' ఆంధ్రరత్న ' బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మహా మేధావి. భవిష్యత్తును అంచనా వెయ్యడంలో దిట్ట. ఆయన ఓసారి మాట్లాడుతూ....
" ఆంధ్రుల్లో ముగ్గురు మేధావులున్నారు. వారిలో ఒకరు నేను. కానీ పెద్దగా పైకి రాను. ఎందుకంటే అల్పాయుష్కుడిని.
రెండవవారు కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన గొప్ప ప్రతిభావంతుడు. అయితే ఆయనకు వాక్ స్థానంలో శని వున్నాడు. అందుకే ఆయనకు విరోధాలు, విరోధులు ఎక్కువే !
ఆ కారణంగా ఆయన ఉన్నత స్థానానికి చేరుకోవడం కష్టమే !
ఆ కారణంగా ఆయన ఉన్నత స్థానానికి చేరుకోవడం కష్టమే !
ఇక మూడవ వారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన నవగ్రహమాలికా యోగ జాతకుడు. భవిష్యత్తులో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు " అన్నారు.
ఈ మాటల్లో ఎంత నిజముందో పరిశీలిద్దాం.....
దుగ్గిరాల వారు నలభై సంవత్సరాలు వయసు దాటకుండానే మరణించారు.
కట్టమంచి వారు విద్యావేత్తగా, విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నా విశ్వవిద్యాలయ స్థాయిని దాటలేదు.
ఇక భారత రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చెప్పవలసిన అవసరం లేదు.
2 comments:
:)
కట్టమంచి వారు మంత్రిగా కూడా పనిచేశారా రావు గారూ?
ఊకదంపుడు గారూ !
లేదండీ ! నాకు తెలిసినంతవరకూ ఆయన రాజకీయాల్లో పాల్గొన్నా రాజకీయ పదవులు అలంకరించిన ధఖలాలు లేవు.
Post a Comment