*
మనసు బిక్కుబిక్కుమంటోంది.
ఉత్తరాల్లో బోల్డు వలపు కురిపిస్తారు. ఎంతసేపూ ఒక్క కొడుకైన తనంటే
వాళ్లమ్మకెంతిష్టమో, చెల్లెళ్లంటే తనకెంతిష్టమో... వీటి
గురించే ఉంటుంది ఉత్తరాల్లో. సంతోషమే ! ఆ ప్రేమ నాక్కూడా కాస్త పంచుతారా అని ? నిజానికి అత్తగారి చూపు కొరడా ఝుళిపించినట్టే ఉంటుంది
ఏం మాట్లాడకపోయినా. మంచిచెడులు మనమేం చెప్పగలం ? ఏదైతే
తప్పేను గనుక ! దేనికైనా సిద్ధంగా ఉండటమే !! ఆలోచనలు జోరీగల్లా ముసురుతున్నాయి.............. ‘
పాలంగి కథలు ’ నుండి “ అత్తారింట్లో
పట్నం పిల్ల ”.
*
శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న పద్మజ ఆసక్తి లలిత సంగీతం వైపే ఉండేది. దాని ఫలితమే సినిమా పాట పాడేలా చేసిందని ఇందిర గుర్తించారు. ఈ లలిత సంగీతంలోని విశేషమేమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి శ్రద్ధగా రేడియో లో లలిత సంగీతం వినసాగారు. శాస్త్రీయ సంగీతంలో ఎంత గొప్పతనం ఉన్నప్పటికీ అది పండిత వర్గానికే పరిమితమని, పామరులను రంజింపజేసేది సరళంగా, సులువుగా అర్థమయేటట్లు ఉండే లలిత సంగీతమేనని గ్రహించారు. అప్పటినుంచి లలిత సంగీత సాధన ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించిన ఇందిర గారు త్వరగానే లలిత సంగీతంలో ప్రావీణ్యం సాధించారు..... " లలితసంగీత ‘ మణి ’ – ఇందిరామణి ".
*
4వ సంవత్సరాల పిన్న వయసులోనే కూచిపూడి నృత్యాభ్యాసం ప్రారంభించింది. తర్వాత ప్రముఖ నాట్యాచార్యులు గురు శ్రీ వెంపటి చినసత్యం గారి ఆధ్వర్యంలోని కూచిపూడి కళాక్షేత్ర లో చేరి నృత్యాభ్యాసం కొనసాగించారు. చిరుప్రాయంలోనే అంటే 7 సంవత్సరాల వయసులోనే విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో రంగప్రవేశం చేసిన ఈమె తన పదవ యేటనే నేవల్ బేస్ ఉత్సవాలలోనూ, స్టీల్ ప్లాంట్, షిప్‌యార్డ్, బి. హెచ్. పి. వి., వుడా, లయన్స్ క్లబ్ వంటి ప్రముఖ సంస్థల వార్షికోత్సవ కార్యక్రమాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు..... “ నాట్య ‘ ప్రియ ‘ ".
ఇంకా చాలా.... ఈ క్రింది లింక్ లో..........
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 12 Pub. No. 006
No comments:
Post a Comment