Friday, August 6, 2010

మాదీ స్వతంత్ర్య దేశం


 తెలుగు జాతి గర్వించదగ్గ గాయని టంగుటూరి సూర్యకుమారి గారు 
ఆలపించిన ఈ దేశభక్తి గీతం వినండి.




మాదీ స్వతంత్ర్య దేశం
మాదీ స్వతంత్ర్య జాతి                [[ మాదీ ]]

భరత దేశమే మా దేశం
భారతీయులం మా ప్రజలం
భరత దేశమే మా దేశం
భారతీయులం మా ప్రజలం         [[ మాదీ ]]

వింధ్య హిమవర్తీ నీలాద్రుల సంధ్యారుణి తన భాషలు మావి
వింధ్య హిమవర్తీ నీలాద్రుల సంధ్యారుణి తన భాషలు మావి

గంగా గోదావరి సహ్యజాత్తుంగ తరంగితాద్విషయాలు మావి
గంగా గోదావరి సహ్యజాత్తుంగ తరంగితాద్విషయాలు మావి         [[ మాదీ ]]

ఆలయమ్ముల శిల్ప విలాసం ఆరామమ్ముల కళా ప్రకాశం
ఆలయమ్ముల శిల్ప విలాసం ఆరామమ్ముల కళా ప్రకాశం

మొఘల్ సమాధుల రసకర హాసం
మాకు నిత్య నూతనేతిహాసం                                               [[ మాదీ ]]  


అహింసా పరమోధర్మ :  సత్యంవద ధర్మంచర
అహింసా పరమోధర్మ :  సత్యంవద ధర్మంచర

ఆ ద్విజుషుల వేద వాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు   
ఆ ద్విజుషుల వేద వాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు                                       [[ మాదీ ]]                                                                             

స్వతంత్ర్యతా భాత్రుత్వాలు  సమతా మా సదాశయాలు
జననీ ఓ స్వతంత్ర్య దేవీ కొనుమా నివ్వాళులు నావి   
జననీ ఓ స్వతంత్ర్య దేవీ కొనుమా నివ్వాళులు నావి                  [[ మాదీ ]]




Vol. No. 01 Pub. No. 366

ఆర్యుల ముఖ్య ఆహారం




మునిమాణిక్యం నరసింహారావు గారి పేరు తెలియని సాహితీ ప్రియులుండరేమో ! గిలిగింతలు పెట్టే ' కాంతం కథలు ' ఒక్కటి చాలు ఆయన్ని హాస్య రచయితగా తెలుగువారి మదిలో నిలపడానికి.

ఆయన మచిలీపట్టణం లోని హిందూ హైస్కూల్లో పనిచేశారు. అప్పట్లో ఆయనకో వింత అలవాటుండేది. తరచూ గోళ్ళు కొరుక్కునేవారు. పాఠం చెప్పే సమయంలో కూడా ఆ అలవాటు కొనసాగేది. 

ఓసారి ఆయన ' ఆర్యులు - నాగరికత ' పాఠం చెబుతున్నారు. ఆయన పాఠంతో బాటు గోళ్ళు కొరకడం కూడా సాగుతోంది. మధ్య మధ్యలో విద్యార్థుల్ని ప్రశ్నలడుగుతున్నారు.

" ఆర్యుల ముఖ్య ఆహారం ఏమిటి ? " అని ఒక విద్యార్థిని లేపి అడిగారు.
 
" గోధుమలు, సజ్జలు, వరి ....... " అని నసుగుతున్నాడు ఆ విద్యార్థి.  మునిమాణిక్యం గారు తన పని కానిస్తూనే ఆ విద్యార్థితో 

" ఇంకా... " అన్నారు.

" రాగులు, జొన్నలు....." అని ఆగాడు, మేస్టారు ఇంకా ఏం చెప్పారా అని ఆలోచిస్తూ. మాస్టారు అతన్ని మరింత ఉత్సాహపరచాలని

" ఇంకా.... ఇంకా ....." అంటూనే వున్నారు గోళ్ళు కొరుక్కునే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.

ఇంకా ఏమున్నాయా అని తీవ్రంగా ఆలోచిస్తున్న ఆ విద్యార్థి పరధ్యానంగా

" గోళ్ళు " అన్నాడు.

.................. అంతే !  మాస్టారితో బాటు పిల్లలంతా ఒకటే నవ్వులు.

Vol. No. 01 Pub. No. 365

Thursday, August 5, 2010

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ

మా తెలుగు తల్లి కూర్పులోని  మరో దేశభక్తి గీతం  -
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దుగ్గిరాల వారి స్వర కల్పనలో ఆలపించారు. మీరూ ఆలకించండి.


 జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి  [[ జయ జయ ]]

జయ జయ సస్యామల సుశ్యామచలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా  [[ జయ జయ ]]

జయ దిశాంత గతశకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా   [[ జయ జయ ]]

గమనిక : మిత్రులు ' తెలుగు పద్యం ' బ్లాగు భైరవభట్ల కామేశ్వరరావు గారు పంపిన సమాచారం -

ఈ పాట (సంస్కృతం కదా) అర్థం కావలిస్తే ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.google.com/group/telugu-unicode/browse_thread/thread/488ec5e8ade49ee9?fwc=1pli=1




Vol. No. 01 Pub. No. 364
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం