మనం బంధువుల, స్నేహితుల పెళ్ళికి వెళ్ళినపుడు అక్కడ అనేక తంతులను గమనించడంతో బాటు పురోహితుడు చదివే మంత్రాలను వింటూ వుంటాం. అయితే అవి సంస్కృత భాషలో వుండడం వలన వాటి అర్థాలు తెలియదు. ఆ మంత్రాలకు అర్థాలను తెలుగు లో వివరిస్తున్నారు ‘ హిందూ వివాహ విధి ’ శబ్దకదంబం లో .......
ఆసక్తి, పట్టుదల, కృషి వుంటే కళాకారుడిగా రాణించడానికి శారీరిక అవకరం అవరోధం కాదని నిరూపించిన, నాట్యంలో తమ ప్రతిభను ప్రదర్శించిన కొందరు నృత్య కళాకారుల గురించి ‘మేమూ నర్తిస్తాం ’ లో.....
గతంలో పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్లు, పత్రికల్లో ప్రకటనలు చూడకముందే ఆ సినిమా కథను టూకీగా మనకి చెప్పేసేవి. దానికి కారణం ఆ సినిమా కథలోని ముఖ్యమైన అంశాలను గ్రహించి, వాటిని అందంగా చిత్రించడమే ! వాటి సృష్టికర్తలైన పబ్లిసిటీ ఆర్టిస్ట్ లకు చిత్రసీమలో ప్రముఖ స్థానం వుండేది. అలాంటి ప్రముఖలలో శ్రీ ఈశ్వర్ ఒకరు. వారి తో. లే. పి. ఈ సంచికలో....
సహజంగా ఎదగాల్సిన మెదడును కృత్రిమంగా ఎదగాలని కోరుకుంటే ....... ‘ స్త్రీకి స్త్రీయే శత్రువు ’ లో....
ఇంకా చాలా ....... ఈ క్రింది లింకు లో .....
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 032
No comments:
Post a Comment