Friday, August 14, 2009

పిల్ల ఖైదీలు

నిన్న లోహితా రెడ్డి , మొన్న మరొకరు కార్పోరేట్ కాలేజీల దౌష్ట్యానికి బలయిపోతున్నారు.
" మీ
పిల్లల్ని చంపేయ్యానుకుంటున్నారా? అయితే మా దగ్గరికి పంపించండి" అంటూ 'సరదా' బ్లాగ్ లో జగదీష్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూటికి నూరుపాళ్ళు నిజం. అవి పవిత్రమైన విద్యాలయాలు కావు. అచ్చమైన సెంట్రల్ జైళ్ళు. ఏం నేరం చేసారని ఆ పసివాళ్ళకి ఇంతటి శిక్ష ? ఈ శిక్షను అనుభవించే అంత శక్తిగానీ, తట్టుకునే పరిణితి గానీ వాళ్ళకు ఉంటుందా ? మొగ్గలోనే రాలిపోతున్న ఈ పసికందుల జీవితాలతో ఆటలాడుతున్నది ఎవరు ? ఖచ్చితంగా తల్లిదండ్రులే ! పిల్లల భవిష్యత్తుని తమ ఇష్టాలకి, ఆశయాలకి బలిపెడుతున్నారు. కన్నంత మాత్రాన వారి జీవితాలను బలి తీసుకునే హక్కు వారికి ఉందా? లేదు. కనడం బాధ్యత , మంచి జీవితాన్నివ్వడం కూడా వాళ్ళ బాధ్యతే! ఇది మరిచిపోయి మన ఇష్టాల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడే హక్కు తల్లిదండ్రులకే కాదు ఎవ్వరికీ లేదు. ఈ వ్యామోహం తల్లిదండ్డ్రులు బయిటపడి కార్పొరేట్ కాలేజీ ల జోలికి వెళ్ళకుండా ఉంటే వ్యాపారం అనే ఉచ్చు నుంచి విద్య బయిటపడుతుంది. పసిమొగ్గలు వికసిస్తాయి.

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం