 |
చిత్రం : శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన |
మనకు జీవితాన్నిచ్చిన ......
ఆ జీవితానికి వెలుగు నిచ్చిన .......
ఆ వెలుగుకో విలువనిచ్చిన .....
అమ్మకు మనమేం ఇవ్వగలం.....
అమ్మ త్యాగానికి విలువేమి కట్టగలం....
అవసరం తీరాక, వయసు మళ్ళాక.....
అంత శ్రద్ధగానూ చూసుకుని ఋణం తీర్చుకుంటే చాలు.
ఏ వృద్ధాశ్రమానికో, శ్మశానానికో అప్పగించకుండా వుంటే అదే పదివేలు.
యాంత్రిక మవుతున్న, కుచించుకు పోతున్న మనస్సులు సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మని, ఆమె త్యాగాన్నీ ఒక్కసారి మనసారా తలుచుకోవాలని కోరుకుంటూ ............
జానపద గీతం ఆమె స్వరంలో పదం పాడింది. అఖిలాంధ్ర శ్రోతల మనస్సులను పరవశింపజేసింది. ఆవిడే వింజమూరి సీత, అనసూయ జంటలో శ్రీమతి అనసూయ.
మాతృ దినోత్సవం సందర్భంగా జానపద గీతాలకు తల్లి లాంటి ఆమెతో పరిచయ కార్యక్రమం శ్రీమతి దుర్గ డింగరి టోరి రేడియోలో పాటలపల్లకిలో ఈరోజు మధ్యాహ్నం గం. 12.30 నుండి గం. 02.30 వరకూ ( సమయంలో మార్పు జరిగింది ) నిర్వహిస్తున్నారు. విని అనందించండి......

5 comments:
మా తృ దేవో భవ ..
జ్ఞానప్రసూనాంబ గారి "అమ్మ" కన్నీళ్లు తెప్పించింది. అలాటి అమ్మలందరికి శిరసా నమామి !
మంచి విషయాలు తెలిపే పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదములు.
శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారి వ్యాసం కన్నీళ్లు తెప్పించింది ...
ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అంత సహనం ఎలా ఉండేదో. గ్రయ్న్దర్ లు మిక్సీ లు లేకపోయినా అండ మందికి పొట్టు పొయ్యిల మీద, కట్టెల పొయ్యి మీద వండి పెట్టే వాళ్ళు. రోజంతా గానుగేద్దుల్లా, పని చేస్తూనే ఉండేవాళ్ళు. భూదేవి తో సమానమయిన వారి సహనంలో, వెయ్యోవంతు కూడా, ఇప్పటి మాకు లేదు.
జ్ఞాన ప్రసూన గారి వ్యాసం నాకు మా అమ్మని గుర్తుకి తెచ్చింది. మా ఇంటికి ఎప్పుడు, ఏ సమయంలో అతిథులు వచ్చినా లేచి వండిపెట్టడం మా అమ్మ మరో మాట మాట్లాడకుండా వారికిష్టమయినట్టుగా చేసి పెట్టేది. అంత చేసినా మా అమ్మ గురించి ఒక్కళ్ళు కూడా మంచి మాట మాట్లాడటం నేను వినలేదు. అమ్మలు అది పెద్దగా పట్టించుకోరేమో!
చాలా బాగా రాసారు జ్ఞాన ప్రసూన గారు.
టోరిలో ప్రసారమయిన ఇంటర్వ్యూ గురించి బ్యానర్ పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
అభినందనలతో,
దుర్గ.
* వనజా వనమాలి గారూ !
* జయ గారూ !
* పద్మిని గారూ !
* దుర్గమ్మా !
ధన్యవాదాలు
Post a Comment