
తెలుగు జాతి గర్వించదగ్గ గాయని టంగుటూరి సూర్యకుమారి గారు
ఆలపించిన ఈ దేశభక్తి గీతం వినండి.
మాదీ స్వతంత్ర్య దేశం
మాదీ స్వతంత్ర్య జాతి [[ మాదీ ]]
భరత దేశమే మా దేశం
భారతీయులం మా ప్రజలం
భరత దేశమే మా దేశం
భారతీయులం మా ప్రజలం [[ మాదీ ]]
వింధ్య హిమవర్తీ నీలాద్రుల సంధ్యారుణి తన భాషలు మావి
వింధ్య హిమవర్తీ నీలాద్రుల సంధ్యారుణి తన భాషలు మావి
గంగా గోదావరి సహ్యజాత్తుంగ తరంగితాద్విషయాలు మావి
గంగా గోదావరి సహ్యజాత్తుంగ తరంగితాద్విషయాలు మావి [[ మాదీ ]]
ఆలయమ్ముల శిల్ప విలాసం ఆరామమ్ముల కళా ప్రకాశం
ఆలయమ్ముల శిల్ప విలాసం ఆరామమ్ముల కళా ప్రకాశం
మొఘల్ సమాధుల రసకర హాసం
మాకు నిత్య నూతనేతిహాసం [[ మాదీ ]]
అహింసా పరమోధర్మ : సత్యంవద ధర్మంచర
అహింసా పరమోధర్మ : సత్యంవద ధర్మంచర
ఆ ద్విజుషుల వేద వాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు
ఆ ద్విజుషుల వేద వాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు [[ మాదీ ]]
స్వతంత్ర్యతా భాత్రుత్వాలు సమతా మా సదాశయాలు
జననీ ఓ స్వతంత్ర్య దేవీ కొనుమా నివ్వాళులు నావి
జననీ ఓ స్వతంత్ర్య దేవీ కొనుమా నివ్వాళులు నావి [[ మాదీ ]]
Vol. No. 01 Pub. No. 366


