Wednesday, October 2, 2019

దుర్గా రూపము... గాంధీయుగం... జాశడువోముత్తు... ఇంకా... చాలా...

గాంధీ జయంతి, దసరా శుభాకాంక్షలతో....
* సర్వజగత్తు సృష్టించిన ఆ తల్లిలో ఎంత కవనమో ఉంది. ఎంత గానమో దాగిఉంది. జగత్ సృష్టికి మించిన కళ ఏమున్నది ? అంతకు మించిన శిల్పమేమున్నది ? ఆమెలో గోచరించని కళలేమి ఉన్నాయి ? సర్వకళా స్వరూపిణి ఆమె. వాణి ఆమె రూపమే. అందువలన నవరాత్రులలో ఒకనాడు ఆమెను సరస్వతిగా పూజిస్తారు.... - "దుర్గా రూపము ".
* గాంధీజీ స్వభావం ఏనాడూ సంఘర్షణల వలనో, సందిగ్ధ పరిస్థితుల వలనో, రాజకీయ విబేధాల వలననో, మనో నిశ్చయాన్ని కోలుపోలేదు. ఏకాగ్రత విడవలేదు. పోరాటం ఆపలేదు. ఏ ఒత్తిళ్ళకీ లొంగి తన పంథా మార్చుకోలేదు. చరఖా వదలలేదు, ఆడంబరాలకీ ఆర్భాటాలకీ తన జీవితంలో చోటివ్వలేదు, అవకాశం ఇవ్వలేదు, తాత్త్వికత గాంధీజీని సత్య తపస్వి ని చేసింది..... "గాంధీయుగం "
* ఉన్నఅంత మందికి అన్నేసి టీవీలు కొనాలంటే... ఇండియాతోపాటు పాకిస్తాన్నీ, క్రిందనున్న శ్రీలంకనీ ‘ భలేమంచి చౌకబేరం ’ లా అయిన కాడికి అమ్మీయాలి. మరదే... ‘ అందరికీ ఒకే ఒక్క టీవీ’ ఉంటే... పుణ్యం పుచ్చి... దానికి కేబల్ కనెక్షన్ వచ్చి చేరితే, ఓ పాతిక ఛానల్స్ జమైతే.... ఆ స్థితి... ఆ ఇంటి పరిస్థితి... ఆయుధాల్లేని కురుక్షేత్రం ! అవధులు లేని రణక్షేత్రం !!..... " జాశడువోముత్తు "

ఇంకా.... ఈ క్రింది లింక్ లో.......
శిరాకదంబం 09_004
  Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 004

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం