‘ శిశుర్వేత్తి పశుర్వేత్తి గాన రసం ఫణిః ’
సంగీతానికి భాషా బేధం, ప్రాంతీయ బేధం... చివరికి ప్రాణి బేధం కూడా లేదు. మన చుట్టూ వున్న గాలిలో,
మనం త్రాగే నీటిలో.... ఇంకా సరిగా గమనిస్తే మన మాటలో కూడా సంగీతం
వుంది. శాస్త్రీయ సంగీతమంటే అదేదో బ్రహ్మ పదార్థం, మనకు
కొరుకుడు పడదు అని భయపడి దూరంగా వుండిపోయే వారికోసం సులభ శైలి లో సూక్ష్మంగా
పరిచయం చేసే శీర్షిక ‘ సంగీతాంబుధి ’ ఈ
సంచికలో ప్రారంభం....
భారతదేశం వివాహ వ్యవస్థ ప్రపంచ ప్రసిద్ధం. విభిన్న వివాహ
సంప్రదాయాలు భారతదేశం ప్రత్యేకత. అందులో ఉత్తర భారతంలోని ‘ మైథిలీ బ్రాహ్మణ వివాహ వేడుకలు ’
......
కర్నాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాలనీ సులువుగా
గుర్తించి నేర్చుకునేందుకు వీలుగా తయారు చేసిన ’ శ్రీ సరస్వతీ మేళకర్త రాగ చిత్ర
పటం ’.........
పద కవితా పితామహుడు అన్నమాచార్య 606 వ జయంతి సందర్భంగా ’ అన్నమయ్యకు అక్షరాంజలి ’
శ్రీ ఘంటసాల విజయకుమార్ గారి ‘ తో. లే. పి. ’.......... ఇంకా చాలా .......
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 034
1 comment:
1. కర్నాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాలనీ సులువుగా గుర్తించి నేర్చుకునేందుకు వీలుగా తయారు చేసిన ’ శ్రీ సరస్వతీ మేళకర్త రాగ చిత్ర పటం
2. కటపయాది సూత్రం - హంసధ్వనీ రాగ జనకుని సృజన -
ఇవి రెండు ఒకటేనా? సర్!
Post a Comment