Tuesday, December 21, 2021

“ లెట్స్ గో ఇండియా ... “ ఎక్కిరాల అనంతకృష్ణ ”... “ ఋతువైరం ”... ఇంకా....

 *

“దూరపు కొండలు నునుపు” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నాయి. సమస్యల్ని...ఇబ్బందుల్ని జాగ్రత్తగా తెలివిగా అధిగమిస్తూ వెళ్ళటమే మనపని. ఎవరికైన చిన్ననాటి మధురస్మృతుల్ని అప్పటి సరదాలను మనసులో భద్రంగా దాచుకోవాలే కాని వాటిని మళ్ళీ పొందాలని ప్రయత్నం చేస్తే అవి చేదుస్మృతులయ్యే ప్రమాదం ఉంది.....‘ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ’ శీర్షికన “ లెట్స్ గో ఇండియా ”…. 

* 

అయన హిందూ కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగం లో ఉపన్యాసకులుగా పనిచేసేవారు. దాదాపు అదే సమయంలో, అనగా 1957-58 సంవత్సరంలో నేను అదే కళాశాల లో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదివే విద్యార్థి ని. శ్రీ కృష్ణమాచార్య మాస్టారు మాకు ఉపవాచకం గా నిర్దేశింపబడిన కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన ఏకవీర ను బోధించేవారు. మాష్టారు పాఠాన్ని బోధించే తీరు, దాని విశ్లేషణ మమ్మల్ని ఎంతగానో ఆకర్షించేవి .. ఈ రకం గా ఆనాడే వారంటే  ఒక ప్రత్యేకమైన భక్తి భావం, ప్రేమ ఏర్పడ్డాయి..... ‘ తో. లే. పి. ’ శీర్షికన “ ఎక్కిరాల అనంతకృష్ణ ” 

 * 

చూడగనే, నను చూడగనే 

నభమున ఆ రేడు ఈడేరెనే

జాబిల్లి, తారలు ఆటాడెనే 

ఇక ఆటాడెనే,  ఆటాడెనే  ఇక ఆటాడెనే || ..... సంగీత నృత్య నాటిక “ ఋతువైరం ”

ఇంకా.... చాలా.... ఈ క్రింది లింక్ లో..... 

శిరాకదంబం 11_008   


 

 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 13 Pub. No. 008

Tuesday, October 26, 2021

దృశ్య శ్రవణ సంచిక... అక్షర రూప సంచిక....

' శిరాకదంబం ' అంతర్జాల పత్రిక ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానంగా కొన్ని మార్పులు చెయ్యడం జరిగింది. ఆ ప్రకారం పక్ష పత్రికగా ' శిరాకదంబం ' ఇప్పటివరకు ప్రతి నెలలో వెలువడుతున్న రెండు సంచికలలో ఒకదానిని ' దృశ్య శ్రవణ సంచిక ' గా, మరొకదానిని ' అక్షరరూప సంచిక ' గా మార్పు చేసినట్లు పాఠకులు గమనించే ఉంటారు. 

అక్షరరూప సంచిక కోసం రచయితలు తమ రచనలను పంపించడానికి అవసరమైన సూచనలను, దృశ్య శ్రవణ సంచిక కోసం ఆడియో / వీడియో, చిత్రాలు, కార్టూన్లు వంటివాటిని సమర్పించేవారికి అవసరమైన సూచనలను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు. 

https://sirakadambam.com/  

 11_003 - దృశ్య శ్రవణ సంచిక.... ఈ క్రింది లింక్ లో..........

 https://sirakadambam.com/11_003/ 



11_004 - అక్షరరూప సంచిక.....ఈ క్రింది లింక్ లో.....

 https://sirakadambam.com/11_004/


 

Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 13 Pub. No. 003 & 004

Monday, September 20, 2021

శరన్నవరాత్రులు....తెలుగు యాత్రా సాహిత్యం... ప్రతీచి లేఖ... ఇంకా...

 * సృష్టికి మూలం మహామాత. ఆమె కనుసంజ్ఞలలో మెదులుతుంది... కదులుతుంది జగత్తు. పృథ్వి ఆమె రూపం. అట్టి సీమను దివ్యసీమగా మార్చటానికి, నరుల నేత్రాలను దేదీప్యమానంగా వెలుగొంద జేయటానికి తల్లి ఈ నవరాత్రులలో అందరి ఇళ్లల్లో, కళ్లల్లో నాట్యమాడుతుంది..... “ శరన్నవరాత్రులు ”

 * వంద సంపుటాలకు పైబడ్డ మహాత్మాగాంధీ రచనల్లో మొట్టమొదటి రచన ఈ యాత్రాకథనమే. కాని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఒక మనిషి తన చల్లని ఇంటిపట్టు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ, అనిశ్చయాలకు ఎదురేగే ప్రతి యాత్రా అతణ్ణి స్వాప్నికుడిగానో, సాహసిగానో మారుస్తుంది...... “ తెలుగు యాత్రా సాహిత్యం ” 

 

*  సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.

కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం....... " ప్రతీచి లేఖ "

 

ఇంకా.... ఈ క్రింది లింక్ లో...... 

శిరాకదంబం 11_002 


Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 13 Pub. No. 002

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం