Friday, January 24, 2020

" శ్రీమహావిష్ణు సహస్ర నామసంకీర్తనావళి "... " శ్రీపాద కథలు - శుభికే ! శిర ఆరోహ... " గురించి... “ బోను “... ఇంకా చాలా.....


* ఉమాసోదరా – గోవిందా
రమానాయకా – గోవిందా
భామాసహితా – గోవిందా
రామరామశ్రీ – గోవిందా...... " శ్రీమహావిష్ణు సహస్ర నామసంకీర్తనావళి ", 


* తెలుగుభాషను అవహేళన చేస్తూ తెలుగుతనాన్ని, తెలుగువారిని అపహాస్యం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వారి వస్తువులుగా తీసికొన్న కథ యిది. రచయిత భాషాభిమానం, తెలుగుతనం వేషభాషలపైన మక్కువ స్పష్టంగా ఈ కథలో తెలుస్తాయి. బంధాలు, అభిమానాలు, బంధుత్వాలు, విలువల ముందు ధనము చాలా చిన్నవిషయమని… ప్రేమ, అపేక్ష, ఆత్మీయత ప్రధానమని చాటి చెప్పే కథాంశమిది....." శ్రీపాద కథలు - శుభికే ! శిర ఆరోహ... " గురించి, 

* బోను ఊచల మధ్య ఉన్న ఖాళీలో మూతిని దూర్చి గింజుకొంటోంది ఆ చిట్టెలుక. మూతి పరిమాణాన్ని బట్టి చిట్టెలుక పరిమాణాన్ని అంటే అది చిన్నదో- పెద్దదో తేల్చడం కష్టం. అయితేనేం ! పిండి డబ్బాల్నీ, నూనె జాడీల్ని సునాయాసంగా తోసేసి, బట్టలని చింపేసి, కూరగాయలను తరిగేసే శక్తి ఆ చుంచుకి ఉంది. ఈసారి బయిట మురుగుకాలవలోకి దాన్ని వదిలిపెట్టకూడదని మైదానానికేసి బయిల్దేరాడు..... “ బోను “

.... ఇంకా చాలా..... ఈ క్రింది లింక్ లో..... 



Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 008

Wednesday, January 1, 2020

రాధికా ప్రణయము... కన్యాకాలే యత్నా ద్వరితా... గొల్లపూడి సంస్మరణ.... ఇంకా...


నూతన సంవత్సర శుభాకాంక్షలతో..... 
* గాలికి కదలినఆకులు గలగల మనినా
యమునానదిలో తరగలు జలజల మనినా
ఆశతోడ నాగుండెలు రెపరెప లాడె !
నిరాశతోడ నాహృదయము తటతట లాడె !
- " రాధికా ప్రణయము " 
* స్త్రీలకు ఎనలేని గౌరవమర్యాదలను ప్రసాదించిన మహోన్నతులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. జానకమ్మ, రంగనాయకిలను విశిష్ట స్త్రీ పాత్రలుగా తీర్చిదిద్దారు. రంగనాయకి చాతురితో తన మాటలతో, చేతలతో ఎదుటి వారి మనసును ప్రేమతో గెలువగల నేర్పరి.
- శ్రీపాద కథలు " కన్యాకాలే యత్నా ద్వరితా " పరిచయం
* వెలుగైనా చీకటైనా క్రమంగా వస్తూ..
క్రమంగానే పోతూ సాగిపోవడం కాల ధర్మం.
ఈ సృష్టిలో ప్రతి మార్పుకి‌ ఓ పద్ధతుంది, ఉండాలి కూడా..
మన ఊహలకతీతంగా జరిగే పెనుమార్పు మాత్రం ఒక్కటే.
పారిపోయే ప్రాణం‌ .. మనతోపాటు పరుగెత్తలేకో, నిలబడలేకో
చెప్పాపెట్టకుండా తుర్రుమంటుంది.
- " మార్పు నేర్పు " ( కవయిత్రి స్వరంలో కూడా.... )
* విశేషము ఏంటి అంటే మన పూర్వులు మనకంటే గొప్పవారు. వాళ్ళు చెప్పవలసినవి అన్నీ చెప్పారు. వాటికి clinical significance అంతా  ఇచ్చారు. పాటించటమే మన పని. ప్రశ్నించే అర్హతా లేదు అధికారమూ లేదు. "కాళ్ళకి దణ్ణం పెట్టు అంటే పెట్టటమే ", ప్రశ్నకు చోటు లేదు ఎందుకు అనటానికి వీలు లేదు. 
- " గొల్లపూడి సంస్మరణ " 

ఇంకా... ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 09_007

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 007
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం