దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు భావకవిత్వమెంత మధురంగా చెప్పగలరో సరస సంభాషణ కూడా అంతే మధురంగా చెయ్యగలరు.
కొసరాజు రాఘవయ్య చౌదరి తెలుగు సినీ కవిత్వాన్ని జానపదుల బాట పట్టించిన ఘనులు.
వీరిద్దరూ కలిస్తే ఆ సంభాషణ ఎంత సరసంగా వుంటుందో కదా ........ !
వాహినీ వారి ' బంగారు పంజరం ' చిత్రానికి పాటలు రాసే పనిలో వున్న దేవులపల్లి వారి దగ్గరకి కొసరాజు గారు వచ్చారు. ' పుస్తకం హస్త భూషణం ' అనే మాట కొసరాజు గారికి సరిగా సరిపోతుంది. ఆయన చేతిలో ఎల్లవేళలా ఒక పుస్తకం ఉండేది. దాంట్లో ఆయన రాసిన పాటలు, రాస్తున్న పాటలు ఉండేవి.
వస్తూనే దేవులపల్లి వారికి నమస్కారం చేశారు కొసరాజు గారు. ప్రతి నమస్కారం చేస్తూ కృష్ణశాస్త్రి గారు కొసరాజు గారి చేతిలోని పుస్తకాన్ని ఏమిటన్నట్లు సైగ చేశారు.
విషయం గ్రహించిన కొసరాజు గారు ఆ పుస్తకాన్ని దేవులపల్లి వారికి చూపిస్తూ " సాంగుల గ్రంథం " అన్నారు.
దానికి దేవులపల్లి వారు వెంటనే.......
" సాంగుల గ్రంథం అంటున్నారు. మీరు గ్రంథ సాంగులు కారు కదా ! " .... అని చమత్కరించారు.
Vol. No. 02 Pub. No. 019
2 comments:
బావుంది.
రఘు గారూ !
ధన్యవాదాలు
Post a Comment