Friday, August 29, 2014

గజముఖ గణనాయకా.....

విఘ్ననాయకుడు వినాయకుడు.
గణాధిపతి గణపతి.
పేరు ఏదైనా మనం తలపెట్టిన ప్రతి పని ఏ విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని ఆ విఘ్ననాయకుడిని వేడుకుంటాము. అలాంటి వినాయకుని కొలిచే ప్రత్యేకమైన రోజు వినాయక చవితి.

దేశమంతా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ' గణేశ చతుర్థి ' సందర్భంగా మిత్రులందరికీ హార్థిక శుభాకాంక్షలు 

' కోనసీమ కవికోకిల ' డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి రచన ' గానకోకిల ' శ్రీమతి ఎస్. జానకి గారి స్వరంలో ......... 





Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 06 Pub. No. 002

Saturday, August 23, 2014

' ఈనాడు ' శ్రీధర్.... గుర్తుకొస్తున్నాయి..... ప్రతీచి.... ఇంకా

 కొంతమందికి వారు పని చేస్తున్న సంస్థల వలన పేరు వస్తుంది. మరికొందరి వలన వారు పని చేస్తున్న సంస్థలకు పేరు వస్తుంది. కొందరి  విషయంలో రెండూ జరిగి, వారి పేరుతో  ఆ సంస్థ పేరు కూడా మమేకం అయిపోతుంది. అలా అయిన ఒక కళాకారుడు ' ఈనాడు ' శ్రీధర్. ఆయన వ్రాసిన ' తో. లే. పి. '  .......
సంగీతం అంటే అభిరుచి వుండి నేర్చుకునే అవకాశం లేక, కనీస పరిజ్ఞానమైనా సంపాదించుకోవాలని ఆసక్తి వుండే వారి కోసం ' సంగీతాంబుధి ' శీర్షికన ' శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం ' ..... 
విద్యార్థి జీవితం ఎంతో మధురం. అందరిలో ఆ జ్ఞాపకాలు పదిలం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివే రోజులనాటి జ్ఞాపకాలను అందించే ' గుర్తుకొస్తున్నాయి.... '
మనకున్న ఒకే శక్తి మాట్లాడగలగడం. మాటల శక్తిని వివరించే ' ప్రతీచి '......
గణేశ చతుర్థి శుభాకాంక్షలతో......  ఇంకా చాలా ........ ఈ క్రింది లింక్ లో ...
శిరాకదంబం 04_002



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 001

Friday, August 8, 2014

వరలక్ష్మీవ్రత పుణ్యకథ... అరవిందుల సందేశము...చలువ పందిరులు.... ఇంకా చాలా.....

 ' శిరాకదంబం ' పత్రిక నాలుగవ వసంతం లోనికి అడుగు పెడుతోంది. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక విజయానికి దోహదపడిన పాఠక మిత్రులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు..... అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు.
ఆగష్టు నెల పండుగల మాసం. ఈరోజు ( 07 వ తేదీ, శుక్రవారం ) తెలుగు మహిళలకు అత్యంత పవిత్రమైన వరలక్ష్మీ వ్రతము. ఆ సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలతో .... డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి రచనలో గానకోకిల శ్రీమతి ఎస్. జానకి గళం నుంచి జాలువారిన ' వరలక్ష్మీ వ్రత పుణ్య కథ ' ........

తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాల లాంటి పద్యములెన్నో వున్నాయి. వాటిలో మచ్చుకి కొన్నిటిని పరిచయం చేసే ' ఆణిముత్యాలు ' .........
పిల్లల ఆసక్తి కి కావల్సిన శక్తిని ఇవ్వడానికి తమ జీవితాలనే చలువ పందిరులుగా మలచుకొన్న తల్లిదండ్రుల గురించి ' చలువ పందిరులు '........

ఆగష్టు 15 వ తేదీ శ్రీఅరవిందుల జన్మదినం కూడా ! 1947 సంవత్సరం ఆగష్టు 15 వ తేదీన భారత దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఆ సందర్భంగా ఆరోజు శ్రీఅరవిందులు భారతజాతికి ఇచ్చిన అమూల్యమైన సందేశం ' 1947 ఆగష్టు 15 అరవిందుల సందేశము ' .........
ఇంకా అనేక ఇతర శీర్షికలతో.... ఈ క్రింది లింక్ లో......

శిరాకదంబం 04_001



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No.035
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం