Monday, April 4, 2011

ఉగాది ఊసులు



వికృతి చేసిన విలయతాండవాన్ని మరిపించి
ఆనందతాండవం చేయించడానికి విచ్చేసిన
శ్రీ ఖర నామ సంవత్సరానికి సాదర స్వాగతం పలుకుతూ .........



.............. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో .....
శిరాకదంబం కానుక శ్రీ ఖర నామ ఉగాది ఊసులు అందుకోండి.............




Vol. No. 02 Pub. No. 190

Sunday, April 3, 2011

చలనచిత్ర కళా తపస్వి


 నిరంతర పరిశ్రమ, దీర్ఘకాల సంఘర్షణలతో ఉన్నత పీఠాన్నధిరోహించిన వారి కోవలోకి చేరిన మరో వ్యక్తి జి. వి. అయ్యర్. 1983 వ సంవత్సరానికి భారతదేశంలో నిర్మించిన ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకున్న “ ఆది శంకరాచార్య “ తో ఆయనకు ఈ గుర్తింపు వచ్చింది. చిత్రా పరిశ్రమకు అంకితమైన అయ్యర్ కీర్తికిరీటంలో ఈ గౌరవం మరో కలికి తురాయి. 67 సంవత్సరాల ( అప్పటికి ) వయసు కలిగిన అయ్యర్ తనకు కలిగిన జాతీయ గుర్తింపులో ప్రత్యేకత ఏమీ లేదని, అర్హత కలదనిపించిన చిత్రానికే ఆ అవార్డును ఇవ్వడం జరిగిందని అన్నారు.

కానీ ప్రాచీన భారత దేశంలో మాత్రమే వాడుకలో వున్నట్లు చెప్పబడుతున్న సంస్కృత భాషలో నిర్మించిన చిత్రం ఏ వర్గం ప్రేక్షకుల కోసం నిర్మించారని అడిగినపుడు ప్రశాంత గంభీర స్వరంతో .................
“ ఆ కాలానికి చెందిన సరైన సమన్వయ భాష ఏది ? నేను శంకరాచార్యుని జీవితచరిత్రను గానీ, దైవాంశశంభూతునిగా అతని మహిమలను గానీ చిత్రీకరించదలచుకోలేదు. 32 సంవత్సరాల శంకరాచార్య జీవితంలో ఆయన ఆలోచనలు, వేదాంతం మాత్రమే నేను దృష్టిలో వుంచుకున్నాను. సృజనాత్మక కళాకారుడు సరైన కాలాన్ని దృష్టిలో వుంచుకుంటాడు. ఆ కాలాన్ని సరిగ్గా విశ్లేషించగలిగితే అది ఆ యుగాన్ని ప్రతిబింబిస్తుంది. పరిసరాలు, వస్త్రధారణ, భాషా ప్రయోగం – ఈ వివరాలన్నీ ఆ కాలానికీ, పరిస్థితులకు సంభంధించినట్లుగా మలచవలసి వుంటుంది. ఆ కాలాన్ని, పరిస్థితులను పరిశీలించినపుడు అన్నీ భాషల ప్రజలకు వారధిగా వున్న భాష ఏది ?
అయిదు వందల ఏళ్ల క్రితం ఇంగ్లీషు లాంటి భాష ఏదీ భారతదేశంలో లేదు. అప్పుడున్నది సంస్కృతం మాత్రమే ! అందువలనే ఆ కాలంనాటి పరిస్థితులను సృష్టించడానికి ఆ భాష మీద ఆధారపడవలసి వచ్చింది. ఆ రకంగా మేము మొట్టమొదటి సంస్కృత భాషా చిత్రాన్ని నిర్మించాం  "

............... ఇంక మిగిలిన వ్యాసాన్ని చిత్రమాలిక లో చదవండి.
 
Vol. No. 02 Pub. No. 189

Saturday, April 2, 2011

నటుడెవరు ? - జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 40 - జవాబులు 
                                                                                                                                       
1 ) ఈ ప్రక్క చిత్రంలో వున్న నటిని సులువుగానే గుర్తు పట్టవచ్చు. ప్రక్కన వున్న నటుడు ఎవరు ?                                                

జవాబు : సర్వదమన్ బెనెర్జీ 
ఈ ప్రశ్నకు జవాబు రాసిన వారందరూ సరైన సమాధానమే రాసారు. కేవలం నటుణ్ణి గుర్తుపట్టిన వారిలో అందరితో బాటు ఆ. సౌమ్య గారు కూడా వున్నారు.
 
2 ) ఆ నటుడు కొన్ని ప్రత్యేక తరహా పాత్రల్లో నటించాడు. ఆ పాత్రలు ఏమిటో, అవి వేటిలోవో చెప్పగలరా ?
జవాబుఅది శంకరాచార్య ( 1983 ) - జి. వి. అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన తోలి సంస్కృత చిత్రమిది. ఇందులో బెనెర్జీ అది గురువు శంకరాచార్యుని పాత్రలో జీవించారు. 
ఈ విషయాన్ని ప్రసీద గారు ఒక్కరే రాసారు.

శ్రీ దత్త దర్శనం ( 1985 ) - దత్తాత్రేయుని పాత్రలో బెనెర్జీ నటించారు. 
ఈ విషయం జ్యోతి గారు, ప్రసీద గారు రాసారు.

స్వామి వివేకానంద ( 1998 ) - జి. వి. అయ్యర్ దర్శకత్వంలో టి. సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో వివేకానందుని పాత్ర అద్భుతంగా పోషించారు. 
 ఈ విషయాన్ని జ్యోతి గారు, ప్రసీద గారు రాసారు.

ఇవి కాక సిరివెన్నెల ( 1986 ) చిత్రంలో పోషించిన అంధ కళాకారుని పాత్రకు ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇది కూడా ప్రత్యేక తరహా పాత్రగా తీసుకుంటే ఈ విషయాన్ని జ్యోతి గారు, బాలు గారు రాసారు.

ఇక శ్రీకృష్ణ టెలివిజన్ సీరియల్ లోని శ్రీకృష్ణ పాత్రకు ఎనలేని ఆదరణ లభించింది.
ఈ విషయాన్ని జ్యోతి గారు, ప్రసీద గారు రాసారు.

ఇక పైన ఇచ్చిన ఛాయాచిత్రం డబ్బింగ్ రచయితగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన స్వర్గీయ రాజశ్రీ దర్శకత్వం వహించిన ' ఓ ప్రేమ కథ ' చిత్రంలోనిది. బెనెర్జీతో రాధిక కూడా ఆ చిత్రంలో వున్నారు.

Vol. No. 02 Pub. No. 188a
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం