Sunday, May 3, 2015

బాలాంత్రపు రజనీకాంతరావు తో. లే. పి. .... రుద్రాక్ష..... 'మస్త మల్లి ' రెండవ భాగం... ఇంకా...

 ప్రకృతి వైపరీత్యాలు మనకేమీ క్రొత్త కాదు. తుఫానులు, హిమపాతాలు, వరదలు, భూకంపాలు.... ఇలా ఎన్నో... ! ప్రతీ సంవత్సరం ఎక్కడో అక్కడ, ఏదో ఒక స్థాయిలో ఇవి సంభవిస్తూనే వున్నాయి. మనిషి సాంకేతికంగా ఎంత ఎదిగినా ప్రకృతికి ఒదిగి వుండాల్సి వస్తూనే వుంది. ఈ ఉత్పాతాల్ని అరికట్టలేకపోయినా కనీసం ఎప్పుడు, ఏ స్థాయిలో సంభవిస్తాయో ఖచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పురోగతి సాధించాల్సి వుందని చెప్పక తప్పదు.

ఇటీవల నేపాల్ లో వచ్చిన భూకంపం ఆ దేశ ప్రజలకు పీడకల లాంటిదే ! తోటి మనుష్యులకు వచ్చిన ఈ కష్టానికి ప్రపంచమంతా కన్నీళ్లు పెట్టుకుంటోంది. మనుష్యుల్లో కుటిలత్వం, రాక్షసత్వం ఎంతగా పెరిగిపోతున్నాయని కలవరపడుతున్నామో, ఇలాంటి సందర్భాల్లో అంతగా మానవత్వం బయిటకు వస్తోంది. బాధితుల్ని ఆడుకోవడానికి భారతదేశం ముందడుగు వేసింది. ప్రపంచమంతా దీనిని అనుసరిస్తుందని ఆశిద్దాం. వారికి వచ్చిన కష్టాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా, అండగా వున్నామనే భరోసా వారిని కోలుకునేటట్లు చేస్తుందనడంలో సందేహం లేదు.
 *******************************************

శిరాకదంబం తాజా సంచిక ఈ క్రింది లింక్ లో .......

శిరాకదంబం 04_019  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 022

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం