* ప్రభువు
ఇంగితం కనిపెట్టి ఆస్థాన పౌరాణికుడు ఆంధ్రమహాభారతం తెచ్చి శాస్త్రికిచ్చాడు. “
సభ్యులందరూ కత్తుల మీద పరీక్ష ” అనుకున్నారు. సభలో మహారాజు మేనమామ తొంభై యేళ్ళ
వృద్ధుడు దంతులూరి వెంకటపతిరాజు భారతంలోని ‘ ఊరుభంగం ’ ఘట్టం తీయించారు. “
సంస్థానానికి తగిన ఘట్టం. శయ్యకి తగిన ఘట్టం. నా బిరుదునకిన్నీ తగిన ఘట్టం. నేనేది
నిరీక్షిస్తున్నానో అదే మమ్మేలినవారు సెలవిచ్చారు. అయితే ఒక మనవి ” అని దోసిలి
ఒగ్గాడు. - " శ్రీపాద
కథలు – ప్రత్యక్ష శయ్య "
Vol. No. 11 Pub. No. 013
* నాన్న జార విడిచాడు అమ్మ గర్భంలోకి
అమ్మ పోరాడమన్నది లోకం శోకం పైకి
అమ్మ తొలిగురువు. అమ్మ ఒడిలోనే ఓనమాలు నేర్చుకుంటాం. లోకం
శోకం పైకి పోరాటం చేయమన్నది అమ్మ అన్నందువల్లనే కిసలయించే వాక్యాలతో ఒంటరిగా
తెగించి పోరాడుతున్నానంటారు. - “ నేనో కవిత్వోపాసకుణ్ణి
”
*
ఇంకో రకం వాళ్ళుంటారు. ఆ భార్యామణి
గారు కావాల్సినవేవో ముందుగా చెప్పక పోగా, షాపుకెళ్ళి
ఫోన్ చెయ్యమని ఆర్డరు జారీ చేస్తుందనుకుంటా! ఆయన గారు బుద్ధిగా షాపులో ప్రతి
కూరముందు నిలబడి, వాటి గుణగణాలు, రంగులు, సైజులు ఫోనులో వర్ణించటం మొదలు పెడ్తాడు! - " అమెరికా ఇల్లాలి ముచ్చట్లు - లిటిల్ ఇండియా”
.... ఇంకా... చాలా.... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 11 Pub. No. 013
No comments:
Post a Comment