Monday, April 4, 2011
Sunday, April 3, 2011
చలనచిత్ర కళా తపస్వి
నిరంతర పరిశ్రమ, దీర్ఘకాల సంఘర్షణలతో ఉన్నత పీఠాన్నధిరోహించిన వారి కోవలోకి చేరిన మరో వ్యక్తి జి. వి. అయ్యర్. 1983 వ సంవత్సరానికి భారతదేశంలో నిర్మించిన ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకున్న “ ఆది శంకరాచార్య “ తో ఆయనకు ఈ గుర్తింపు వచ్చింది. చిత్రా పరిశ్రమకు అంకితమైన అయ్యర్ కీర్తికిరీటంలో ఈ గౌరవం మరో కలికి తురాయి. 67 సంవత్సరాల ( అప్పటికి ) వయసు కలిగిన అయ్యర్ తనకు కలిగిన జాతీయ గుర్తింపులో ప్రత్యేకత ఏమీ లేదని, అర్హత కలదనిపించిన చిత్రానికే ఆ అవార్డును ఇవ్వడం జరిగిందని అన్నారు. కానీ ప్రాచీన భారత దేశంలో మాత్రమే వాడుకలో వున్నట్లు చెప్పబడుతున్న సంస్కృత భాషలో నిర్మించిన చిత్రం ఏ వర్గం ప్రేక్షకుల కోసం నిర్మించారని అడిగినపుడు ప్రశాంత గంభీర స్వరంతో .................
“ ఆ కాలానికి చెందిన సరైన సమన్వయ భాష ఏది ? నేను శంకరాచార్యుని జీవితచరిత్రను గానీ, దైవాంశశంభూతునిగా అతని మహిమలను గానీ చిత్రీకరించదలచుకోలేదు. 32 సంవత్సరాల శంకరాచార్య జీవితంలో ఆయన ఆలోచనలు, వేదాంతం మాత్రమే నేను దృష్టిలో వుంచుకున్నాను. సృజనాత్మక కళాకారుడు సరైన కాలాన్ని దృష్టిలో వుంచుకుంటాడు. ఆ కాలాన్ని సరిగ్గా విశ్లేషించగలిగితే అది ఆ యుగాన్ని ప్రతిబింబిస్తుంది. పరిసరాలు, వస్త్రధారణ, భాషా ప్రయోగం – ఈ వివరాలన్నీ ఆ కాలానికీ, పరిస్థితులకు సంభంధించినట్లుగా మలచవలసి వుంటుంది. ఆ కాలాన్ని, పరిస్థితులను పరిశీలించినపుడు అన్నీ భాషల ప్రజలకు వారధిగా వున్న భాష ఏది ?
అయిదు వందల ఏళ్ల క్రితం ఇంగ్లీషు లాంటి భాష ఏదీ భారతదేశంలో లేదు. అప్పుడున్నది సంస్కృతం మాత్రమే ! అందువలనే ఆ కాలంనాటి పరిస్థితులను సృష్టించడానికి ఆ భాష మీద ఆధారపడవలసి వచ్చింది. ఆ రకంగా మేము మొట్టమొదటి సంస్కృత భాషా చిత్రాన్ని నిర్మించాం "
............... ఇంక మిగిలిన వ్యాసాన్ని చిత్రమాలిక లో చదవండి.
Vol. No. 02 Pub. No. 189
లేబుళ్లు:
చలనచిత్ర,
ప్రముఖుల విశేషాలు
Saturday, April 2, 2011
నటుడెవరు ? - జవాబులు
కనుక్కోండి చూద్దాం - 40 - జవాబులు
జవాబు : సర్వదమన్ బెనెర్జీ
ఈ ప్రశ్నకు జవాబు రాసిన వారందరూ సరైన సమాధానమే రాసారు. కేవలం నటుణ్ణి గుర్తుపట్టిన వారిలో అందరితో బాటు ఆ. సౌమ్య గారు కూడా వున్నారు.
2 ) ఆ నటుడు కొన్ని ప్రత్యేక తరహా పాత్రల్లో నటించాడు. ఆ పాత్రలు ఏమిటో, అవి వేటిలోవో చెప్పగలరా ?
జవాబు : అది శంకరాచార్య ( 1983 ) - జి. వి. అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన తోలి సంస్కృత చిత్రమిది. ఇందులో బెనెర్జీ అది గురువు శంకరాచార్యుని పాత్రలో జీవించారు.
ఈ విషయాన్ని ప్రసీద గారు ఒక్కరే రాసారు.
శ్రీ దత్త దర్శనం ( 1985 ) - దత్తాత్రేయుని పాత్రలో బెనెర్జీ నటించారు.
ఈ విషయం జ్యోతి గారు, ప్రసీద గారు రాసారు.
స్వామి వివేకానంద ( 1998 ) - జి. వి. అయ్యర్ దర్శకత్వంలో టి. సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో వివేకానందుని పాత్ర అద్భుతంగా పోషించారు.
ఈ విషయాన్ని జ్యోతి గారు, ప్రసీద గారు రాసారు.
ఇవి కాక సిరివెన్నెల ( 1986 ) చిత్రంలో పోషించిన అంధ కళాకారుని పాత్రకు ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇది కూడా ప్రత్యేక తరహా పాత్రగా తీసుకుంటే ఈ విషయాన్ని జ్యోతి గారు, బాలు గారు రాసారు.
ఇక శ్రీకృష్ణ టెలివిజన్ సీరియల్ లోని శ్రీకృష్ణ పాత్రకు ఎనలేని ఆదరణ లభించింది.
ఈ విషయాన్ని జ్యోతి గారు, ప్రసీద గారు రాసారు.
ఈ విషయాన్ని జ్యోతి గారు, ప్రసీద గారు రాసారు.
ఇక పైన ఇచ్చిన ఛాయాచిత్రం డబ్బింగ్ రచయితగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన స్వర్గీయ రాజశ్రీ దర్శకత్వం వహించిన ' ఓ ప్రేమ కథ ' చిత్రంలోనిది. బెనెర్జీతో రాధిక కూడా ఆ చిత్రంలో వున్నారు.
Vol. No. 02 Pub. No. 188a
Subscribe to:
Posts (Atom)
ప్రాచుర్యం
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...


