Sunday, April 1, 2012

జగదభిరాముడు శ్రీరాముడే !

 శ్రీరాముడు పరిపూర్ణ మానవ అవతారం. 
మానవుడు ఎలా ప్రవర్తించాలో, ఎంత బాధ్యతగా ఉండాలో తెలిపే రూపం.

నీతి నిజాయితీలు, సత్ప్రవర్తన, ప్రజా సంక్షేమం, పితృవాక్పరిపాలన, ఋజువర్తన, కర్తవ్య పరాయణత్వం,... ఇలాంటి ఎన్నో మానవ ధర్మాలను ఎన్ని కష్టాలోచ్చినా ఆచరించాలని లోకానికి తెలియజేసిన ఆదర్శ మానవుడు.

సీతారాముల దాంపత్యం అన్ని జంటలకూ ఆదర్శప్రాయం. ఎన్ని కష్టాలోచ్చినా ఒకరి కోసం ఒకరుగా, ఒకరి మాట మరొకరు గౌరవిస్తూ జీవించిన జంట వారు.

రామలక్ష్మణులు సోదర బంధానికే అలంకారం. కష్టాలలోను, సుఖాలలోను వెన్నంటి ఉండే లక్ష్మణుడు సోదరుని పట్ల ఆత్మీయతతో బాటు భక్తి భావం కలిగి వుండాలని తెలుపుతాడు.

భక్తిభావం అంటే ఏమిటో, భక్తుల పట్ల భగవంతుని కృప ఎలా వుంటుందో రుచి చూపిస్తారు శ్రీరాముడు, ఆంజనేయుడు. 

ఇలా ఏ రకంగా చూసినా ఆదర్శ వ్యక్తిత్వం, ఆత్మీయ సంబంధాలు, మానవత్వ విలువలు, ప్రజారంజక పాలన వంటి ఎన్నిటినో ఈ లోకానికి తెలియజేసిన ఇతిహాసం ' రామాయణం '.

అందుకే సీతారాములు, రామలక్ష్మణులు, శ్రీరామాంజనేయులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారు. ప్రతీ భారతీయుడి హృదయంలో రామాయణం శాశ్వత స్థానం పొందింది.  

ధర్మం దారి తప్పి, అధర్మం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో...
నీతిని పాతరేసి అవినీతే అందలమెక్కుతున్న ఈ రోజుల్లో...
మానవత్వ విలువలు మంట కలిసి దానవత్వం పెచ్చరిల్లుతున్న ఈ రోజుల్లో .....
ప్రజా పాలన అంటే అర్థం మారిపోయిన ఈ రోజుల్లో..... 
రామాయణాన్ని గురించి... అందులోని విలువల గురించి సమస్త మానవాళికి తెలియజెప్పాల్సిన అవసరం, బాధ్యతా.... ఆ అద్భుత ఇతిహాసం కలిగి వున్న మన భారతజాతికి వున్నది.  




Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 129

6 comments:

రాజ్యలక్ష్మి.N said...

మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

శోభ said...

బాబాయ్...

మీకు, ఇంట్లో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!

మాలా కుమార్ said...

మీకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Murthy said...

మీకు, మీ కుటుంబ సభ్యులందరకు ఆనంద, ఆయురారోగ్య, ఐశ్వర్యాలను ఇవ్వాలని
ఈ "శ్రీ రామ నవమి" సంధర్భముగా మనసారా కోరుకుంటున్నాను.
ఆపదా మపహర్తారం ధాతారాం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
సకల జనులకు "ఆదర్శ పురుషుడు" మన శ్రీరామ చంద్రుడు.
ధన్యవాదములతో
డి. యస్. ఆర్. మూర్తి

జయ said...

రామాయణ విలువ ఎంత బాగా చెప్పారండి. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

SRRao said...

* రాజీ గారూ !
* శోభమ్మా !
* ' మోర్ ఎంటర్టైన్మెంట్ ' గారూ !
* మాలాకుమార్ గారూ !
* డి. యస్. ఆర్. మూర్తి గారూ !
* జయ గారూ !

అందరికీ ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం