మిత్రులందరికీ నమస్కారం
ప్రతీ సంవత్సరం లాగే ఈ ఉగాది కి కూడా ‘ శిరాకదంబం ’ అంతర్జాల కవిసమ్మేళనం నిర్వహించడానికి
సంసిద్ధమయింది. ఉగాది రోజున ప్రత్యేక సంచిక ద్వారా మీ ముందుకు తెస్తుంది.
శ్రీ జయ నామ సంవత్సర ‘ ఉగాది స్వరాలు ’ శీర్షికన నిర్వహించే ఈ
కార్యక్రమంలో ఈసారి ప్రత్యేకత - పాల్గొన్న
కవితల్లో ఒక ఉత్తమ కవితకు హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి గారు ప్రత్యేక బహుమతి
అందిస్తున్నారు.
ఇందులో
పాల్గొనే కవి మిత్రులు ముందుగా తమ కవితను మెయిల్ చెయ్యాలి. దానితో బాటు అది తమ
స్వంతమే అని, ఎక్కడా ప్రచురణ గానీ, ప్రసారం కానీ కాలేదని, పరిశీలన కోసం ఇంకెవరికీ
పంపలేదని హామీ కూడా జత పరచాలి.
మెయిల్
చేసిన కవితను తమ స్వీయ గళం లో చదివి, రికార్డు చేసి, ఆడియో ఫైల్ కూడా పంపాలి. ముందుగా తమ పేరు, ఊరు చెప్పిన తరువాత ఆ కవిత శీర్షిక చెప్పి కవితాగానం
మొదలు పెట్టాలి.
స్వీయ
గానం లో కవిత నిడివి రెండు నుంచి మూడు నిముషాలు మించకుండా చూసుకోవాలి.
మిగిలిన
వివరాలకు వెంటనే సంప్రదించండి. చివరి తేదీ : 20-03-2014
editorsirakadambam@gmail.com
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 026
No comments:
Post a Comment