Wednesday, August 15, 2012

స్వాతంత్ర్యం వచ్చెనని.....

స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడచిపోయాయి. ప్రతీ ఆగష్టు పదిహేనున వాడ వాడా ప్రజలందరూ ఉత్సాహంగా జరిపే స్థాయి నుంచి ప్రభుత్వం లాంచనంగా జరిపే స్థాయికి ఈ ఉత్సవాలు చేరుకున్నాయి. సహజంగానే అప్పటి తరం పరాయి పాలనలో అనేక బాధలు అనుభవించడం, వాటి నుంచి విముక్తి కి ఉధృతంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడం, వారిని అనేక రకాలుగా ఉత్తేజ పరిచే నిస్వార్థ నాయకులు ఆనాడు ఉండడం వలన వారికి స్వాతంత్ర్యం రావడమనేది ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. అందుకే ఆ తరం ఉన్నంత కాలం సంబరాలు అంబరాన్ని అంటాయి. 

ఇప్పుడు స్వాతంత్ర్యం అనేమాట పాతబడి పోయింది. కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యానికి మనం పడ్డ కష్టమేముంది.....

ఎక్కడ జనగణమన వినబడినా లేచి నిలబడి శ్రద్ధగా కూడా పాడి జైహింద్ నినాదంతో ముగింపు పలకడం గతతరం జ్ఞాపకమై పోయింది. సినిమా చూడడం ఒక ఎత్తైతే చివరన మువ్వన్నల జెండా రెపరెపలు చూస్తూ నిలబడి జనగణమన ఆలపించడం కోసం ఎదురు చూసే తరం అది. 

సినిమా హాళ్ళలో ఆ జెండా నలుపు తెలుపు నుండి రంగులు పులుముకున్న కొద్ది రోజులకే క్రమంగా ప్రజలకు, ప్రభుత్వం కళ్ళకు కూడా రంగుటద్దాలు పడ్డాయి. స్వాతంత్ర్య ఫలాలు పంచరంగుల్లో కనబడ్డాయి. స్వాతంత్ర్య దినోత్సవం పల్లెలనుంచి, వాడలనుంచి... ముఖ్యంగా ప్రజలనుంచి క్రమంగా దూరం అయి ప్రభుత్వ లాంచనంగా మిగిలిపోయింది. ఇప్పుడు అది ఇంటర్నెట్ లో విహారం చేస్తున్నా బయిట మాత్రం ఉత్సవ వాతావరణం కరువై పోయింది. విద్యలో వ్యాపార సంస్కృతి ప్రబలిపోయాక కొన్ని కార్పోరేట్ విద్యాలయాలు తమ శైలి బోధనా పద్ధతిని బలవంతంగా విద్యార్థులపై రుద్దే క్రమంలో జెండా వందనం మాట దేవుడెరుగు, ర్యాంకులే శ్రీరామ రక్ష అన్నట్లు  ప్రవర్తిస్తున్నాయి. 

రవి గాంచని చోట కవి గాంచున్ అన్నట్లు మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో నాలుగు దశాభ్దాల క్రితమే చెప్పారు..... 

స్వాతంత్ర్యం  వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి.....
సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయి..... 

అని....

మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో............... 


మరో మజిలీ ....................

శిరాకదంబం పేరుతో ఈ బ్లాగ్ రాయడం ప్రారంభించి మూడు సంవత్సరాలు, అదే పేరుతో పత్రికగా ప్రారంభించి ఒక సంవత్సరం ఈరోజుతో పూర్తయ్యాయి. గత సంవత్సర కాలంలో పత్రిక కార్యకలాపాల కారణంగా సమయాభావం బ్లాగ్ రాతలకు కొంత అవరోధమయింది. ఫలితంగా బ్లాగ్ లో రాతలు తగ్గిపోయాయి. రాబోయే సంవత్సరమైనా గతంలో లాగ ఇంకా కొన్ని విశేషాలతో రాయాలనే సంకల్పం. ఎంతవరకూ సమయం సహకరిస్తుందో చూడాలి. 
ఈ బ్లాగు కారణంగా ఎంతో దూరంలో వున్నవారు కూడా మిత్రులయ్యారు. కొంతమంది ఆత్మీయ బంధువులయ్యారు. ఇంతమంది మిత్రుల్ని, బంధువుల్ని ఇచ్చిన ఈ బ్లాగుకు, పత్రికకు కృతజ్ఞుడిగా ఉంటూ ఈ బ్లాగు, పత్రికను ఆదరించి, ప్రోత్సహించిన, ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతా పూర్వక వందనాలు.  

గతం లోని టపాలు................

౬౩ వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
 జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ
 స్వరాజ్య స్పూర్తి
విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం
మాదీ స్వతంత్ర్య దేశం
స్వాతంత్ర్యమే మా జన్మహక్కనీ చాటండీ !
శ్రీలు పొంగిన జీవగడ్డయి.....
కొల్లాయి గట్టితేనేమి ? ' గాంధీ '
మన పతాక ప్రస్థానం
పదండి ముందుకు
స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి
జోహార్లు జోహార్లు జోహార్లు
కన్నతల్లి సేవ
జెండా ఎత్తర...
వీరగంధము తెచ్చినారము
నేడే స్వాతంత్ర్య దినం



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 156

2 comments:

Ennela said...

jai hind..

SRRao said...

ఎన్నెల గారూ !
ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం