Tuesday, May 25, 2010

బొమ్మను చేసి ...... ' వేటూరి ' !!


బొమ్మను చేసి ప్రాణము పోసి 
ఆడేవు నీకిది వేడుక 
గారడీ చేసి గుండెను కోసి 
నవ్వేవు ఈ వింత చాలిక !!

హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన "  దేవత "  లోని పాట ఇది. దీనిలో  ' బొమ్మను చేసి  ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక ....' అనే పల్లవి వేటూరిది. అతని అనుమతి మీద, పద్మనాభం కోరిక మీద ప్రారంభంలోని సాకీతో సహా దీన్ని పూర్తి చేసాను.



                                                                                                                .................. అంటారు మహాకవి శ్రీశ్రీ తన ' పాడవోయి భారతీయుడా '  సంకలనంలో. దీన్ని బట్టి వేటూరి వారి సినిమా రంగ ప్రవేశానికి ప్రయత్నాలు చాలా ముందే జరిగాయని అనుకోవచ్చు. అలాగే అప్పట్లో ఆయన ప్రవేశానికి వ్యాపార సూత్రాలు అడ్డుపడి వుండొచ్చు కూడా.



Vol. No. 01 Pub. No. 297

3 comments:

వేణు said...

ఆ పల్లవి వీటూరి దండీ. ఆయన కూడా పాటల రచయితే. ‘వయసు పిలిచింది’ అనే సినిమాలో ‘ఇలాగే... ఇలాగే సరాగమాడితే..’ పాట వీటూరి రాసిందే. వేటూరి, వీటూరి పేర్లలో అక్షర సామ్యం ... ఇద్దరూ ఒకరే అనుకునే ప్రమాదం కలిగిస్తోంది.

SRRao said...

వేణు గారూ !
ఈ విషయంలో నాక్కూడా సందేహం లేకపొలేదు. కానీ శ్రీశ్రీ గారు తన ' పాడవోయి భారతీయుడా ' పుస్తకంలో స్పష్టంగా వేటూరి అనే రాసారు. ఆ పుస్తకంలోని విషయాన్నే నేను ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాన్ని శ్రీశ్రీ గారు స్వయంగా ప్రూఫ్ దిద్దారని అంటారు. అయినా అచ్చు తప్పు దొర్లిందంటారా ? మరి ఈ విషయంలో ఏది నిజమో !

bharadwaja rangavajhala said...

ప్రూఫులు శ్రీశ్రీయే దిద్దినప్పటికిన్నీ ... అది వీటూరి వారి పల్లవే ... పద్మనాభం సినిమాలకు వీటూరి ఎక్కువగా రాసేవారు. మీరు ఫొటో కూడా మార్చాలి. వేటూరి తొలి పాట ఓ సీత కథ చిత్రంలో వినిపిస్తుంది.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం