Wednesday, January 22, 2014

వందనం... అక్కినేనికి అభివందనం....


తెలుగు చిత్రాన్ని, తెలుగు జాతిని కీర్తి శిఖరాల మీద కూర్చోబెట్టిన జంట -
ఒకరు నందమూరి తారక రామారావు గారు అయితే మరొకరు అక్కినేని నాగేశ్వరరావు గారు
తెలుగు సినిమా అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది వీరిద్దరే ! 
తెలుగు చిత్ర రంగానికి మిగిలి వున్న ఒక్క పెద్దదిక్కు వెళ్లిపోయింది.
మరణం అనివార్యం. ఇది అందరికీ తెలుసు. ఆయనకు ముందే తెలుసు.
అయినా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయినప్పుడల్లా ఏదో వెలితి.
మొన్న లేత వయసులో ఉదయ్ కిరణ్...
నిన్న వెండితెర సీతమ్మ అంజలీదేవి...
ఈరోజు అక్కినేని...
ఆయనది పరిపూర్ణ జీవితం....
నటనకు భాష్యం చెప్పిన మహానటుడు.

పాత్రలలో ఒదిగిన నిజమైన నటుడు
జీవితంలో ఎదిగిన మహనీయుడు
తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించిన ఒక పుట ఆయనది.
అది ఎప్పటికీ నిత్యనూతనం....
అక్కినేని ఎప్పటికీ అమరుడే !
తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకున్నాడు.
తెలుగు వారు గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అక్కినేని. 

అందుకే వందనం... అక్కినేనికి అభివందనం... !! 

అక్కినేని పైన గతంలో వ్రాసిన టపాల లింకులు ...... 

అభినయానికి సజీవ రూపం
ఛాన్స్ మిస్
బాలరాజు కుర్చీ
ఎనిమిదిన్నర దశాబ్దాల నవయువకుడు
విజయా నందనవనం తయారైన వేళ....
మొదటి పురుష పాత్ర
నమ్మిన బంటు


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 018

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం