రత్తమ్మ, సుందరమ్మలు ఇద్దరూ బిఏ పాసైన కొడుకులతో ఉద్యోగాన్వేషణలో ఉంటారు.
రత్తమ్మ కొడుకు మన కథానాయకుడు రామదీక్షితులు బిఏ. సుందరమ్మ కొడుకు పేరు
అవసరం లేదనుకున్నారేమో రచయిత. అతనికి ఊరూపేరూ లేదు. చిత్రం ఏమిటంటే కొడుకుల
ఉద్యోగాల గురించి తల్లులు ఇద్దరూ మాటలాడుకోవడమే కానీ పురుష పాత్రలు
మాటలాడరు. స్త్రీ పాత్రలతోనే ఈ కథను నడిపించడంలో శ్రీపాద వారు తమదయిన కొత్త
ఒరవడిని ప్రదర్శించడం గమనార్హం.
..... '
శ్రీపాద కథలు ' లో "
తాపీమేస్త్రి రామదీక్షితులు బిఏ " పరిచయం.
" నా గురించి ఒక కథ చెప్పవా? " అని ఒకసారి కుముదం అడిగినప్పుడు " నీలాంటి
వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంటుంది ? " అని కథకుడు తేలికగా తీసి
పారేస్తాడు. కుముదం మౌనం గా ఉండిపోతుంది. వయసుతో పాటు స్నేహం పెరుగుతూ
వస్తుంది. కానీ కుముదం పట్ల కథకుడి అభిప్రాయంలో మార్పు రాదు. వారి మధ్య
అనేక సార్లు సంభాషణలలో జీవితం గురించీ " దాస్యం " గురించి కుముదం చేసిన
ప్రతిపాదనలని మేధావంతుడని తనని తాను భావించుకునే కథకుడు సరిగ్గా
పట్టుకోలేకపోతాడు.
.... '
కథావీధి ' లో బుచ్చిబాబు "
నన్ను గురించి ఒక కథ చెప్పవా? " పరిచయం.
మేడ గది తలుపులు తీసి భయంభయంగా దిగుతున్న సుకుమారి రాచపిల్లను, మెట్ల మీద
నుంచి, తన మధుర స్వరంలోకి బదలాయించి, సుతిమెత్తగా క్రిందకు దింపినవాడు
ఘంటసాల. పరిశీలనగా విని చూడండి. ఆమె దిగే దృశ్యం, ఆయన గొంతులోంచి
కనిపిస్తుంది. కవిత్వం తెలియని వాళ్ళకి, కరుణశ్రీ తెలియనివాళ్ళకి కూడా
ఆయనెవరో, ఎంతటి మహనీయ కవో తెలియచేసిన వారు ఘంటసాల.
...... ఘంటసాల వర్థంతి సందర్భంగా "
వాగ్దేవికి స్వర నైవేద్యం "
ఇంకా.... చాలా.... ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 09_009
Vol. No. 11 Pub. No. 009