Wednesday, August 26, 2009

ప్రతిధ్వని


ఒకసారి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర్రావుగారితో దర్శకులు ప్రత్యగాత్మగారు "రాజెశ్వర్రావుగారూ! ఒక సినిమాకి నేపధ్య సంగీతం చెయ్యాలంటే అంతమంది జనం , అన్ని వాయిద్యాలు , అంత ఖర్చు అవసరమా? బెంగాలీలు చూడండి! ఒక సితార్, సారంగి , ఫ్లూట్ వగైరాలతో లాగించేస్తారు . అయినా సంగీతం ఎంత బాగుంటుంది !" అన్నారు. "నిజమే సార్ ! చాలా బాఫుంటుంది. కానీ మన మద్రాస్ లో సినిమాలు ఆదివారాల్లో మార్నింగ్ షో లు మాత్రమె ఆడతాయని తెలుసుకదా! మరి నన్ను కూడా అలాగే చెయ్యమంటే చేస్తాను " అన్నారు. అంతే! ప్రత్యగాత్మగారు ఖంగారుపడి " వద్దులెండి. ఏదో మాటవరసకలా అన్నాను" అని వెళ్లిపోయారు.

1 comment:

Saahitya Abhimaani said...

మొన్నీమధ్య, ఝుమ్మంది నాదంలో, బాల సుబ్రహ్మణ్యం, సాలూరివారి చెళుకు చెప్పారు. అది ఈ విధంగా ఉన్నది.

ఒక నిర్మాత అతని సహచరులతో, సాలూరి వారు సంగీత కూర్పుకోసం కూచున్నారట. రాజేశ్వరరావుగారు హార్మోనియం మీద రకరకాల ట్యూన్స్ వినిపుస్తున్నారట. అక్కడ కూచున్నవారు తలా ఒక వ్యాఖ్య చేస్తున్నారట ట్యూను మరింత బాగుండాలన్న విషయం మీద.

ఇంతలో, టీ కుర్రాడు టీ తీసుకుని వచ్చి అందరికి ఇవ్వటం మొదలు పెట్టడట. రాజేశ్వరరావుగారు ఆ టీ అబ్బాయిని ఉద్దేశించి

"ఏమండి సార్! మీరుకూడ మీ అభిప్రాయం చెప్తారా!!
వింటాను"

అన్నారట. అంతే మ్యూజిక్ సిట్టింగ్ ఆ తరువాత సజావుగా సాగిందట.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం