Sunday, April 19, 2015

కోడి రామకృష్ణ....సాహసం ' మస్తమల్లి ' పథం.... సంస్మరణ... ఇంకా....

 రాజకీయం, సినిమా, క్రికెట్ రంగాలే కాదు.... ప్రభుత్వాలు, మీడియా పట్టించుకోవాల్సిన, ప్రాధాన్యం ఇవ్వవలసిన రంగాలు ఇంకా చాలా వున్నాయి.ఈ రంగాల్లోనే కాదు.... అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతులైన వారు ఎందరో వున్నారు. సరైన ప్రోత్సాహం లేక, తగినంత సహకారం లేక మరుగున పడిపోతున్నారు.
ఒక ప్రతిభావంతుడు, ప్రపంచ రికార్డులు సాధించిన తెలుగు వ్యక్తి గురించి ప్రభుత్వం, మీడియా.... రెండూ అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అతని జీవితం ముగింపుకు వచ్చిన తర్వాతే అందరూ స్పందించారు.
ఆ తెలుగు వ్యక్తి మల్లి మస్తాన్ బాబు. నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్ బాబు పర్వతారోహణలో మనకెవరికీ అందని శిఖరాలను అధిరోహించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శ్రేణులను అధిరోహించి ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఇది చాలదన్నట్లు ఇంకా పైకి.... ఇంకా పైకి.... అలా ఎక్కుతూ.... ఇక మనం అందుకోలేని ఎత్తుకి వెళ్ళిపోయారు.
ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసే ' సాహసం మస్తమల్లి పథం '
ఇంకా చాలా అంశాలు ఈ క్రింది లింక్ లో ......
శిరాకదంబం 04_018
   
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 021

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం