Monday, August 31, 2009

తొలి తెలుగు చిత్ర వీరులు

చిత్ర వైభవం 05
తెలుగు వారు మూకీ చిత్ర యుగంలో కొంచెం వెనుకబడినా, టాకీను మాత్రం వెంటనే అందుకున్నారు. అంతేకాదు. తొలి టాకీ ' ఆలం ఆరా ' లో తెలుగు వారు పాలు పంచుకోవడం మనందరికీ గర్వకారణం. మరిన్ని వివరాలు....

రంగు మార్చుకున్న ఆకాశం

ఆదివారం సాయింత్రం సూర్యాస్తమయ సమయంలో ఆకాశం రంగు మార్చుకుంది.
అబ్బురపరచిన దృశ్యాలు....

తొలి ఘట్టాలు

చిత్ర వైభవం 04
మన చలన చిత్ర చరిత్రలో మధురమైన తొలి ఘట్టాలు ముఖ్యమైనవి కొన్ని.....

Saturday, August 29, 2009

తెలుగు భాషా దినోత్సవం


రోజు మాతృభాషాదినోత్సవం. సుమారు శతాబ్దం చరిత్ర కలిగిన వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవం. ఆయన ఉద్యమాన్ని ప్రారంభించి దాదాపుగా ఒకటిన్నర శతాబ్దం కావొస్తోంది. గ్రాంధిక భాషలో రచనలు చేయనివాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రచనలు ఉండాలని తిరుగుబాటు చేసి, ఏటికి ఎదురీది, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వ్యావహారిక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చి కార్యసాధకుడు ఆయన. గిడుగు కాదు పిడుగు అనిపించుకున్నాడు. 1966 లో మనరాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు చెయ్యాలన్నది సంస్థ ప్రధాన ఆశయం. 43 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. సంవత్సరం ఫిబ్రవరిలో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న మాతృ భాషల్లో తెలుగు కూడా ఒకటని, దీనికి రెండు దశాబ్దాలలోపు మయముందని తెలుస్తోంది. ఇది మాతృ భాషాభిమానులందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.
1. అధికార భాషా సంఘం చిత్తశుద్ధితో పనిచేసి వెంటనే కార్యాలయాలన్నిటిలో తెలుగుభాషనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి . ముఖ్యంగా పదకోశాలలో కృత్రిమమైన అనువాదాలను సవరించాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా అనువాదాలుండాలి గానీ అనువాదకుల పాండిత్య ప్రతిభ ప్రదర్శనకు వేదిక కాకూడదు.
2. బహుళ వాడుకలో ఉన్నా ఇతర భాషా పదాలను యథాతధంగా వాడటం వలన నిరక్షరాస్యులకు కూడా సులువుగా అర్థమవుతాయి. ఉదాహరణకి రైలు, బస్సు, రోడ్ మొదలయినవి. వీటిని మన భాషా పటిమతో అనువాదం చేసి అందర్నీ గందరగోళపరిచే పని మానుకుంటే అదికార భాష అమలు సులభసాధ్యమవుతుంది.
3. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ అవసరాన్ని సాకుగా చూపి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్న కార్పోరేట్ కాలేజీలను నియత్రించాలి.
4. ప్రాచీన భాష హోదా కేవలం నిధులు సాధించడం, ఖర్చు చెయ్యడం కోసం కాక వాస్తవంగా పరిశోధన, ప్రచురణ మొదలైన వాటికోసం మాత్రమే.. కావాలి.
5. విషయాన్నైనా ప్రజాబాహుళ్యం లోకి చొచ్చుకుపోయేటట్లు చేసేవి వివిధ కళారూపాలు. వీటిని తగిన రీతిలో ప్రోత్సహించినపుడు భాష ప్రజల్లోకి వెడుతుంది. కళారూపాలు గతవైభవం కాకూడదు.
6. మన భాషలోని ప్రముఖ కావ్యాల్ని, నాటకాల్ని ..అన్నిటినీ ఇతర భాషల్లోకి అనువాదాలు చేయించాలి. అంతేకాదు. వాటిని ఇతర భాషా ప్రాంతాల్లో ప్రచారం చెయ్యడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఆయా ప్రాంతాల కళారూపాల సహకారం తీసుకోవచ్చు. పరభాషలో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు తెలుగు భాషా వ్యాప్తికి ఉపకరించే కథలను, సన్నివేశాలను ఎన్నుకోవాలి .
ఇవి నాకు తోచిన కొన్ని సూచనలు మాత్రమే! చివరగా ఒక మాట. అందరూ తమవంతు కృషి చేస్తే ఐక్యరాజ్య సమితి నివేదిక తప్పని రుజువు చెయ్యొచ్చు. మన భాషను బతికించుకోవచ్చు. అదే గిడుగువారికి అసలైన నివాళి. అప్పుడే మాతృభాషా దినోత్సవ సార్ధకత.

తెలుగు చలనచిత్ర రంగ ఆవిర్భావం - చిత్ర వైభవం_003

ఇవాళ తెలుగు చిత్ర రంగం ప్రపంచ వ్యాప్తమైంది. ఈ రంగం మీద వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇదొక భారీ పరిశ్రమగా మారింది. అయితే ఈ చలన చిత్రాల్ని మన భాషకు పరిచయం చేసింది ఎవరు ? దాని వెనుక వున్నా కథా కమామీషు ఏమిటి ? ఇంతమందికి అన్నం పెడుతున్న ఈ రంగాన్ని మనకందించిన వారిగురించి తెలుసుకోవాల్సిన, స్మరించుకోవాల్సిన అవసరముంది కదా ! వివరాలకు.....

Thursday, August 27, 2009

మాటల మాంత్రికుడు - చిత్ర వైభవం 02

భారత దేశ చలనచిత్ర రంగంలో అతి ముఖ్యమైన మలుపు టాకీల ఆవిర్భావం. దీనికి ఆద్యుడు ఆర్దెషిర్ ఇరానీ. ఆయన గురించి, ఆయన "ఆలం ఆరా" గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు మీకోసం ....

Wednesday, August 26, 2009

ప్రతిధ్వని


ఒకసారి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర్రావుగారితో దర్శకులు ప్రత్యగాత్మగారు "రాజెశ్వర్రావుగారూ! ఒక సినిమాకి నేపధ్య సంగీతం చెయ్యాలంటే అంతమంది జనం , అన్ని వాయిద్యాలు , అంత ఖర్చు అవసరమా? బెంగాలీలు చూడండి! ఒక సితార్, సారంగి , ఫ్లూట్ వగైరాలతో లాగించేస్తారు . అయినా సంగీతం ఎంత బాగుంటుంది !" అన్నారు. "నిజమే సార్ ! చాలా బాఫుంటుంది. కానీ మన మద్రాస్ లో సినిమాలు ఆదివారాల్లో మార్నింగ్ షో లు మాత్రమె ఆడతాయని తెలుసుకదా! మరి నన్ను కూడా అలాగే చెయ్యమంటే చేస్తాను " అన్నారు. అంతే! ప్రత్యగాత్మగారు ఖంగారుపడి " వద్దులెండి. ఏదో మాటవరసకలా అన్నాను" అని వెళ్లిపోయారు.

చిత్ర వైభవం

బ్లాగర్లందరికీ నమస్కారం!
ఈనాడు ప్రజా జీవితంలో భాగమైపోయిన చలనచిత్రాల చరిత్రకు సంబంధించి నేను సేకరించిన సమాచారం ఆధారంగా వ్యాసాలు రాస్తున్నాను. వీటిలోని వాస్తవాల నిర్ధారణకు శాయశక్తుల కృషి చెయ్యటం జరిగింది. కానీ చరిత్ర కారుల అభిప్రాయాలు విబెదించటం సహజం. వృత్తిరీత్యా గతంలో చాలా సమాచారాన్ని సేకరించడం జరిగింది. దాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చి భావితరాలకు అందించాలనే సంకల్పంతో వ్యాస పరంపర ప్రారంభించాను. దీనికి మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తాను. సమాచారంలో ఏవైనా పొరబాట్లు ఉంటే వెంటనే తెలియజెయ్యండి. చరిత్ర ఎప్పుడూ చర్చను ఆహ్వానిస్తుంది. ఇక చిత్ర వైభవాన్ని తిలకించండి...

Tuesday, August 25, 2009

ఆగి ఆలోచించండి



Sunday, August 23, 2009

అంతరాయాల అంతర్జాలం

               గత రెండురోజులుగా అంతర్జాల ప్రవాహంలో తీవ్ర అంతరాయం కలుగుతుండడం చాలా ఇబ్బంది కలిగించింది. నా కంప్యూటర్ లో లోపమేమోనని తెగ మధన పడ్డాను. బి.యస్.యెన్.ఎల్. ఇంజనీర్ల సమ్మె ఫలితమో , ఏమో గానీ రెండురోజులుగా ఇబ్బంది పెట్టిన ఈ ప్రవాహం ఈరోజు కొంచెం నయం. అసలే బ్లాగ్ లోకానికి కొత్త. ఇంకా దీనికి సంబంధించిన సాంకేతిక అంశాల మీద అవగాహన పూర్తిగా రాలేదు. తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుండగా ఈ అంతరాయం. ఈ వినాయకచవితి రోజున బ్లాగ్ కుటుంబ సభ్యలకు శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉండదేమోనని భయపడ్డాను. కానీ అంత ప్రమాదం జరుగలేదు. అందుకే అందరికీ 
                శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు

వినాయకచవితి

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

Thursday, August 20, 2009

తెలుగు భాషను మనం పరిరక్షించుకోగలమా ?


ఇటీవలికాలంలో మనలో భాషాభిమానం బాగా పెరిగింది. ముఖ్యంగా అంతర్జాలంలో తెలుగు భాషాభిమానులు బాగా పాల్గోవటం ఆనందదాయకం. అయితే తెలుగు భాషను మనం మాత్రమే మాట్లాడడం, చదవడం, రాయడం కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచ భాష ఎలా అయిందో, ప్రపంచమంతా తెలుగు భాషావ్యాప్తికి తెలుగువాళ్ళందరూ చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి. బహుశా ఇది అత్యాశేమో కదా ! అయినా ఫర్వాలేదు. ప్రయత్నం చేద్దాం !! తెలుగు సాహిత్యాన్నీ , సంస్కృతిని , మహానీయులగురించి ..... ఇలా భాషకు సంబంధించిన అన్ని విషయాల గురించి ప్రపంచ భాషలన్నిటిలో ముఖ్యంగా ఇంగ్లీషులో అనువాదాలు, రచనలు వచ్చేటట్లు కృషి చెయ్యాలి. సర్ సి.పి. బ్రౌన్ తెలుగుభాషావ్యాప్తికి చేసిన కృషిని స్పూర్తిగా తీసుకుంటే ఇది అత్యాశ కాదేమో ! మరి దీనికి, రక్షించుకోవటానికి సంబంధం ఏమిటంటారా ? బ్రౌన్ రచనలు, పరిష్కరణలే దీనికి సమాధానం. మన భాష నాలుగుగోడల మధ్య మిగిలిపోకుండా చూసుకోగలిగితే దాన్ని రక్షించడం సులువు అవుతుంది. దీనికి రాష్ట్రేతర, దేశేతర తెలుగువాళ్ళందరూ నడుం బిగించాలి. ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో మన పండగలకు, ఉత్సవాలకు అక్కడివారిని పాల్గొనేటట్లు చెయ్యడంతోబాటు మన సంస్కృతిని వారికి అర్థమయ్యేటట్లు చేస్తే వారి ద్వారా ఆయా ప్రాంతాల్లో తెలుగు వైభవం వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రత్యెక కార్యక్రమాలు రూపొందించాలి. దశాబ్దాలుగా భాషోద్యమాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఫలితం శూన్యం. ఇకనైనా ప్రభుత్వాలమీద, రాజకీయనాయకులమీద ఆధారపడడం మానేసి భాషాభిమానులందరూ క్రియాశీలక కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడమే దీనికి సరైన పరిష్కారం. రాష్ట్రాన్ని వాళ్లకు వదిలేసి ముందు రచ్చ గెలుద్దాం. ఆలోచించండి.

Wednesday, August 19, 2009

మధుర స్మృతులు

ప్రపంచ ఛాయాచిత్రదినోత్సవ శుభాకాంక్షలు

Tuesday, August 18, 2009

Saturday, August 15, 2009

వర్తమానం

¬sÇÁLigS ª«sV©«s ®µ¶[aS¬sNTP ry*»R½Li»R½ûQùLi ª«sÀÁèLiµy ?

ª«sV©«sNTP ry*»R½Li»R½ûQùLi ª«sÀÁè 62 xqsLiª«s»R½=LSÌÁV gRi²T¶ÀÁF¡¸R¶WLiVV. @LiVV©y ª«sV©«s AÍÜ[¿RÁ©y ­sµ³y©yÌÁV, xqsLiNRPVÀÁ»R½»y*ÌÁV Gª«sWú»R½Li ª«sWLRiÛÍÁ[µR¶©«s²y¬sNTP Dµyx¤¦¦¦LRißá \|¤¦¦¦µR¶LSËصR¶V Fy»R½ÊÁ{qsòÍÜ[¬s INRP |msLiVVLiÈÁL`i xmsLjizqós¼½. ®µ¶[aS¬sõ NRPVµj¶zms®ªs[zqs©«s g][NRPVÍÞ ¿yÉÞ }msÌÁVÎÏÁþÍÜ[ @©yµ³R¶ @LiVV©«s INRP ÀÁ©«sõzmsÌýÁ©«sV @NRPVä©«s ¿Á[LRiVèNRPV¬s ryNRPV»R½V©«sõ ª«sW©«sª«s»R½*Li ª«sVWLkiò˳ÏÁ­sLiÀÁ©«s INRP ryª«sW©«sVù²T¶¬s ª«sV»R½¿³yLiµR¶xqsVÌÁV ÛËÁµj¶LjixqsVò©«sõ ¼d½LRiV¬s Gª«sV¬s @©yÍÜ[ @LóRiLi NSª«sÈÁLiÛÍÁ[µR¶V. ª«sW©«sª«s»y ­sÌÁVª«sÖÁõ Fy»R½lLi[xqsVò©«sõªyÎÏÁþ¬s GLi ¿Á¸R¶WùÖÁ ? ¬sÇÁLigS ª«sV©«s ®µ¶[aS¬sNTP ry*»R½Li»R½ûQùLi ª«sÀÁèLiµy ?

౬౩ వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


మన దేశాన్ని కాపాడుకుందాం ! స్వాతంత్ర్య ఫలాల్ని అనుభవిద్దాం !!

Friday, August 14, 2009

పిల్ల ఖైదీలు

నిన్న లోహితా రెడ్డి , మొన్న మరొకరు కార్పోరేట్ కాలేజీల దౌష్ట్యానికి బలయిపోతున్నారు.
" మీ
పిల్లల్ని చంపేయ్యానుకుంటున్నారా? అయితే మా దగ్గరికి పంపించండి" అంటూ 'సరదా' బ్లాగ్ లో జగదీష్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూటికి నూరుపాళ్ళు నిజం. అవి పవిత్రమైన విద్యాలయాలు కావు. అచ్చమైన సెంట్రల్ జైళ్ళు. ఏం నేరం చేసారని ఆ పసివాళ్ళకి ఇంతటి శిక్ష ? ఈ శిక్షను అనుభవించే అంత శక్తిగానీ, తట్టుకునే పరిణితి గానీ వాళ్ళకు ఉంటుందా ? మొగ్గలోనే రాలిపోతున్న ఈ పసికందుల జీవితాలతో ఆటలాడుతున్నది ఎవరు ? ఖచ్చితంగా తల్లిదండ్రులే ! పిల్లల భవిష్యత్తుని తమ ఇష్టాలకి, ఆశయాలకి బలిపెడుతున్నారు. కన్నంత మాత్రాన వారి జీవితాలను బలి తీసుకునే హక్కు వారికి ఉందా? లేదు. కనడం బాధ్యత , మంచి జీవితాన్నివ్వడం కూడా వాళ్ళ బాధ్యతే! ఇది మరిచిపోయి మన ఇష్టాల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడే హక్కు తల్లిదండ్రులకే కాదు ఎవ్వరికీ లేదు. ఈ వ్యామోహం తల్లిదండ్డ్రులు బయిటపడి కార్పొరేట్ కాలేజీ ల జోలికి వెళ్ళకుండా ఉంటే వ్యాపారం అనే ఉచ్చు నుంచి విద్య బయిటపడుతుంది. పసిమొగ్గలు వికసిస్తాయి.

వందన కదంబం

అందరికీ వందనాలు !
తెలుగు బ్లాగ్ ప్రపంచంలో విభిన్న విషయాల సమాహారంగా ఈ కదంబాన్ని కూర్చాలనే సదుద్దేశ్యంతో ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాను. సహ్రుదయులందరు తమ సూచనలు, సలహాలతో కదంబానికి మరింత సుగంధాన్ని అద్దుతారని అశిస్తూ ....
మీ
శిరా
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం