Saturday, May 29, 2010

సమ ' ఆవేశం '


ఒకసారి సాహితీ సమావేశం జరుగుతోంది. కవులు, పండితులు చాలామంది హాజరయ్యారు. మహాకవి శ్రీశ్రీ కూడా హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరయిన ఒక యువకవి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఉడుకునెత్తురు కదా ! రాజకీయాలు, సాహిత్యం .... ఇలా ఒకటేమిటి, అన్నిటినీ..... వాటిలో వున్న కుళ్ళునీ, కుత్సితాల్నీ తన ప్రసంగంలో కడిగి పడేస్తున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్నాడు.

శ్రీశ్రీగారు మాటి మాటికీ చేతి గడియారం చూసుకుంటున్నారు. కొంతసేపటికి ఎలా అయితేనేం ఆ యువకవి గారు ఈ లోకంలోకి వచ్చి  శ్రీశ్రీగారి పరిస్థితి గమనించాడు. అంతే... తన ఆవేశానికి బ్రేక్ వేసి కూర్చున్నాడు. వెంటనే శ్రీశ్రీగారు లేచి " ఈ సమావేశం లో మీరు మరీ అంత ఆవేశ పడిపోతే ఎలా కవిగారూ ! " అని  చమత్కరించారు.  ఎంతైనా శ్లేష శ్రీశ్రీ గారి సొత్తు కదా !

Vol. No. 01 Pub. No.303

2 comments:

మిరియప్పొడి said...

srizsri = slesha!!

SRRao said...

మిరియప్పొడి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం