Tuesday, April 10, 2012

భర్త...భర్తే !

 ఆల్బర్ట్ ఐన్ స్టీన్ .....
ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ. ముఖ్యంగా సైన్సు తో కొద్దిపాటి పరిచయమున్న ప్రతీవారికి తెలిసిన పేరు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొని విజ్ఞాన శాస్త్రంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మహానుభావుడు.

ఎంత గొప్పవాడైనా ఒక స్త్రీకి భర్తే ! ఎంత అభివృద్ధి చెందినా పురుషాధిక్యత విషయంలో, స్త్రీ వివక్షత విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఒకటే అనిపిస్తుంది.

ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకున్నా ఐన్ స్టీన్ కూడా సగటు భర్తే అని ఆయన మరణించిన చాలాకాలానికి దొరికిన ఆయన ఉత్తరాలు నిరూపించాయి. అందులో ఆయన తన భార్యకు విధించిన కొన్ని షరతులు కలిగిన ఉత్తరం కూడా వుంది.

ఆ షరతులు ఏమిటంటే  ..........

* సరిగా సమయానికి వంట చేసి భోజనం పెట్టాలి
* తన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఉంచాలి.
* రెండుపూటలా పడకగది, తన ఆఫీసు గది ఊడ్చి శుభ్రం చెయ్యాలి.   
* తన టేబుల్, దాని మీదున్న పుస్తకాలు, కాగితాలు ఎత్తి పరిస్తితుల్లో ముట్టుకోకూడదు.
* తను బయిటకు రమ్మన్నప్పుడే రావాలి గానీ తీసుకెళ్ళమని అడగకూడదు.
*  పిలిచినపుడు వెంటనే రావాలి. పడకగదిలోకి అయినా సరే !
* ఇతరుల ఎదుట, ముఖ్యంగా పిల్లల ఎదుట తన మాటకు ఎదురు చెప్పకు.

ఇప్పుడు ఒప్పుకుంటారా ? ఎంత గొప్పవాడైనా భర్త.... భర్తే.... అని. 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 131

6 comments:

G.P.V.Prasad said...

ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి?

ఆ.సౌమ్య said...

hm...pch!

శ్యామలీయం said...

కాలం అనేది మనుష్యుల ఆలోచనాధోరణిని శాసిస్తుంది.

ఇప్పటి కాలం కొలమానంతో ఐన్ స్టీన్ తప్పులెంచటం మంచిది కాదు.

ఒకప్పుడు అమ్మాయిలకు వివాహానంతరం యెలా ఉండాలో నేర్పేందుకు కోర్సులు మాన్యువల్స్ కూడా ఉండేవి.

ఇప్పుడు, స్త్రీపురుషసమానత్వకాలంలో పరస్పరం యెలా కలిసి అవగాహనతో జీవించాలో నేర్పేందుకు కోర్సులు మాన్యువల్స్ కూడా తప్పక ఉండాలి.

SRRao said...

* ఫణీంద్ర విశ్వనాథ్ గారూ !
* ఆ. సౌమ్య గారూ !
ధన్యవాదాలు.
* శ్యామలీయం గారూ !
ఐన్ స్టీన్ లాంటి గొప్ప వ్యక్తి తప్పులెంచడానికి రాసింది కాదండీ ! అప్పుడైనా ఇప్పుడైనా, ఎంతటి వాడైనా మానవ స్వభావాన్ని తెలుపుతుందంతే ! ధన్యవాదాలు

Anonymous said...

దీన్ని బట్టి గృహహింసపై ఐన్‌స్టీన్‌కు ఆసక్తిలేదని తెలుస్తోంది. :)

ఐన్‌స్టీన్ లాంటి వారితో సాహచర్యం పొందే అదృష్టం లభించాలేకాని, ఇలాంటివన్నీ నథింగ్!

SRRao said...

SNKR గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం