
దేవర్ హిందీలో ధర్మేంద్ర తో ' మా ' అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో ఏనుగు కూడా నటించింది. ఆ చిత్ర నిర్మాణం పూర్తయింది. రష్ చూసాక ధర్మేంద్ర తన పాత్ర చూసుకుని నీరసపడ్డాడు. నిజానికి ఆయన పాత్ర కంటే ఏనుగు పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా వుంది. ఆమాటే దేవర్ తో చెబుతూ ...
' ఇలా అయితే నా ఇమేజ్ దెబ్బతింటుంది. ఫాన్స్ బాధ పడతారు. ఏనుగు చేత డాన్సు కూడా చేయించారు. కనీసం అదైనా తీసెయ్యొచ్చు కదా ! ' అన్నారు.
ఆ మాట విన్న దేవర్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా ?
' ఈ చిత్రంలో హీరో ఏనుగే ! నువ్వు సపోర్టింగ్ ఆర్టిస్ట్ వి మాత్రమే ! '
No comments:
Post a Comment