బాల్య వివాహాలు సర్వసాధారణం అయిన రోజులవి.
వివాహానికి కనీస వయస్సు అనే నియమమేదీ లేని రోజులవి.
కాటికి కాళ్ళు జాచుకున్న పండు ముసలి వాడైనా,
అయితే ముక్కుపచ్చలారని బాలికమణే కావాలి
పెళ్ళంటే.. సంసారమంటే.. అర్థమయ్యే వయస్సు వచ్చేసరికి
ఆ మొగుడు కాస్తా వయోభారంతో గుటుక్కు మంటే..
ఆమె వయసు, జీవితం అడవి కాచిన వెన్నెలే !
నచ్చిన బట్టలు కట్టడానికి లేదు....
అందమైన మోమున బొట్టు పెట్టడానికి లేదు....
అభిరుచితో అలంకారాలు చేసుకోవడానికి లేదు.....
నచ్చిన తిండి తినడానికి లేదు.....
స్త్రీ అలాంటి దుర్భర పరిస్థితుల్లో అలమటిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ వారికి అండగా నిలబడి, ఏటికి ఎదురీది విధవా పునర్వివాహం, స్త్రీ విద్య లాంటి ఎన్నో సంస్కరణలను ధైర్యంగా ప్రవేశ పెట్టి, అమలు చేసిన గొప్ప సంస్కర్త కీ. శే. కందుకూరి వీరేశలింగం పంతులు గారు.
వీరేశలింగం పంతులు గారి స్మృతి దినం సందర్భంగా నివాళులర్పిస్తూ .......
గతంలోని టపా :
సుమారు రెండు శతాబ్దాలు పరాయి దేశస్థుల పాలనలో మగ్గిపోయిన భారతావని స్వీయ పాలనలోకి వచ్చాక... ప్రభుత్వాన్ని ఏర్పరచడం... నడపడం కట్టి మీద సామే !
ఎన్నో అగచాట్లు పడిన ప్రజలు సుపరిపాలనను కోరుకుంటారు.
అంతకాలం తాము కోల్పోయినవన్నీ వెంటనే ఏర్పడాలని కలలు కంటారు.
ఆ కలల్ని నిజం చేసే నాయకులు వుండాలని... తాము కోరుకున్నవన్నీ అందించాలని ఆశిస్తారు.
సరిగ్గా అటువంటి పరిస్తితుల్లో భారత దేశానికి మొదటి ప్రధాన మంత్రి గా ఎన్నిక కాబడడమే కాక దీర్ఘకాలం అదే పదవిలో పని చేసి, నవ భారత పునర్నిర్మాణానికి ఎన్నో పథకాలు రచించి... ఎన్నో విషయాల్లో వెనుకబడిన దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించిన నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రు.
నెహ్రు స్మృతి దినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ.......
గతంలోని టపా :
ఆధునిక భారత రూపశిల్పి
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 141
2 comments:
అవును వీరు ప్రాతః స్మరనీయులు, ప్రొద్దున లేచినప్పటి నుంచి నిదుర పోయె వరకు కూడా నా గురించి నా కుటుంబం గురించి తప్ప అన్యుల గూర్చి సమాజం గూర్చి ఆలోచన సలిపే తీరిక ఉన్నా,
స్వార్థపు వైఖరితో సాగుతున్న రోజులివి. లౌకిక దృష్టితో మన నేటి స్వేచ్చకు మూల౦ వీరే! ఇలాంటి మహనీయులను స్మృతిపథం లో ఆ జన్మాంతం ఉంచుకోవాలి, వారు మన లాంటి మానవులే అయితే కాస్తంత స్వార్థం పక్కన పెట్టి పరులకోసం పాటు పడి జన్మను ధన్య మొనర్చుకోను ప్రయత్నం లో మహనీయులుగా ఆరాధించ బడుతున్నారని గుర్తెరిగి, పరోప కారార్థ౦ ఇదం శరీరం అనే స్పృహ తో ఉంటె అదే పదివేలు.
మహనీయులను వారి సేవలను సమయానికి తెలిపినందులకు కృతజ్ఞతలు.
ధన్యవాదాలండీ !
Post a Comment