నారాయణదాసుగారు ఒకరోజు తన శిష్యబృందంతో విజయనగరం పుర వీదులగుండా నడిచి వెడుతున్నారు. అదే సమయంలో విజయనగర ప్రభువు ఆనంద గజపతి మహారాజు గారు వ్యాహ్యాళికి బయిలుదేరారు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మహారాజు కూడా సాహిత్య పిపాసి, సరసుడు.
దాసుగార్ని చూసి ఊరికే వెళ్లిపోలేక ఓ చమత్కార బాణం విసరాలనిపించి " ఎక్కడికి కవి వృషభం ఇలా బయిలుదేరింది ? " అన్నారు రాజావారు.
ఆదిభట్ల వారేమైనా తక్కువ తిన్నారా ? ఆయనతోనా పరాచికాలు ! అందుకే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే అందుకుని " ఇంకెక్కడికి - తమవంటి కామధేనువు వద్దకే.... " అని ప్రతి చమత్కారం విసిరారు.
ఆదిభట్లవారి సమయస్పూర్తికి ఆనందగజపతి హృదయం ఆనందమయమైపోయింది.
Vol. No. 01 Pub. No. 305