02 Pub. No. 043
7 comments:
షరా మామూలే.....బొమ్మ నొక్కడం...పేరు తెల్సిపోవడం...అడవి బాపిరాజు గారు అని చెప్పడం....మీరాబాయి, అనసూయ, ధ్రువ విజయం ఇలాటి సినిమాలు తీసవతల పారేసారని చెప్పడం... .. మీరడిగిన దానికి ఇలా హిందూ వాడి లింకు ఇవ్వడం....
http://www.hinduonnet.com/thehindu/mp/2002/12/23/stories/2002122300810200.htm
:)
మళ్లీ బ్లాగరోడు పేర్ల బదులు నంబర్లు తీసుకోనన్నాడా రావు గారూ.. :)
వంశీ మోహన్ గారూ !
ఇలాంటి విషయాల్లో మీకున్న పరిజ్ఞానం, మీరు చేస్తున్న పరిశోధన, సాంకేతికాంశాల మీద మీకున్న పట్టు గురించి తెలియని తెలుగు అంతర్జాల మిత్రులు వుంటారనుకోను. ఆ విషయంలో మీ కృషి అభినందనీయం. నేను వేసే ప్రశ్నలు ఎవరి పరిజ్ఞానాన్నో పరీక్షించడానికి కాదు. ఇవన్నీ ఎవరికీ తెలియని విషయాలనే అపోహ నాకు లేదు. వృత్తి రీత్యా, ఇతరత్రా కారణాల వల్ల కాలగమనంలో జ్ఞాపకాల పొరల్లో పడిపోయిన విషయాల్ని బయిటకు తేవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే ! ఆ విషయాల్ని నిత్యం పరిశీలిస్తున్న, పరిశోధిస్తున్న మీకు సమాధానం చెప్పడం చాలా సులువు . మీవంటి పండితులు మిగిలిన మిత్రులకు తమ పరిజ్ఞానాన్ని పరీక్షించుకునే అవకాశం ఇచ్చి చివరలో నా ప్రశ్నలపైన, మిత్రుల జవాబులపైన విశ్లేషణ చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందేమో ! ఆలోచించండి.
మీరిచ్చిన 2002 లో ' ది హిందూ ' లోని లింక్ కు ధన్యవాదాలు.
బ్లాగర్ లో ఏ ఫైల్ అప్లోడ్ కాకపోవడం వలన ఎలాగోలా అప్లోడ్ చెయ్యాలనే తొందరలో పొరబాటు జరిగిందని గతంలో చెప్పానుగానీ కేవలం నెంబర్లు వున్న ఫైల్స్ మాత్రమే అప్లోడ్ కాలేదనే అర్థంలో చెప్పలేదు. ఇప్పుడు మాత్రం బాపిరాజు గారిని ఎంతమంది గుర్తు తెచ్సుకుంటారోననే ఉద్దేశ్యంతో చివరి నిముషంలో చేసిన ఆ ప్రశ్న కలిపినందువల్ల ఈ పొరబాటు దొర్లింది. అయినా సమాధానం చెప్పాలనుకున్న వాళ్ళు ప్రశ్న గురించే అలోచిస్తారనుకుంటాను.
ఏమైనా ఇంత నిశితంగా నా బ్లాగు పరిశీలిస్తున్న మీకు నా ధన్యవాదాలు.
రావుగారూ
హేళన చెయ్యాలన్న ఉద్దేశమ్మ్ లేదని మనవి....మాంచి విషయాలు అందిస్తున్నప్పుడు కొద్దిగా సస్పెన్సు అట్టిపెడితే మంచిది అన్న ఉద్దేశంతో రాసిన కామెంటు అది...వేరే అర్థంలో తీసుకోరని, తీసుకోలేదనీ...నా పాత కామెంట్లు, ఇప్పటి కామెంటు, ఇకముందు చేసే కామెంటు నా జాతకరీత్యా ఇలానే ఉంటాయని తెలియచేసుకుంటూ, అపార్థం చేసుకోరనీ ..... :)
వంశీ మోహన్ గారూ !
మీరు హేళన చేస్తున్నారనే ఉద్దేశ్యం నాకు లేదు. నేను కూడా మీరన్న సస్పెన్సు పాటించి కొంచెం ఆలస్యంగా చివరలో మీ విశ్లేషణ ఇస్తే ఇంకా కొంతమందికి జవాబు ఆలోచించే అవకాశం వుంటుంది కదా అని అలా రాసాను. మీకు విషయ పరిజ్ఞానం ఉంది గనుక వెంటనే జవాబు ఇవ్వగలరు. విషయ పరిజ్ఞానం వున్నా మరుగున పడిపోయిన వారికి జ్ఞప్తికి తెచ్చుకునే అవకాశం ఇచ్చినట్లవుతుంది కదా ! దానివలన ఇంకా కొన్ని మరుగున పడ్డ, మనకు తెలియని విషయాలను కూడా కొంతమంది మిత్రులు అందించవచ్చు అని నా ఆలోచన. అర్థం చేసుకుంటారనుకుంటాను.
నా పొరబాటును సమర్ధించుకోవడం లేదు. నిజానికి ఎప్పటికప్పుడు ఇలా హెచ్చరిస్తూ వుంటే నా రాతల్ని మరింత మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. దానికి నేను సంతోషిస్తాగానీ బాధపడను. మీకు ధన్యవాదాలు.
off topic
ఇక్కడ నా పలుకులు అనవసరమే అయినా మరొక్కమారు :
ప్రశ్న(ల)కి సమాధానం పొందే ఆసక్తి, ప్రయత్నంలో
- మరెంతో పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది.
అందుకని
ఇలా బ్లాగులలో తేలికగా సమాధానాలు ఇవ్వగలవారు తమ అభిప్రాయాలతోపాటు నేరుగా బ్లాగరుకి మెయిలు చేస్తే
మామూలు జ్ఞానపిపాసిలకి ఎంతో మేలు కలుగుతుంది
ధన్యవాదములు
Rao gaaru, Ranjani gaaru - Agreed And Will Be On Track From Now On! :)
* వంశీ గారూ !
* మనవాణి గారూ !
ధన్యవాదాలు
Post a Comment