Friday, October 16, 2020

“ ఆనందసిద్ధి ”... " ఓ గుండమ్మ కథ "... “ కూచిపూడి ‘ శోభ ’ ”.... ఇంకా చాలా....

*

కోరికలు తీరడానికే, చాలామంది పూజలు, జపాలు చేస్తున్నా, వాటివల్ల అన్ని సందర్భాల లోను వాళ్ళ కోరికలు తీరుతున్నాయా ? శివుడు విష్ణువు , కృష్ణుడు, గణపతి  ఇన్ని రకాల దేవుళ్ళు ఎందుకు ? ఇలాంటి సందేహాలకు అతనికి జవాబులు ఎక్కడా దొరకలేదు.... ఆనందసిద్ధి ”.

*

నిజజీవితంలో ఎంతో సున్నితమైన భావాలు, సుతిమెత్తని మనసుగల మానవి సూర్యకాంతం ! ఎవరు బాధలో ఉన్నా తట్టుకోలేక తనకు మించిన, తలకు మించిన సాయం చేసేవారని గొప్ప పేరు. నిజాయితీ, ఆత్మస్థైర్యం కల ఉజ్జ్వలమైన వ్యక్తిత్వం ఆమెది. అతితెలివిగా పారితోషికాలు తగ్గించి, ఎగవేసే నిర్మాతల దగ్గర ఖరాఖండిగా ప్రతి పైసా వసూలు చేసేవారు. అయితే ఎవరు కష్టంలో ఉన్నారని తెలిసినా తన వద్దనున్న ఆఖరి పైసా వరకు వారికి సాయం చేసే ఉదాత్తురాలిగా నిలిచిపోయారు...... " ఓ గుండమ్మ కథ ".  

*

500 ఏళ్ళుగా ఈ కూచిపూడి నృత్యం కేవలం పురుష ప్రాథాన్యతలో ఉన్నది. కూచిపూడి కి మాత్రమే పరిమితమైన ఈ కూచిపూడి భాగవతుల కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయిన ఈ నాట్యాన్ని ప్రపంచ వ్యాప్తి చెందించడానికి వెంపటి చినసత్యంగారు చేసిన యజ్ఞంలో శోభానాయుడు కూడా అహర్నిశలు శ్రమించారనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు..... కూచిపూడి శోభ  ”. 

ఇంకా చాలా అంశాలు.... ఈ క్రింది లింక్ లో......... 

శిరాకదంబం 10_005


 

 

Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 12 Pub. No. 005

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం