Sunday, April 4, 2010

గుజ్జన గూళ్ళు

కనుక్కోండి చూద్దాం - 15


ఈ పేరు వినగానే చిన్న పిల్లల ఆట గుర్తుకువస్తుంది.
ఇప్పటితరం వారికి తెలియదేమో కానీ నాల్గయిదు దశాబ్దాల క్రితం వరకూ అంటే టీవీ అనేది లేని రోజుల్లో పిల్లలందరూ సాయింత్రం హాయిగా ఆరుబయిట రకరకాల ఆటలు ఆడుకునేవారు.

అప్పటి తరానికి చెందిన వారికి ముఖ్యంగా సోదరీమణులకు ఈ ఆట గురించి బాగా తెలిసి వుంటుంది.
ఈ ఆట ఆడే విధానాలలో అనేక రకాలున్నట్లుగా తెలుస్తోంది.
తమకు తెలిసిన విధానాల గురించి మిత్రులెవరైనా వివరించగలరా ?

ఇక అసలు ప్రశ్న - ' గుజ్జనగూళ్ళు ' అనే మాటకు అర్థమేమిటి ? దాని పూర్వాపరాలేమిటి ?

 Vol. No. 01 Pub. No. 243

Saturday, April 3, 2010

దటీజ్ మదర్ !!

అదొక అద్భుతమైన, అపురూపమైన సన్నివేశం. 1969 జూలై 20 వ తేదీన మానవుడు చంద్రమండలాన్ని జయించాడు. తొలిసారిగా నీల్ అర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు పెట్టాడు. ప్రపంచమంతా పండుగ చేసుకుంది. అదొక సంచలనం.

అందరిలాగే కలకత్తాలోని మదర్ థెరిస్సా అనాదాశ్రమంలోని వారందరూ కూడా సంతోషం పట్టలేక పోయారు. వెంటనే మదర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పారు. ఆవిడ కూడా ఎంతో సంతోషించారు.

అందులో ఒకామె మదర్ తో " మీరెప్పుడైనా చంద్రమండలానికి వెళ్ళే అవకాశం వుందా మదర్ ? " అని అడిగింది.

దానికి మదర్ తన సహజ ధోరణిలో " అక్కడ కూడా నిరుపేదలు, దిక్కులేని వారు వున్నారంటే తప్పకుండా వారి సేవలకోసం వెడతాను. నేనే కాదు. మిమ్మల్ని కూడా తీసుకేడతాను " అన్నారట. దటీజ్ మదర్ !!

Vol. No. 01 Pub. No. 242

Thursday, April 1, 2010

అంబులన్స్ డ్రైవర్లు

కనుక్కోండి చూద్దాం - 14


ఫోటో కనిపిస్తున్న వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాడు.
పెద్దల కంటే పిన్నలకు చాలా ఆత్మీయుడు.


ఈయన కూడా ప్రపంచ ప్రముఖుడే !
కాకపోతే పుస్తక ప్రియులకు ఆత్మీయుడు !!

ఈయన కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచినవాడే !
ఈయన కూడా పుస్తక ప్రియులకు ఆత్మీయుడే !

వీరందరూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అంబులన్స్ డ్రైవర్లుగా పనిచేశారు.

ఈ ముగ్గురినీ గుర్తుపట్టగలరా ?
వీరి పేర్లేమిటి ?
వీరు ఏ ఏ రంగాలకు చెందినవారు ?


Vol. No. 01 Pub. No. 241
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం