Friday, May 28, 2010

' వామ ' పక్ష కృష్ణుడు

 ' పల్లెటూరిపిల్ల '  ( 1950 ) చిత్రంలో ఎన్టీరామారావు గారు ఒక ఆస్ట్రేలియన్ ఎద్దుతో పోరాడవలసి వచ్చింది. ఆ సందర్భంలో రెండుసార్లు ఆయన చేతికి గాయాలయ్యాయి.

తర్వాత సంవత్సరంలో ' పాతాళభైరవి ' చిత్రంకోసం మంత్రాల మర్రిచెట్టునుంచి కిందకు దూకాల్సివచ్చింది. ఆ సందర్భంలో కూడా ఆయన చేతికి గాయమైంది. 

1980 లో వచ్చిన ' సర్దార్ పాపారాయుడు ' చిత్రం షూటింగ్లో మోటర్ సైకిల్ పైనుంచి పడినప్పుడు  ఆయన చేతివేళ్ళు చితికిపోయాయి. ఇలా చాలాసార్లు ఆయన చేతికి గాయాలయ్యాయి.

అవన్నీ కూడా ఎన్టీరామారావు గారి కుడిచేతికే !  తగిలిన చేతికే దెబ్బలు పదేపదే తగిలేవి.

ఇన్ని దెబ్బలు తినటం వలన ఆయన కుడిచేయి నరాలు దెబ్బతిని పట్టు కోల్పోయాయి. విరిగిన ప్రతీసారీ ఆయన పుత్తూరు వైద్యులచేతనే కట్లు కట్టించుకునేవారు. ఆ వైద్యులు ఆ చేతిమీద బండరాయితో కొట్టి మరీ కట్టు కట్టేవారట. 

ఇలా కుడిచెయ్యి స్వాధీనం లేకపోవడం వలన ఆయన చివరిరోజుల్లో కృష్ణుడి పాత్ర ధరించిన చిత్రాల్లో అభయహస్తం చూపించేటపుడు ఎడమ చెయ్యి చూపించేవారు. అదికూడా తక్కువ సందర్భాలలో మాత్రమే !

ఒకసారి ఒక పెద్దాయన ఎన్టీఆర్ ని ' వామహస్త అభయం అశాస్త్రీయం కదా ? ' అని అడగ్గా  ' హృదయం ఎడమవైపునే కదా వుంటుంది. అంటే ఎడమ భాగానికి వున్న ప్రాశస్త్యం కుడి భాగానికి లేనట్లే కదా ? ' అని సమాధానమిచ్చారు ' వామ ' పక్ష కృష్ణుడు.

 
Vol. No. 01 Pub. No. 302

2 comments:

Vinay Datta said...

You have given all the details of NTR's right hand injuries. When I was a kid I had seen him on television with 'putturu kattu'.

SRRao said...

మాధురి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం