బాబాయి కూతురు పెళ్ళి. చాలారోజుల తర్వాత దగ్గర బంధువులింట్లో పెళ్ళేమో చాలా ఉత్సాహంగా బయిల్దేరాను . చిన్నప్పుడు పెళ్ళంటే ఎంత హడావిడి. నెలరోజుల ముందే పనులు మొదలైపోయేవి. అందులోనూ ఆడపిల్ల పెళ్ళంటే మాటలా ? పచ్చటి కొబ్బరాకుల చుట్టిన స్థంభాలతో వేసిన చలువ పందిరి, కర్పూరపు దండలు, పానకాలు, పప్పు దప్పళంతో విందు భోజనం ఇలా ఎన్నెన్నో...! చాలాకాలం తర్వాత చూడబోతున్నందుకు నా మనస్సు ఆనందంలో మునిగిపోయుండగా నేను మాత్రం బాబాయింట్లో తేలాను. ఇంటి ముందు పెళ్లి పందిరి కనబడలేదు. అంతే కాదు ఎక్కడా హడావిడి లేదు. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది . నాకర్థం కాలేదు. లోపలకెళ్ళాను. అక్కడక్కడా కొన్ని సామానులు కనిపిస్తున్నాయిగానీ ఎక్కడా మనుష్యుల అలికిడి లేదు. ఇంతలో పెరట్లోంచి పిన్ని వచ్చింది. " రారా ! శంకరం !! ఇదేనా రావడం ? సీతా పిల్లలేరి ? ఉండు. మంచినీళ్ళు తాగాక మాట్లాడుకుందాం " అని లోపలికి వెళ్ళిపోయింది. అదే హడావిడి. పిన్నెప్పుడూ అంతే! తన ధోరణి తనదే . మన మాట పట్టించుకోదు. " " బాబాయి లేడా పిన్నీ ? " కాఫీ కలుపుతుండగా అడిగాను. " ఏదో కోర్ట్ పని ఉందని రాజమండ్రి వెళ్ళారు. సాయింత్రానికి వచ్చేస్తారు. సీతా పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదు ? " అని మళ్ళీ అడిగింది. " పిల్లలిద్దరికీ పరీక్షలు జరుగుతున్నాయి పిన్నీ ! రాలేకపోతున్నందుకు సీత చాలా బాధపడింది. ఏం చేస్తాం ? కుదరలేదు. అవునూ ! సుజీ ఏదీ ? కనబడదేం ? " చుట్టూ చూస్తూ అడిగాను. " ఇంకా రాలేదు. బహుశా రేపు బయిల్దేరి వస్తుంది. ఏమిటో ! ఈ చదువులు !! " అంది పెదవి విరుస్తూ. " అదేమిటి ? నాల్గు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా రాకపోవడం ? " ఆశ్చర్యంగా అడిగాను. " అయినా అదొచ్చి ఏం చేస్తుంది చెప్పు. అనవసరంగా చదువు పాడవడం తప్ప " అంది అతి మామూలుగా. ఆలోచిస్తే నాకూ అదే అనిపించింది. " పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయినట్లేనా పిన్నీ ? " అనడిగాను. " ఆ ! ఈ రోజుల్లో ఏర్పాట్లు చెయ్యడం ఎంత సేపు ! హైదరాబాద్లో అక్షయమో ఏదో పెళ్ళిళ్ళకి చాలా గొప్పగా ఏర్పాట్లు చేస్తారట. చాలా పేరట కదా ! ముహూర్తం పెట్టగానే మీ బాబాయి వాళ్లతో మాట్లాడేసారు. అసలే అమెరికా సంబంధమాయే ! గ్రాండ్ గా ఉండాలిగా ! వాళ్లక్కావాల్సిన ఏర్పాట్లూ అవీ మనకేం తెలుస్తాయి చెప్పు శంకరం ! " అని చెప్పుకుంటూ పోతోంది. హైదరాబాద్లో ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు, బఫే భోజనాలూ చూసి చూసి మొహం మొత్తి అచ్చమైన కల్తీ లేని సాంప్రదాయపు పెళ్లి మళ్ళీ చూసే అవకాశం వచ్చిందని, నాల్గు రోజుల ముందరే వెళ్లి బాబాయికి పెళ్లి పనుల్లో సాయపడాలని మా బాస్ ని బతిమాలి సెలవు పెట్టి వచ్చిన నాకు తలతిరిగినట్లయింది. పల్లెటూళ్ళో ఇంకా సాంప్రదాయాలు మిగిలి ఉంటాయనే నా నమ్మకం వమ్ము అయినందుకు, మళ్ళీ అదే ఆధునికతను ఇక్కడ కూడా చూడాల్సి వచ్చినందుకు బాధేసింది. నా సంబరమంతా ఆవిరైపోయింది. చెయ్యాల్సిన పనులమీ లేవుకదా కనీసం పాత స్నేహితుల్నైనా కలుసుకుందామని ఊరిమీద పడ్డాను.
Saturday, October 10, 2009
Friday, October 9, 2009
ప్రజలు గొర్రెల మందలా ?
ఉద్యమాలన్నీ సాధారణంగా ఉన్నతమైన ధ్యేయాలతోనే ప్రారంభిస్తారు. భాదిత వర్గంనుంచే ఉద్యమాలు పుడతాయి. కాకపోతే క్రమేణా అందులో రాజకీయనాయకులు ప్రవేశిస్తారు. తమ రాజకీయ లబ్ధికి అనుకూలంగా వాటిని మలుచుకుంటారు. దాంతో ఆ ఉద్యమ ధ్యేయం ప్రక్కకేళ్ళిపోతుంది. ప్రారంభించినవారు అయోమయంలో పడిపోతారు. నెమ్మదిగా ఉద్యమం నీరసించిపోతుంది. మరుగునపడిపోయామనుకున్న రాజకీయ నాయకులకి మళ్ళీ జీవం ఇస్తుంది. ఉద్యమ పునాదులపైన కొంతమంది కొత్త రాజకీయనాయకులు పుట్టుకొస్తారు . ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంద్ర రాష్ట్రసాధన కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకి ఇప్పటి రాజకీయనాయకులకున్న తెలివితేటలు లేవనుకుంటా ! ఉంటే 58 రోజులు నిరాహారదీక్ష చేసేవాడుకాదు. ఏ వారం రోజులో చేసి పెద్దల్ని రప్పించుకుని తన రాజకీయ ప్రయోజనాలపైన స్పష్టమైన హామీలను పొంది నిమ్మరసం తాగేసేవారు. ఉద్యమ ఉద్దేశాలను గంగలో కలిపేసేవారు.అప్పుడు ఆంద్ర రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం ఉండేదికాదు. గుంటూరులో అమృతరావు అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన ఉద్యమంలో నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి. పెద్ద ఉక్కు కర్మాగారం వచ్చినా ఆతన్ని మాత్రం మరిచిపోయాం. దానికి కారణం బహుశా అతను రాజకీయనాయకుడు కాకపోవడమేనేమో! ప్రజలలోంచి పుట్టిన ఉద్యమాల పరిస్థితే ఇలాఉంటే ఇక రాజకీయనాయకులు ప్రారంభించిన ఉద్యమాలేలా ఉంటాయో ప్రస్తుత తెలంగాణా ఉద్యమాన్ని చూసి తెలుసుకోవచ్చు. దాన్ని కే.సి.ఆర్. ఎన్ని మలుపులు తిప్పాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరో మలుపు. ఉద్యమాల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల నాయకత్వం మీద ప్రజలకు విశాసం పోయిందనేది మొన్నటి ఎన్నికలు నిరూపించాయి. నిజానికి తమకు కావలిసింది మౌలిక సదుపాయాలేగానీ ఏ రాష్ట్రంలో ఉన్నామనేది కాదని నిరూపించారు. ఎంతగా ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టినా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త పల్లవి వినిపిస్తోంది. అదే కులబేదాలు. మహాత్మా గాందీ కులమేమిటో ప్రజలేవరూ పట్టించుకోలేదు. ఆయనా పట్టించుకున్న దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనబడవు. ఇంతకాలం తర్వాత రోశయ్యగారి పుణ్యమాని కే.సి.ఆర్. ప్రజలకు గుర్తుచేస్తున్నారు. ప్రజలు తమ శక్తి ఏమిటో అంత స్పష్టంగా చెప్పినా ఇంకా అర్థం కాకపోవడం అతని అజ్ఞానమా? కాదు. ప్రజల జ్ఞాపకశక్తి మీద అతనికున్న అపార నమ్మకం, త్వరలోనే అన్నీ మర్చిపోతారని. ప్రజలు గొర్రెల మందని అతని నిశ్చితాభిప్రాయం. దాదాపుగా రాజకీయనాయకులందరి అభిప్రాయం కూడా అదేననుకోండి. ప్రాంతీయ బేధం అంతగా పని చెయ్యలేదు. ఇప్పుడీ కులాల్ని అడ్డుపెట్టుకుని కొంతమందినైనా కదిపితే మళ్ళీ అందరూ నెమ్మదిగా తన వెనుక వచ్చేస్తారనే భావన కే.సి.ఆర్. కి ఉందనుకుంటా !
ఎన్నికల్లో పోటీ చేయడానికి దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగం ప్రకారం అర్హుడే ! కానీ రాజకీయాలు ప్రస్తుతం డబ్బూ, పలుకుబడి, కులం, దాదాగిరి అనే వాటి చుట్టూ తిరుగుతున్నాయి. అవే నిజమైన ప్రజాసేవకుల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఆ అవకాశాన్ని ఈ వ్యవస్థ కల్పించదు. కనుక దీనికున్న ఒకే ఒక పరిష్కారం ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలను పట్టించుకోకుండా ప్రజాసేవ చెయ్యాలనే తలంపు ఉన్న ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తర్వాత కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ! లేకపోతే మళ్ళీ మళ్ళీ వీళ్ళే పోటీ చేస్తుంటారు. వీళ్ళలోనే ఎవరో ఒకరిని ఎన్నుకోక తప్పనిపరిస్థితి. కానీ అలా పోటీ చెయ్యడం, సమైక్యంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం సాధ్యమా ? ఎన్ని సాధ్యం కాలేదు ? ఇది కూడా సాధ్యమౌతుందని ఆశిద్దాం !! మనిషి ఆశాజీవి కదా ! క్షమించాలి. నా రాజకీయ పరిజ్ఞానం పరిమితం. అయినా నేను కూడా ఆశాజీవినే !
ఎన్నికల్లో పోటీ చేయడానికి దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగం ప్రకారం అర్హుడే ! కానీ రాజకీయాలు ప్రస్తుతం డబ్బూ, పలుకుబడి, కులం, దాదాగిరి అనే వాటి చుట్టూ తిరుగుతున్నాయి. అవే నిజమైన ప్రజాసేవకుల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఆ అవకాశాన్ని ఈ వ్యవస్థ కల్పించదు. కనుక దీనికున్న ఒకే ఒక పరిష్కారం ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలను పట్టించుకోకుండా ప్రజాసేవ చెయ్యాలనే తలంపు ఉన్న ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తర్వాత కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ! లేకపోతే మళ్ళీ మళ్ళీ వీళ్ళే పోటీ చేస్తుంటారు. వీళ్ళలోనే ఎవరో ఒకరిని ఎన్నుకోక తప్పనిపరిస్థితి. కానీ అలా పోటీ చెయ్యడం, సమైక్యంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం సాధ్యమా ? ఎన్ని సాధ్యం కాలేదు ? ఇది కూడా సాధ్యమౌతుందని ఆశిద్దాం !! మనిషి ఆశాజీవి కదా ! క్షమించాలి. నా రాజకీయ పరిజ్ఞానం పరిమితం. అయినా నేను కూడా ఆశాజీవినే !
లేబుళ్లు:
వర్తమానం
Wednesday, October 7, 2009
పెను ఉత్పాతాలు- నా అనుభవాలు
మన రాష్ట్రంలో పెను ఉత్పాతాలుగా చెప్పుకునే రెండు వైపరీత్యాల్లో నా అనుభవాలు.
1. 1977 నవంబర్ 19 వ తేదీన సం
భవించిన దివిసీమ ఉప్పెన అర్థరాత్రి - కృష్ణ , గుంటూరు జిల్లాల ప్రజలకు కాళరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా సముద్రం ఒక్కసారిగా విరుచుకుపడింది. అధికారిక లెక్కల ప్రకారం 10,౦౦౦ మంది శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. అనధికారిక లెక్క లక్ష పై మాటే ! ఎక్కడచూసినా గుట్టలుగా మనుష్యుల, పశువుల శవాలు. ఎటు తిరిగినా కూలిపోయిన ఇళ్ళూ, చెట్లూ!! ఆ దృశ్యం వర్ణించలేను. తమ కళ్ళ ముందే మనుష్యుల్ని, పశువుల్ని తాడిచెట్టు పరిమాణానికి ఎగరవేస్తుంటే..... బాధితులు చెబుతుండగా వింటుంటేనే నాకు ఒళ్ళు జలదరించింది. మరి స్వయంగా చూసిన వాళ్ల పరిస్థితి..... ....? 20 వ తేదీన దివిసీమ చేరే దారిలేక గుంటూరు జిల్లాలో బాపట్ల ప్రాంతానికి అతి కష్టం మీద చేరుకోగలిగాను. ఆ బీభత్సకర దృశ్యాల్ని చూసి మనసు కకావికలమై పోయింది దివిసీమ వెళ్లాలనుకున్నా ధైర్యం చాలక వెనుదిరిగాను.
2. 1986 ఆగష్టు నెల లో గోదావరికి వచ్చిన వరద

ఆగష్టు 15 వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం. జెండా వందనం జరిగింది. అప్పుడే ఒక మిత్రుడు కబురు మోసుకొచ్చాడు. గోదావరి ఉప్పొంగి మా కోనసీమను చుట్టుముట్టిందని. ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతాలు తప్ప మిగిలిని ప్రాంతమంతా జలదిగ్భంధమైపోయింది . అప్పటికి వారం రోజులనుండి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆరోజే తెరిపిచ్చాయి. రెండురోజులుగా వరద హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. అయితే వర్షాలు, వరదలూ అలవాటైపోయిన ప్రజలు అది మామూలు విషయంగానే తీసుకున్నారు. అదీకాక ఇంతటి సమాచార వ్యవస్థ అప్పుడులేదు. రేడియోనే ఆధారం. అదికూడా చాలా తక్కువమందికే ఉండేది. వరద తీవ్రత సమాచారం ప్రజలకి చేరకముందే వరద చేరిపోయింది. లంక గ్రామాలన్నీ ముంచేసింది. అంతకంతకూ పెరుగుతున్న ప్రవాహం మధ్యనుంచి ఇళ్ళ పైకప్పులమీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ప్రజల్ని ఒడ్డుకి చేర్చటం గగనమైపోయింది. అక్కడక్కడా పాక్షికంగా మునిగిపోయిన ఇళ్లలోని జనం తమ ఆస్తుల్ని వదిలి రావడానికి మొండికేసేవారు. వాళ్ళని బ్రతిమాలి, మొండికేస్తే బెదిరించి సురక్షిత ప్రదేశాలకు తీసుకురావలసి వచ్చేది. రహదారులన్నీ తెగిపోయాయి. రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ కుప్పకూలాయి. స్థంబాలు నేలకోరగటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గట్లు తెగిపోకుండా యువకులు, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది కలిసికట్టుగా కాపలాకాసి కొన్ని గ్రామాలను కాపాడగలిగారు. అప్పటి అమలాపురం ఆర్డీవో శ్రీ సుబ్రహ్మణ్యం గారు యువకుడు. సాహసి. విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్న గోదావరిలోకి అందుబాటులో ఉన్న మామూలు నాటు పడవలో వెళ్లి మునిగిపోతున్న ఊరిని, ప్రజల్ని రక్షించడం, ఆ స్ఫూర్తితో నాలాంటి యువకులు సహాయకార్యక్రమాల్లోకి స్వచ్చందంగా దిగిపోవడం నేనింకా మర్చిపోలేను. పోలీస్, రెవిన్యూ వైర్లెస్, ఇలాంటి వైపరీత్యాలు సంభవించినపుడు అత్యవసరంగా ఉపయోగించే టెలీ కమ్యూనికేషన్స్ వారి వైర్లెస్ తప్ప మరే ఇతర సమాచార వ్యవస్థ పనిచేయకపోయినా, ఎక్కడైనా సమస్య ఉందని ఏరకమైన సమాచారం అందినా వారి సిబ్బందితో బాటు మమ్మల్ని కూడా సిద్ధం చేసి తక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యే వారు. రహదారులు వరద నీటితో నిండిపోయి, గండ్లు పడి వాహనాలు వెళ్ళే పరిస్థితి లేని చోట కాలినడకన ఆ నీటిలో వెళ్లి రక్షణ కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. ప్రభుత్వాధికారులు రాలేదనే మాట ఎక్కడా వినపడేది కాదు. ఆయన ఇప్పుడేక్కడున్నారో ? అలాంటి అధికారులుంటే ఉద్యోగులకే కాక, ప్రజలకు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఉంటుంది. గోదావరి చరిత్రలో అతి పెద్ద వరదలవి. గణాంకాలు సరిగా గుర్తులేదుగానీ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర వచ్చిన కృష్ణానది నీటిమట్టం కంటే కాటన్ బ్యారేజీ దగ్గర కొంచెం ఎక్కువగానే వచ్చినట్లు గుర్తు. ఇప్పటిలా నీటి ప్రవాహాన్ని నియత్రించే పరిస్థితి లేకపోవడం దీనికి కారణం కావచ్చు. ప్రస్తుతం సుమారుగా ఆ స్థాయి వైపరీత్యాన్ని దగ్గరుండి చూస్తున్న నాకు అప్పటి అనుభవాలు గుర్తుకొచ్చాయి. అయితే ఒక్క విషయం అలా స్పూర్తినిచ్చే అధికారులు ఇప్పుడు అంతగా కనబడడంలేదు. యువకుల్లో యాంత్రికత పెరిగిందేమోననిపిస్తోంది. కృష్ణా వరదల్లో స్వచ్చందంగా సహాయ కార్యకమాల్లో పాల్గొన్న దాఖలాలు అంతగా కనబడలేదు. ఎవరో వచ్చి కాపాడుతారులే మనకెందుకు అనే నిర్లిప్తత కనబడుతోంది. ప్రభుత్వోద్యోగులు కూడా మనుష్యులే ! ఇంతటి విపత్తు సంభవించినపుడు పరిమిత సంఖ్యలో వుండే ప్రభుత్వోద్యోగులు మీదనే ఆధారపడకుండా మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలనే ఆలోచన ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో ఉండాలి. ఆ స్ఫూర్తి ఉంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు.
లేబుళ్లు:
అనుభవాలు
Subscribe to:
Posts (Atom)
ప్రాచుర్యం
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
