Friday, August 8, 2014

వరలక్ష్మీవ్రత పుణ్యకథ... అరవిందుల సందేశము...చలువ పందిరులు.... ఇంకా చాలా.....

 ' శిరాకదంబం ' పత్రిక నాలుగవ వసంతం లోనికి అడుగు పెడుతోంది. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక విజయానికి దోహదపడిన పాఠక మిత్రులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు..... అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు.
ఆగష్టు నెల పండుగల మాసం. ఈరోజు ( 07 వ తేదీ, శుక్రవారం ) తెలుగు మహిళలకు అత్యంత పవిత్రమైన వరలక్ష్మీ వ్రతము. ఆ సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలతో .... డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి రచనలో గానకోకిల శ్రీమతి ఎస్. జానకి గళం నుంచి జాలువారిన ' వరలక్ష్మీ వ్రత పుణ్య కథ ' ........

తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాల లాంటి పద్యములెన్నో వున్నాయి. వాటిలో మచ్చుకి కొన్నిటిని పరిచయం చేసే ' ఆణిముత్యాలు ' .........
పిల్లల ఆసక్తి కి కావల్సిన శక్తిని ఇవ్వడానికి తమ జీవితాలనే చలువ పందిరులుగా మలచుకొన్న తల్లిదండ్రుల గురించి ' చలువ పందిరులు '........

ఆగష్టు 15 వ తేదీ శ్రీఅరవిందుల జన్మదినం కూడా ! 1947 సంవత్సరం ఆగష్టు 15 వ తేదీన భారత దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఆ సందర్భంగా ఆరోజు శ్రీఅరవిందులు భారతజాతికి ఇచ్చిన అమూల్యమైన సందేశం ' 1947 ఆగష్టు 15 అరవిందుల సందేశము ' .........
ఇంకా అనేక ఇతర శీర్షికలతో.... ఈ క్రింది లింక్ లో......

శిరాకదంబం 04_001



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No.035

Friday, July 25, 2014

సంగీతాంబుధి..... మైథిలీ వివాహ వేడుకలు... శ్రీ ఘంటసాల విజయకుమార్ తో. లే. పి. .... ఇంకా ...


   ‘ శిశుర్వేత్తి పశుర్వేత్తి గాన రసం ఫణిః ’
సంగీతానికి భాషా బేధం, ప్రాంతీయ బేధం... చివరికి ప్రాణి బేధం కూడా లేదు. మన చుట్టూ వున్న గాలిలో, మనం త్రాగే నీటిలో.... ఇంకా సరిగా గమనిస్తే మన మాటలో కూడా సంగీతం వుంది. శాస్త్రీయ సంగీతమంటే అదేదో బ్రహ్మ పదార్థం, మనకు కొరుకుడు పడదు అని భయపడి దూరంగా వుండిపోయే వారికోసం సులభ శైలి లో సూక్ష్మంగా పరిచయం చేసే శీర్షిక ‘ సంగీతాంబుధి ’ ఈ సంచికలో ప్రారంభం....
భారతదేశం వివాహ వ్యవస్థ ప్రపంచ ప్రసిద్ధం. విభిన్న వివాహ సంప్రదాయాలు భారతదేశం ప్రత్యేకత. అందులో ఉత్తర భారతంలోని ‘ మైథిలీ బ్రాహ్మణ వివాహ వేడుకలు ’ ......
కర్నాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాలనీ సులువుగా గుర్తించి నేర్చుకునేందుకు వీలుగా తయారు చేసిన ’ శ్రీ సరస్వతీ మేళకర్త  రాగ చిత్ర పటం ’.........
పద కవితా పితామహుడు అన్నమాచార్య 606 వ జయంతి సందర్భంగా ’ అన్నమయ్యకు అక్షరాంజలి ’    
శ్రీ ఘంటసాల విజయకుమార్ గారి ‘ తో. లే. పి. ’.......... ఇంకా చాలా .......

      ఈ క్రింది లింక్ లో ...... 



  Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 05 Pub. No. 034

Friday, July 11, 2014

యమునా పుష్కరం.... రాజ విద్వాంసులు.... నాదస్వర ద్వయం.... ఇంకా .....



* భారతీయులు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిని ఆరాధించే క్రమంలో మానవ జీవనానికి అవసరమైన నీటి వనరులను అందించే నదీమతల్లులను  పూజించడానికి.... సంవత్సరానికి ఒక ప్రధానమైన నదికి పుష్కరాల పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వచ్చాయి. ఆ యమున యొక్క చరిత్రను తెలియజేసే “ యమునా పుష్కరం ”
* గతంలో రాజులు రాజ్యాలు ఏలడం, యుద్ధాలు చెయ్యడమే కాదు కళాపోషణ కూడా చేసేవారు. అంతే కాదు.... కొందరు రాజవంశీయులు కళాకారులుగా కూడా రాణించారు. అలాంటి వారి గురించి “ రాజ విద్వాంసులు ”
* నాదస్వర సంగీతంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు జంట ‘ షేక్ మహబూబ్ సుభానీ దంపతులు ’ ల తో. లే. పి. 

ఇంకా చాలా  ఈ క్రింది లింక్ లో ....... 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 033
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం